areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి..

టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి...
  • నగరంలో హట్టహాసంగా నిర్వహించిన ర్యాలీ
  • ఒకవైపు రేవంత్ రెడ్డి ర్యాలీ..మరోవైపు అంజన్ కుమార్ యాదవ్ ర్యాలీ
  • భాజా భజంత్రీలు, కళా కారుల న్రుత్యాలతో దారి పొడవునా హంగామా..
  • కలసి పని చేద్దాం..అధికారాన్ని సాధిద్దాం…
  • వ్యక్తిగత నినాదాలు చేస్తే..బాధ్యతల నుంచి తొలగింపు
  • సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి

ఆర్సీ న్యూస్,జూలై 7 (హైదరాబాద్): టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బుధవారం గాంధీభవన్ లో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన మాసాబ్ ట్యాంక్ చేరుకుని అక్కడి నుంచి నాంపల్లి లోని యూసుఫేన్ దర్గాలో చాదర్ పెట్టి పూలు,దట్టీలు సమర్పించారు. అక్కడి నుంచి కార్యకర్తలు,నాయకులతో కలిసి భారీ ర్యాలీతో గాంధీభవన్ చేరుకున్నారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా నాంపల్లి లోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ నుంచి భారీ ర్యాలీతో గాంధీభవన్ చేరుకున్నారు. భాజా భజంత్రీలు, కళా కారుల న్రుత్యాలు, డప్పు చప్పుళ్లతో దారి పొడవునా ఆకట్టుకున్నారు. కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున నాంపల్లి చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. నాంపల్లి యూసుఫేయిన్ బాబా దర్గా నుంచి రేవంత్ రెడ్డి భారీ ర్యాలీతో ముందుకు వస్తుండగా.. అంజన్ కుమర్ యాదవ్ కూడా తన ర్యాలీతో వచ్చి నాంపల్లి వై జంక్షన్ వద్ద కలిసారు. ఇద్దరి ర్యాలీలు ఒక్కటి కావడంతో రేవంత్ రెడ్డి,అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఒకే వాహనంపై నిల్చుని నాయకులు,కార్యకర్తలకు అభివాదం చేస్తూ గాంధీభవన్ చేరుకున్నారు. ఎంతో అట్ట హాసంగా నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన వారితో నాంపల్లి ప్రధాన రోడ్డు కిటకిటలాడింది. ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ జెండాలు కనువిందు చేశాయి. నాయకులు,కార్యకర్తలలో ఉత్సాహాం ఉరకలు వేసింది. నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున చేసిన నినాదాలతో గాంధీభవన్ పరిసరాలలో మారమ్రోగాయు. గాంధీభవన్ చేరుకున్న రేవంత్..ప్రస్తుత పీసీసీ అధ్యక్షులు గా కొనసాగిన ఉత్తం కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కార్యకర్తలు, నాయకులు రేవంత్ రెడ్డి జిందాబాద్..కాబోయే సీఎం ..అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. వ్యక్తిగత నినాదాలు పార్టీకి మంచివి కాదని..సోనియా గాంధీ జిందాబాద్..కాంగ్రేస్ పార్టీ జిందాబాద్..అనే నినాదాలు ఇవ్వాలని కోరారు. ఒక ముందు నుంచి ఏ ఒక్కరూ వ్యక్తిగత జిందాబాద్ లను ప్రోత్సహించ రాదన్నారు. ఎవరైనా అలా చేసే వారుంటే..వారు ప్రధాన బాధ్యతలలో ఉంటే వారిని ఆయా భాధ్యతల నుంచి తొలగించడం జరుగుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సమిస్టిగా పని చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు ఒక్కతాటిపైకి వచ్చి కలసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంద న్నారు. ఎక్కడా మనస్పర్దలకు తావివ్వ వద్దన్నారు. 4 కోట్ల మంది ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే..ప్రస్తుతం 4 గురి చేతిలో 4 కోట్ల మంది బంధీ అయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది తెలంగాణ ద్రోహులు గద్దెనెక్కి ఇష్టమోచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలను రాష్ట్ర ప్రజలు ఎండకడుతున్నారన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, దేశంలో పీఎం నరేంద్ర మోడీ ఇద్దరూ ప్రమాదకరమన్నారు.  వీరిద్దరూ కరోనా వైరస్ కన్నా డెంజర్ అని రేవంత్ రెడ్డి విమర్షించారు. రాబోయే రెండెళ్లు కాంగ్రేస్ పార్టీకి ఎంతో కీలకమైనవని..ప్రతి కార్యకర్త, నాయకుడు రాబోయే రెండుళ్లు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే రెండేళ్లు కుటుంబ సభ్యలకు సెలవు పెట్టాలన్నారు. ఆయనతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, దామోదరం రాజనర్సింహ్మ, ఎమ్మెల్యే సీతక్క, పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు.