సెప్టెంబర్ 15, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఆక్సిజన్ కొరత వస్తే కేంద్రానిదే భాధ్యత : ఈటెల రాజేందర్

ఆక్సిజన్ కొరత లేదు…. మంత్రి ఈటెల రాజేందర్..

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేదని..ఒకవేళ ఆక్సీజన్ కొరత వస్తే దానికి కేంద్రానిదే బాధ్యత అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం నాడిక్కడ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ..కేంద్రం పై నిరసన తెలిపారు. తమ వద్ద ప్రస్తుతం ఆక్సిజన్ సమస్య లేదని..తగినన్ని నిల్వల కోసం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామన్నారు. సకాలంలో ఆక్సీజన్ సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే నన్నారు. కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ కరోనా కట్టడి కోసం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందన్నారు. 99.5 శాతం మంది కరోనా సోకినప్పటికీ వైద్య సేవలు పొంది నయమయ్యారన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేదన్నారు.దేశంలో ఎక్కడ చూసినా..ఆక్సీజన్ కొరత కనిపిస్తోందన్నారు. తాము అవసరమైన మేరకు ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నామన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆక్సీజన్ సరఫరాను కేంద్ర ప్రభుత్వమే చూస్తుందన్నారు. ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రం తగినంత ఆక్సిజన్ పరఫరా చేయాల్సి ఉంది. అయితే ఈ విషయంలో కేంద్రం సరిగ్గా స్పందించడం లేదన్నారు.మంత్రి ఈటెల రాజేందర్ ఇంకా ఏమన్నారంటే…

  •  ఆక్సీజన్ సరఫరా కేంద్రం పరిధిలో ఉన్నందున సరిపడా సప్లై చేయాలన్నారు.
  •  మనకు 260 నుంచి 270 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ కావాలంటూ కేంద్రానికి లేఖ రాశామన్నారు. 
  • తమ వినతి మేరకు స్పందించిన కేంద్రం దగ్గరలో ఉన్న ఫ్లంట్ ల నుంచి కాకుండా ఎక్కడో 13 వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒడిస్సా నుంచి తెచ్చుకోవాలని కోరిందన్నారు. 
  • ఇదేలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. 
  • తమకు బల్లారి, విశాఖపట్నం, శ్రీపెరుంబదురు దగ్గరవుతుందని..ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ద్రుష్టికి తీసుకెళ్లగా సరే..చూద్దాం అంటూ మాట్లాడారన్నారు. 
  • దేశంలోని ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వానికి సమానమేననే భావనతో పని చేస్తే భావుంటుందన్నారు.
  •  వివక్షతో రాష్ట్రాల ప్రజలను చూడొద్దన్నారు.
  •  దూర ప్రాంతాల నుంచి అవసరమైన ఆక్సిజన్ తరలింపుకు ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలు అవసరం ఉంటాయని..అందుకే కేంద్రమే విమానాల ద్వారా అసరమైన ఆక్సిజన్ సప్లై చేయాలని మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. 
  •  అవసరమైతే  పరిశ్రమలకు కాకుండా వైద్య రంగానికి ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయాలన్నారు. 
  • ఆక్సిజన్ కొరత స్రుష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. 
  • అలాగే రెమిడిసివిర్ ఇంజక్షన్ల విషయంలో కూడా కొంత మంది బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్లు సమాచారం అందుతోందని..అలాంటి బ్లాక్ మార్కెట్ గాళ్లను వదిలి పెట్టమన్నారు.
  •  తాము రెమిడిసివిర్ ఇంజెక్షన్ కోసం ఇప్పటికే 2 లక్షల డోసులు కావాలని కోరగా..మన ముఖ్యమంత్రి సూచనల మేరకు మరో 2 లక్షలు కలిపి మొత్తం 4 లక్షల డోసులు కావాలని కోరితే..రాబోయే పది రోజులకు కేవలం 21550 డోసులు మాత్రమే పంపుతామని కేంద్రం నుంచి లేఖ వచ్చిందన్నారు.
  •  వాస్తవానికి రెమిడిసివిర్ ఇంజక్షన్స్ మన రాష్ట్రంలోనే తయారవు తాయని..మన వద్ద తయారయ్యే వాటిని ముందుగా మనకు సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
  •  మొన్నటి వరకు ఈ ఇంజక్షన్స్ పై కేంద్రం ప్రభావం లేకుండే..ప్రస్తుతం కేంద్రం పరిధిలోకి వెళ్లిందన్నారు.
  •  దీంతో ఇక్కడ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. 
  • 95 శాతం మందిలో కరోనా వైరస్ లక్షణాలు లేవన్నారు. 
  • కేవలం 0.5 శాతం మందికే కరోనా వైరస్ లక్షణాలున్నాయని.. వీరు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారన్నారు. 
  • ప్రస్తుతం రాష్ట్రంలో 60 వేల పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు.
  •  పీపీఈ కిట్లు,మందులు,అంబులెన్స్ లు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు.
  •  వాక్సినేషన్ పంపిణీ సక్రమంగా జరుగుతోందని..అయితే తమకు అవసరమైన మేరకు కేంద్రం వ్యాక్సిన్ సరఫరా చేయడం లేదన్నారు. 
  • కరోనా వైరస్ కట్టడి కోసం టెస్టులు అధికంగా చేస్తున్నామన్నారు.
  •  అవసరమైతే 2 లక్షల టెస్టులు చేయడానికి కూడా సిద్దంగా ఉన్నామన్నారు. 
  • ఆంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులంటూ ప్రజలను అయేమయానికి గురిచేయడం సరైంది కాదన్నారు.
  •  ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే..రిజల్ట్ రావడానికి సమయం పడుతుందని..అందుకే ఆంటిజన్ టెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయని మంత్రి ఈటెల రాజేందర్  స్పష్టం చేశారు.
  • కరోనా కట్టడిలో తమ రాష్ట్రం దేశంలోనే ముందున్నదని..దీని కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
  •  మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని..అక్కడి నుంచి మన రాష్ట్రానికి రాకపోకలు ఎక్కువ కావడంతో మన వద్ద కూడా కేసులు పెరుగుతున్నాయన్నారు. 
  • ఎన్ని కేసులు పెరిగినా…అందరికి వైద్య సేవలు అందించడానికి తమ వైద్య సిబ్బంది సిద్దంగా ఉన్నారన్నారు.
  •  హైదరాబాద్ నగరం హెల్త్ హబ్ గా పేరుగాంచిందని..అందుకే ఇక్కడ 50 శాతం మంది రోగులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు  వైద్య సేవలు పొందుతున్నారన్నారు.