నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

 తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా వైరస్ పాజిటివ్..

సీఎం కేసీఆర్ కు కరోనా వైరస్

ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్): తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే  సీఎం కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని… ఆయనకు ఆంటిజెన్ పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌ పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలిపారు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ సైతం నిర్వహించగా..పాజిటివ్ వచ్చిందన్నారు. కేసీఆర్ కు స్వల్పంగా జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలిందన్నారు. అయితే ప్రస్తుతం జ్వరం కూడా లేదని..కేవలం కొద్దిగా జలుబు, దగ్గు మాత్రమే ఉందని..9 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుందని సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వీ.రావు స్పష్టం చేశారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని ఆయనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు.ప్రస్తుతం ఫామ్ హౌజ్ లో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఐసోలేషన్ లో ఉన్నారన్నారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా…

 రాష్ట్ర ముఖ్యమంత్రి  కు కరోెనా పాజిటివ్ రావడం పట్ల రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కు కరోనా వైరస్ సోకి ఉండవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే..ఇప్పటికే నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో పాటు మరికొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వీరితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారని..అక్కడే కరోనా వైరస్ సోకి ఉండవచ్చునని అంటున్నారు.