ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఈ నెల 15 వరకు సందర్శనకు ‘నో ఎంట్రీ..’

ఈ నెల 15 వరకు.

 

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): పురాతన కట్టడాలు,మ్యూజియం మూసివేతను మరో 15 రోజుల పాటు పొడిగించింది ఏఎస్ఐ. రాష్ట్రంలో ఈ ఆంక్షలు తిరిగి ఈ నెల 15 వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 31 వ తేదీతో గతంలో విధించిన ఆంక్షలు గడువు ముగిసింది. దీంతో మరో 15 రోజుల వరకు వీటిని మూసి ఉంచుతున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఆదివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుతుండడంతో పురాతన కట్టడాలు, మ్యూజియంలను ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏఎస్ఐ పరిధిలోని అన్ని పురాతన కట్టడాలు, మ్యూజియంలను మొదటి దఫా కింద  ఏప్రిల్ 16వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆంక్షలు విధించింది..మళ్లీ మే 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఏఎస్ఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 31వ తేదీతో రెండో దఫా ఆంక్షల గడువు ముగియడంతో తిరిగి మరో 15 రోజుల పాటు వీటిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నెల 15 వరకు సందర్శనకు ‘నో ఎంట్రీ..’
అన్ని పురాతన కట్టడాలు, మ్యూజియంలను వీటిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
 •  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని గోల్కొండ,చార్మినార్,సాలార్ జంగ్ మ్యూజియం లతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలోని  ఆలంపూర్ టెంపుల్, వరంగల్ లోని రామప్ప దేవాలయం, వరంగల్ కోట తదితర పర్యాటక ప్రాంతాలన్నింటినీ జూన్ 15 వరకు మూసి ఉంచుతారు. 
 • లాక్ డౌన్ సడలింపు సమయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా తెరవరు. పర్యాటకులను ఎవరిని సందర్శనకు అనుమతించరు.
 • ఏప్రిల్ 16వ తేదీ నుంచి మొదటి దఫా వచ్చిన ఆదేశాల ప్రకారం నగరంలోని చార్మినార్,సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ కోటను మూసి వేశారు.
 •  సందర్శకులను ఎవరినీ అనుమతించడం లేదు.
 •  ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు గతంలో కన్నాగణనీయంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ..లాక్ డౌన్ కొనసాగుతుండడంతో పర్యాటక ప్రాంతాల సందర్శన నిలిపి వేయడం బెటర్ అని భావించిన ఏఎస్ఐ మరో 15 రోజుల వరకు ఆంక్షలను పొడిగించింది. 
 • కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుండడంతో ..పాజిటివ్ కేసుల సంఖ్య  తగ్గుముఖం పడుతోంది. 
 • దేశంలో కరోనా పాజిటివ్ కేసుల పరిస్థితిని ద్రుష్టిలో ఉంచుకుని  ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పురాతన కట్టడాల మూసివేతను మరో 15 రోజుల పాటు పొడిగించింది. 
 • ఇప్పటికే నగరంలో చారిత్రాత్మకమైన చార్మినార్ కట్టడం తో పాటు గోల్కొండ కట్టడాలు మూసి ఉన్నాయి. ప్రతి రోజు పర్యాటకులతో కిటకిటలాడిన చార్మినార్, గోల్కొండ కోట వీధులన్నీ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.
 •  పర్యాటక ప్రాంతాల పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.
 •  ఇప్పుడు ఏఎస్ఐ ఇచ్చిన ఆదేశాల మేరకు తిరిగి జూన్ 15వ తేదీ వరకు మూసి ఉంటాయి.
 •  ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు.
 • లాక్ డౌన్ కు ముందు చార్మినార్ కట్టడం సందర్శనకు ప్రతి రోజు వేల సంఖ్యలో సందర్శకులు వచ్చే వారు. 
 • లాక్ డౌన్ కు ముందు కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న వేళ కూడా…ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల సందర్శకులు చార్మినార్ సందర్శనకు వస్తుండడంతో ఇక్కడ ప్రతి రోజు సందర్శకుల సందడి కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.
 •  స్థానిక ప్రజలు,పోలీసు అధికారుల ఫిర్యాదుల మేరకు ఏఎస్ఐ ఉన్నతాధికారులు మొదటగా 15 రోజుల పాటు నిరవధికంగా పర్యాటక ప్రాంతాలను మూసి వేశారు. 
 •  తిరిగి ఆశించిన స్థాయిలో పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరో 16 రోజుల పాటు..అంటే మే 31 వరకు పర్యాటక ప్రాంతాల సందర్శన నిలిపి వేశారు. తిరిగి జూన్ 15 వరకు ఆంక్షలను పొడిగించారు.
 • ఇక పాతనగరంలోని మరో చారిత్రాత్మకమైన మక్కా మసీదు లోకి ఏప్రిల్ నెల మొదటి నుంచే విజిటర్స్ ను అనుమతించడం లేదు…