areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి..సార్..

బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి..సార..
  • దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి విన్నపం.
  • ఈసారి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నందున..ఏర్పాట్లకై వినతి
  • గతేడాది కరోనా వైరస్ ఆంక్షల నడుమ హాడావుడి లేకుండానే బోనాల సమర్పణ
  • ఈసారి లాక్ డౌన్ అమలులో సడలింపులు రానున్నందున ఘనంగా నిర్వహించడానికి  సన్నాహాలు
  • ఇప్పటి నుంచే దేవాలయాల అభివ్రుద్ది పనులు  చేయాలంటున్న ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రతినిధులు

ఆర్సీ న్యూస్,జూన్ 17 (హైదరాబాద్): ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలంటూ భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జూలై 11వ తేదీ నుంచి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభ మవుతున్నందున..ఇప్పటి నుంచే బోనాల ఏర్పాట్లపై కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బ్రుందం సంబందిత మంత్రులను కలిసి వినతి పత్రాలను సమర్పిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన ప్రతినిధులు..దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బోనాల జాతర ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించామని..ఈసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్ డౌన్ అమలులో చాలా వరకు ఆంక్షలు తొలగనుండడంతో బోనాల జాతర ఉత్సవాలు నిర్వహించుకునేందుకు రాష్ట్రం ప్రభుత్వం తగిన అవకాశాలు కల్పించాలని కోరుతు కమిటి ప్రతినిధులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు.

ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో కృషి…

  • కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో 2021లో జరిగే ఆషాడ మాసం బోనాలజాతర ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించ డానికి తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి కోరినట్లు భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్  తెలిపారు.
  • ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులుగా నియమితులైన బత్తుల బల్వంత్ యాదవ్ తమ కమిటి ఉపాధ్యక్షులు కె.ఎస్.ఆనంద్ రావు, వేణు గోపాల్, ప్రధాన కార్యదర్శి ఎం. మధుసూదన్ యాదవ్,కార్యదర్శి గాజుల రాహుల్ (గబ్బర్) లతో కలిసి ఈసారి బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించ డానికి కృషి చేస్తున్నారు.
  • ఇందులో భాగంగా మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించి..బోనాలజాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
  •  నెల రోజులకు ముందుగానే కార్యాచరణ రూపొందించు కుని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
  • అయితే ఈ నెల 19వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉండడంతో పాటు దేవాలయలు,మసీదులు, ఆడిటోరియం,సినిమా హాల్స్, పర్యాటక ప్రదేశాలు తదితర వాటిపై ఆంక్షలను తొలగిస్తారనే నమ్మకంతో అమ్మవారి భక్తులు ఉన్నారు.
  • కరోనా వైరస్ వ్యాప్తి,వాక్సినేషన్, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, వ్యపారాల కొనసాగింపు, లాక్ డౌన్ అమలుతో పాటు ఆంక్షల సడలింపు తదితర అంశాలపై రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 18న ప్రగతి భవన్ లో సమావేశం కానుంది.
  •  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అద్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఒకవైళ సాంకేతిక కారణాలతో సమావేశానికి అవకాశం లేకపోతే సంబందిత మంత్రులతో మాట్లాడి సీఎం కేసీఆర్ తగిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
  • ఈ నేపధ్యంలో కమిటి ప్రతినిధులు ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వినతి ప్రతం సమర్పించడంతో ఆయన  సానుకూలంగా స్పందించినట్లు బత్తుల బల్వంత్ యాదవ్ తెలిపారు.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి దేవాలయం ఈఓ లేఖ…

  •  అలాగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి దేవాలయం ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) ఈ నెల 7వ తేదీన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఈసారి జరిగే బోనాలజాతర ఉత్సవాల వివరాలను పొందుపరుస్తు ఒక లేఖను అందజేశారు.
  • ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా జూలై 11న అమ్మవారి ఘటోత్సవం ఉంటుదని ఆ లేఖలో పేర్కొన్నారు.
  • జూలై 25న అమ్మవారికి బోనాల సమర్పణ ఉంటుందన్నారు.
  • అలాగే బోనాల సమర్పణ మరుసటి రోజైన 26న, రంగం తదితర కార్యక్రమాలుంటాయని ఆ లేఖలో మంత్రి తలసానికి వివరించారు.

గతేడాది ఆంక్షల నడుమ బోనాల జాతర ఉత్సవాలు…

  • గతేడాది భక్తులెవరు లేకుండా ఇళ్లల్లోనే అమ్మవారికి బోనాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో నగరంలోని అన్ని ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్దలతో దేవాలయాలలో కాకుండా ఇళ్లలోనే బోనాలను సమర్పించారు.
  • కోవిడ్ 19 కారణంగా ఆషాడ మాసం మొత్తం నెల రోజుల పాటు బోనాల జాతర ఉత్సవాలు జరిగాయి. .
  •  దేవాలయాల అర్చకులతో పాటు ఆలయ కమిటి ప్రతినిధులు అమ్మవారికి బోనం సమర్పించారు.
  • బోనాల సమర్పణ అనంతరం మరుసటి రోజు నిర్వహించిన సామూహిక అమ్మవారి ఘటాల ఊరేగింపు కూడా సాదాసీదాగా భక్తులెవరూ లేకుండానే కొనసాగింది.