areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాష్ట్రం లో లాక్ డౌన్ విధించబోం: సీఎం కేసీఆర్

రాష్ట్రం లో లాక్ డౌన్ విధించబోమం: సీఎం కేసీఆర్

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): రాష్ట్రం లో లాక్ డౌన్ విధించబోమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధిస్తే..అన్ని రకాల ఆర్ధిక ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. గతేడాది లాక్ డౌన్ విధించడంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలిందన్నారు. అందుకే ఈసారి లాక్ డౌన్ వైపు మొగ్గు చూపడం లేదన్నారు. లాక్ డౌన్ తో ప్రజా జీవనం స్థంబించి పోతుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ సందర్బంగా ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే లాక్ డౌన్ విధించినప్పటికీ..ఏ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గ లేదని సీఎం కేసీఆర్ అన్నారు. లాక్ డౌన్ విధించినప్పటికీ కేసలు సంఖ్య తగ్గనందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. గురువారం సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సంబందిత ఉన్నతాధికారు లతో కరోనా వైరస్ వ్యాప్తి, ఆసుపత్రులలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు, ఆక్సీజన్ సరఫరా, రెమిడెసివిర్ ఇంజక్సన్లు, వాక్సిన్ పంపిణీ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీకా్స సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు అంశాలను చర్చించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం మెడికల్ హబ్ గా పేరు గాంచిందని..అందుకే ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు సైతం ఇక్కడ వైద్య సేవలు పొందడానికి వస్తున్నారన్నారు. దీంతో ఇక్కడి ఆసుపత్రులన్నీిఇతర రాష్ట్రాల రోగులతో 50 శాతం నిండిపోయాయన్నారు. అయినప్పటికీ..అందరికి సక్రమంగా వైద్య సేవలను అందించాలని..ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు, ఆక్సీజన్, లైఫ్ సేవ్ ఇంజక్సన్స్ తదితర వాటిని వెంటనే తమ రాష్ట్రానికి పంపించాలని సీఎం కేసీఆర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడి సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. రెమిడెసివిర్ ఇంజక్సన్లు రోజుకు 4900 మాత్రమే అందుతున్నాయని..వీటిని కనీసం 25000 కు పెంచాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరారు. అలాగే రాష్ట్రానికి ఇప్పటి వరకు 50 లక్షల డోసుల వాక్సిన్లను అందజేసిందని..వాస్తవానికి రోజుకు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వాక్సిన్లు అవసరం ఉంటాయని..ఆమేరకు సరఫరా చేయాలని కేంద్రాన్నికోరారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9500 ఆక్సీజన్ బెడ్లు ఉన్నాయని..రాబోయే వారం రోజుల్లో మరో 5000 ఆక్సీజన్ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సంబందిత అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని..ప్రభుత్వ,ప్రైవేట్ ఆసుపత్రులలో ఇప్పటి వరకు 1.56 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా..ఇందులో 1.30 లక్షల మంది కోెలుకున్నారన్నారు. అంటే కరోనా వైరస్ సోకిన వారిలో వైద్య చికిత్సలు పొంది 85 శాతం మంది రోగులు నయమవుతున్నారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తో పాటు ఇతర అంశాలపై ప్రతిరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి ఎప్పటికప్పడు వివరాలను ప్రజలకు తెలియజేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. కరోనా నియంత్రణ కోసం వైద్య శాఖ తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్సించడం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వైద్య శాఖకు అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణారావును ఆదేశించారు. మొదటి డోస్ వాక్సిన్ వేసుకున్న వారికి రెండో డోసు వేయడానికి సకాలంలో స్పందించాలన్నారు. రెండో డోసును నిర్దేశిత సమయంలోనే అందజేయాలని సీఎం ఆదేశించారు. ఆసుపత్రులలో ఆక్సీజన్ కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర వ్యప్తంగా పట్టణాలతో పాటు గ్రామాలలో కూడా వీధులలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచ్ కారి చేయించాలన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని..ఏమాత్రం కోవిడ్ లక్సణాలున్నా..వెంటనే వారి ఇంటి వద్దకు వెళ్లి కోవిడ్ మందుల కిట్లను అందజేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు.

 

సీఎం ఆదేశాల తో రంగంలోకి పోలీసులు.. వైద్య,ఆరోగ్య శాఖ నుంచి ఈటెల ఔట్… రాష్ట్రంలో మే 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు… రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ మే 8 పొడిగింపు. ఈటెల రాజేందర్ పై మలుపులు తిరుగుతున్న భూ కబ్జాల దుమారం.
సీఎం ఆదేశాల తో రంగంలోకి పోలీసులు.. వైద్య,ఆరోగ్య శాఖ నుంచి ఈటెల ఔట్… రాష్ట్రంలో మే 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు… రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ మే 8 పొడిగింపు. ఈటెల రాజేందర్ పై మలుపులు తిరుగుతున్న భూ కబ్జాల దుమారం.