- తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు..
- ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 1280 నమోదు కాగా..15 మంది మ్రుతి
- మే 12వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు కొనసాగిన లాక్ డౌన్
- జూన్ 10వ తేదీ నుంచి పగటిపూట లాక్ డౌన్ తొలగింపు
- ఈ నెల 19 వరకు అమలులో రాత్రిపూట లాక్ డౌన్
- గతంలో 10,000 దాటిన కేసులు ప్రస్తతం 1280 గా నమోదు.
- సత్పలితాలిస్తున్న లాక్ డౌన్ తో పాటు కరోనా కట్టడికి తీసుకుంటున్నచర్యలు
ఆర్సీ న్యూస్, జూన్ 13 (హైదరాబాద్): రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కరోొనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న వేళ..రాష్ట్ర ప్రభుత్వం మే 12వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు జరిగింది. కేవలం ప్రతిరోజు ఉయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపు ఉండగా…రాత్రిపూట పూర్తిగా లాక్ డౌన్ అమలు జరిగింది. లాక్ డౌన్ సమయంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడంతో తిరిగి జూన్ 10వ తేదీ నుంచి పగటిపూట లాక్ డౌన్ తొలగించి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలు జరుగుతోంది. దీంతో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. రెండు నెలల క్రితం 10,000 దాటిన కేసులు ప్రస్తతం 1280 కేసులు నమోదయ్యాయి. ఎట్టిపరిస్థితులలో ఈ-పాస్ తో పాటు అనుమతి పత్రాలు ఉన్నవారు, మినహాయింపు ఉన్న వారు తప్సా..రోడ్లపై ఎవరూ ఉండకండా సంబందిత పోలీసులు కట్టడి చేస్తుండడంతో గత 24 గంటలలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి.
- లాక్ డౌన్ తో పాటు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
- ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్రంలో 1280 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..2261 మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారని..వీరందరి ఆరోగ్యం మెరుగైందని రాష్ట్ర ప్రజా ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ విడుదల చేసిన మీడియా బులెటిన్ లో తెలిపారు.
- ఈరోజు కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొందుతూ 15 మంది చనిపోయారని తెలిపారు. ఈ రోజు వరకు 6,03,369 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా…ఇందులో 5,78,748 మంది వైద్య సేవలు పొంది కోలుకున్నారు.
- వైద్య సేవలు పొందుతూ కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది.
- తెలంగాణలో 0.57 శాతం, దేశంలో 1.3 శాతం డెత్ రేట్ ఉండగా..రాష్ట్రంలో 95.01 శాతం, దేశంలో 95.22 శాతం రికవరీ రేటు ఉండని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
- అంటే కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొంది రికవరి అవుతున్న వారు 95 శాతానికి పైగా ఉంటున్నారు.
- సకాలంలో వైద్య సేవలు పొందడమే కాకుండా కరోనా వైరస్ కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారందరూ ఎలాంటి టెన్షన్ లేకుండా కోలుకుంటున్నారు.
- కాగా, ఈ రోజు 91,621 టెస్టులు నిర్వహించగా..ఇందులో ప్రైమరీ కాంటాక్ట్ టెస్టులు 49.9 శాతం ఉండగా..సెకండరీ కాంటాక్ట్ టెస్టులు 12.1 శాతం ఉన్నాయి.
- కరోనా వైరస్ లక్షణాలు బయట పడిన వెంటనే అప్రమత్తమై టెస్టులు చేయించుకుంటున్న వారికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో హోం ఐసోలేషన్ లో కొంత మంది ఉండటం..మరికొంత మంది కుటుంబానికి దూరంగా ఆస్పత్రిలో చేరి వైద్య సేవలు పొందుతుండడంతో వీరి నుంచి ఇతరులకు( సెకండరీ కాంటాక్ట్) చాలా తక్కువగా అంటే.. 12.1శాతం మాత్రమే వైరస్ సోకిందని తెలుస్తోంది.
- మొత్తం 91,621 టెస్టులలో 85,852 టెస్టులను ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించగా..5,769 టెస్టులను ప్రైవేటు ఆసుపత్రులలో నిర్వహించారు.
- 6,03,369 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా..ఇందులో 79.9 శాతం మందికి ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవు.
- ఇక 20.1 శాతం మందికి మాత్రమే కరోనా వైరస్ లక్షణాలున్నాయి.
- రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా ఇంటింటికి తిరిగి నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే సత్పలితాలను ఇస్తోందని వైధ్యాధికారులు చెబుతున్నారు.
- ఇంటింటి ఫీవర్ సర్వేలో ఎక్కడైనా..,ఎవరైనా జ్వరం తో బాధపడుతున్నట్లు తెలిస్తే..వెంటనే వారి సమాచారాన్ని రికార్డు చేసుకుని వారికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐసోలేషన్ మెడికల్ కిట్లు అందజేస్తున్నామని..అందుకే వారు వైరస్ బారిన పడకుండానే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.
- జ్వరంతో బాధపడే వారు త్వరగా కోలుకోవడానికి ఐసోలేషన్ మెడికల్ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయంటున్నారు.
- రాష్ట్రంలో రాత్రిపూట లాక్ డౌన్ ఈ నెల 19వ తేదీ వరకు అమలులో ఉంటుంది.
- గత రెండు వారాలతో పోల్చితే పాజిటివిటీ రేట్ గణనీయంగా తగ్గింది.
- లాక్ డౌన్ కు ముందు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయి.
- ప్రస్తుతం రెండు వేల లోపు అంటే..1280 వచ్చాయి.
- పగటి పూట లాక్ డౌన్ సడలింపుతో పాటు ప్రజలు కరోనా కట్టడికి సరైన జాగ్రత్తలు తీసుకుంటుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది.
1 thought on “గత 24 గంటల్లో 1280 కరోనా పాజిటివ్ కేసుల నమోదు..”