సెప్టెంబర్ 16, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బోనాల జాతర ఉత్సవాలకు రూ.15 కోట్లు..

బోనాల జాతర ఉత్సవాలకు రూ.15 కోట్లు..

 

  • ఉత్సవాల ఏర్పాట్లు,నిర్వాహణపై ఈ నెల 25న అత్యున్నత స్థాయి సమావేశం
  • ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం..
  • ఆదేశాలు జారీ చేసిన స్టేట్ ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్
  • ఒకవైపు కరోనా కట్టడికి చర్యలు..మరోవైపు ఘనంగా బోనాలకు ఏర్పాట్లు
  • బోనాల జాతరకు గైడ్ లైన్స్ జారీ చేయనున్న ప్రభుత్వం
  • జూలై 11న, గొల్కొండ జగదాంబ అమ్మవారి బోనంతో ఉత్సవాలు ప్రారంభం

ఆర్సీ న్యూస్,జూన్ 24 (హైదరాబాద్): బోనాల జాతర ఉత్సావాలను పురస్కరించుకుని అమ్మవారి దేవాలయాల అభివృద్ది, ఉత్సవాల నిర్వాహణ, ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈసారి జరిగే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తగిన ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించే ఆషాడ మాసం బోనాల  ఉత్సవాల సందర్బంగా ప్రతి ఏడాది బోనాల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతాయి. ఇందులో భాగంగా ఈసారి జరిగే ఆషాడ మాసం బోనాల జాతర నిర్వాహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్డీ) లో ఉదయం 11 గంటలకులో అత్యున్నత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ మేరకు సమావేశం ఉందని..అధికరులందరూ హాజరు కావాలని ఈ నెల 23న, స్టేట్ ఛీప్ సెక్రటరీ సోమేష్ కుమార్ మెమో విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్, ట్రాన్స్ కో చైర్మన్, జూ పార్క్ క్యూరేటర్, ఆర్ అండ్ బీ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, సజ్జనార్ లతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాలను ఎలా నిర్వహించాలి.. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, ఆంక్షలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈసారి బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్శహించడానికి ఉత్సవాల నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే  భాగ్యనగర్ శ్రీ మహాంకాళి  బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బ్రుందం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. తమ వినతి మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందించి శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్, ఉపాధ్యక్షులు కె.ఎస్.ఆనంద్ రావులు తెలిపారు. శుక్రవారం జరిగే సమావేశానికి ఇప్పటికే తమకు ఆహ్వానాలు అందాయని వారు తెలిపారు. ఈ సమావేశానికి పాతబస్తీలోని 25 ప్రధాన దేవాలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కావాలని ఆయన కోరారు. ఒక్కో దేవాలయానికి కేవలం ఒకే ఒక్క ప్రతినిధి హాజరు కావాలని  బల్వంత్ యాదవ్ సూచించారు. నగరంలో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు  జూలై 11వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి నిర్వహించే మొదటి బోనంతో ప్రారంభమవుతున్నాయి. గతేడాది కోవిడ్ -19 ఆంక్షల నడుమ ఎలాంటి హడావుడి లేకుండా నిరాడంబరంగా జరిగిన బోనాల  ఉత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహించడానికి బోనాల జాతర ఉత్సవాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకుం టున్నారు. అయితే శుక్రవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో ఉదయం 11 గంటలకు జరిగే సమా వేశంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకునే చర్యలతో పాటు బోనాల  ఉత్సవాల నిర్వాహణకు దిశ నిర్దేశం చేయనుంది. బోనాల జాతర ఉత్సవాలలో ఎలాంటి గైడ్ లైన్స్ జారీ చేస్తుందో వేచి చూడాలి..మరి.