areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నగరంలో పచ్చదనం కోసం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులు..

నగరంలో పచ్చదనం కోసం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులు..

 

  • హెచ్ఎండీఏ పరిధిలో రూ.650 కోట్ల నిధులతో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులు
  • అత్యవసరమైన ప్రాణవాయువును అందించడంలో అర్బన్ ఫారెస్ట్ ఫార్క్ లు కీలకం..
  • తెలంగాణలో పచ్చదనం 23.4 శాతం నుంచి 28 శాతం వరకు పెంపు
  • 33 శాతానికి పెరగాలని సీఎం కేసీఆర్ కల
  • పెద్ద అంబర్పేట్ కలాన్ లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్.
  • పాల్గొన్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు.

ఆర్సీ న్యూస్,జూలై 1(హైదరాబాద్): నగరంలో పచ్చదనం కోసం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేస్తున్నట్లు మున్సిఫల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో రూ.650 కోట్ల నిధులతో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్దిచేస్తున్నామన్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన పెద్ద అంబర్పేట్ కాలాన్ లోని అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో మొక్కలు నాటి 7వ విడత హరిత హారం కార్యక్రమాన్నిప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులతో కలిసి ఆయన పెద్ద అంబర్పేట్ కలాన్ లో హరితహారం కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రలో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మ కంగా బావిస్తున్న హరిత హారం,పట్టణ ప్రగతి కార్యక్రమాల సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజ లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులతో పాటు స్థానిక నాయకులు, ప్రజాప్రతి నిధులు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..అత్యవసరమైన ఆక్సీజన్ ను అందించడంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు మనకు ఎంతో కీలకంగా మారుతున్నాయన్నారు. మనకు ఆక్సిజన్ ఎంతో అవసరమనే విషయాలు రెండవ విడత వచ్చిన కరోనా వైరస్ తో స్పష్టమైందన్నారు. ఆక్సీజన్ అందక ఎంతో మంది కరోనా రోగులు మరణించారన్నారు. మన కళ్ల ముందే ఎన్నో దురద్రుష్టకురమైన సంఘటనలు జరిగాయన్నారు. అందుకే మొక్కలను విరివిగా నాటి పచ్చ దనాన్ని కాపాడాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. చెట్లు మనకు కావాల్సినంత ప్రాణ వాయివును అందిస్తాయన్నారు. సీఎం కేసీఆర్ హరిత హారం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నారన్నారు.  తెలంగాణలో పచ్చదనం 23.4 శాతం నుంచి 28 శాతం వరకు పెరిగింద న్నారు. రూ. 5,900 కోట్ల నిధులతో 220 కోట్ల మొక్కలను నాటి దేశంలోనే 3వ అతి పెద్ద మానవ ప్రయత్నంగా తమ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రుషి చేస్తున్నారన్నారు. పచ్చదనాన్ని కాపాడడంలో కేవలం ప్రభుత్వం మాత్రమే కష్టపడితే సరిపోదని..స్థానిక ప్రజలు ముందుకు వచ్చి తమ వంతు బాధ్యతగా భావించి ఖాళీ స్థలాలలో మొక్కలు నాటాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు. మనకు కావాల్సిన ప్రాణవాయివు చెట్ల ద్వారానే వస్తుందని..చెట్లను కాపాడుకునే అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన వెంట ఉండేది చెట్లు మాత్రమేనన్నారు. మొక్కల పెంపకంలో సీఎం కేసీఆర్ చట్టంలో కఠినమైన నిబంధనలు పెట్టారని..100 శాతం నాటిన మొక్కలలో దాదాపు 85 శాతం మొక్కలు బతకక పోతే స్థానిక ప్రజా ప్రతినిధులను ఆయా పదవుల నుంచి తొలగించే విధంగా నిబంధనలు పెట్టారన్నారు. రాష్ట్రంలో 33 శాతానికి పచ్చదనం పెరగాలన్నారు. ఇది కేసీఆర్ కల అని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న పథకాల పట్ల దేశ వ్యాప్తంగా మనకు  ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇప్పటికే మిషన్ భగీరథ, రైతు బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అనుకరిస్తున్నాయన్నారు. రైతు బంధు పథకం గ్రామీణ రైతులకు ఎంతో మేలు చేస్తుంద న్నారు. పచ్చదనం పరిరక్షణలో అటవీ శాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారని రాష్ట్ర అటవీ శాఖ అధికారులు,సిబ్బందిని కేటీఆర్ అభినందించారు.