ఆర్సీ న్యూస్(హైదరాబాద్): తెలంగాణలో రాత్రిపూట కరోనాకర్ప్యూ అమలు లోకి వచ్చింది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కరోనా కర్ప్యూ అమలులో ఉంటుంది. ఈ నెల 20 వ తేదీ రాత్రి 9 గంటల నుంచి మే 1 వ తేదీ తెల్లవారు జామున 5 గంటల వరకు అమలులో ఉంటుంది. అత్యవసర సేవలను ఈ కరోనా కర్ప్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు సంబందిత విధినిర్వాహణలోని అధికారులు, సిబ్బందితో సహకరించాలని కోరింది. ప్రజా ఆరోగ్యం ద్రుష్ట్యా రాత్రిపూట కరోనాకర్ప్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల పట్ల కొంత మంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారు. దీంతో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.
మాస్క్ ధరిస్తూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన మార్గ దర్శకాలు జారీ చేస్తున్నప్పటికీ..ఆచరణలో సాధ్యం కావడం లేదు. అందుకే పోలీసులు రంగంలోకి దిగి నిర్లక్ష్యంగా ఉన్న వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు.
మాస్క్ లు ధరించకపోతే..రూ. 1000 జరిమాన విధించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు స్థానికులతో పాటు వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
జనరల్ స్టోర్స్ నిర్వహకులకు తప్పని సరిగా శానిటైజర్స్ వినియోగించాలని సూచించారు. వస్తువులు వినియోగ దారులకు ఇచ్చిన వెంటనే చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని సూచించారు.
అయినప్పటికీ..ఎక్కడా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గ లేదు.
రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసలు పెరుగుతూనే ఉన్నాయి.
దీంతో హైకోర్టు జోక్యం చేసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుండగా…రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తెలియ జేయాలని..హైకోర్టు కోరింది.
కరోనా కట్టడికి అవసరమైన మేరకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది.
ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది.
కరోనా కట్టడికి న్యూ ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇక్కడ మాత్రం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడం లేదు..ఇదేంటి..? అని ప్రశ్నించింది.
కుంభమేళాలో పాల్గొన్న వారు ఇక్కడికి వస్తున్నారు..మీరు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని నిలదీసింది.
కరోనాకర్ఫ్యూ , లాక్ డౌన్ విధించడానికి రాబోయే 48 గంటల్లో కోర్టుకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే..కోర్టు స్పందించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లోనే స్పందించింది.
మంగళవారం రాత్రి 9 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
పబ్ లు, వైన్ షాప్ లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు, ప్రజలు బయట తిరగడం..అన్నీ బంద్.
సాధారణ ప్రజలకు ఎవరికీ మినహాయింపు లేదు.
మీడియా, పెట్రోల్ బంకులు, సీఎన్జీ, ఎల్పీజీ, పవర్ జనరేషన్ డిస్ట్రీబ్యూషన్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్, ప్రొడక్షన్ యూనిట్ సర్వీసెన్, ఇంటర్నెట్ సర్వీసెస్, కేబుల్ టీవీ సర్వీసెస్, డిష్ టీవీ సర్వీసెస్, ఐటీ కంపెనీస్, ఐటీ సర్వీసెస్లకు అనుమతి ఉంది.
వీరందరూ తగిన ఐడెంటి కార్డులను తమ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది.
అలాగే అత్యవసర సేవలకు హాజరయ్యేందుకు వెళ్లే వారి సౌకర్యార్థం ఆటో రిక్షాలు, క్యాబ్ లను అనుమతిస్తారు.
ప్రయాణికల రాకపోకల విషయంలో సంబంధిత ట్రావెలింగ్ టికెట్లు చూపిస్తే..కార్లు, ఆటోలలో ప్రయాణానికి అనుమతిస్తారు.
మెడికల్ షాపులు, ఆసుపత్రులు, గ్యాస్ సరఫరా, పాల సరఫరా, న్యూస్ పేపర్ సరఫరా, అత్యవసర ఫుడ్ డెలివరీ తదితర అత్యవసర సేవలకు అనుమతి ఉంటుంది.
2 thoughts on “తెలంగాణలో రాత్రిపూట కరోనాకర్ప్యూ విధింపు..”