- మూడు మందులు..రోజుకు రెండు పూటలు
- పది రోజుల పాటు వాడితే బ్లాక్ ఫంగస్ మాయం
- ఇవి ఆంటీ ఫంగల్,ఆంటీ బాక్టీరియల్,ఆంటిసెప్టిక్ గా పనిచేస్తాయి.
ఆర్సీ న్యూస్ (హైదరాబాద్): బ్లాక్ ఫంగస్ నివారణకు మందొచ్చింది. ఈ మందులు యాంటీ ఫంగల్,యాంటీ బాక్టీరియల్,యాంటిసెప్టిక్ గా పనిచేస్తాయి.ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పది రోజుల్లో బ్లాక్ ఫంగస్ బారిన పడి రోగులు కేవలం 10 రోజుల్లో ఈ మందులు వాడితే ఇట్టే తగ్గిపోతుందంటున్నారు. పది రోజుల పాటు రోజుకు రెండు పూటలు మందులు వాడితే సరిపోతుందంటున్నారు. ఆసుపత్రిలో చేరి రోజులకు రోజులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ మందులు వాడడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తం శుద్ధి జరుగుతుందని చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ తో బాధపడే వారికి తమ వద్ద మహత్తరమైన మందు ఉందని ఆయుష్ విభాగం వైద్యులు చెబుతున్నారు. చెప్పడమే కాదు..గురువారం ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆయుష్ విభాగంలోని యునానీ వైద్యంలో బ్లాక్ ఫంగస్ నివారణకు ఉపయోగించే మందులను ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ యునానీ మందులను చార్మినార్ లోని ప్రభుత్వ నిజామియా జనరల్ ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా అందజేయనున్నట్లు ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ వి.ఎస్. అలుగు వర్షిణి తెలిపారు. వారం రోజుల్లో రాష్ట్రంలోని అన్ని యునానీ ఆసుపత్తులలో అందుబాటులో ఉంటాయని ఆమె వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం..
ఈ యునానీ మందులు ఆత్మరక్షణతో పాటు రోగం తో బాధపడుతూ ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండకుండా సహకరిస్తుంది. అంతేకాకుండా వ్యాధి ముదరకుండా ప్రాణాల మీదికి రాకుండా ఈ మందులు కాపాడుతాయి. రోగులు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బ్లాక్ ఫంగస్-మ్యూకోర్ మైకోసిస్ లను నిర్వీర్యం చేసి రోగులు త్వరగా కోలుకోవడానికి ఈ మందులు చాలా ఉపయోగపడతాయి. వాస్తవానికి గాలిలో ఎప్పటి నుంచో ఫంగస్ ఉంటుంది. కరోనా వైరస్ బారిన పడిన రోగులు త్వరగా కోలుకోవడానికి స్టిరాయిడ్స్ వాడుతున్నారు. స్టిరాయిడ్స్ ఒక లెవల్ దాటి వాడితే..రోగి శరీరంలో ఆరోగ్య పరంగా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడడంతో సమస్యలు తలెత్తుతాయి. స్టిరాయిడ్స్ తో అప్పటికి ఆయా రోగులు నయమవుతున్నప్పటికీ..రాబోయే రోజుల్లో బ్లాక్ ఫంగస్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని యునానీ వైద్యులు చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ సోకి మెరుగైన వైద్య సేవలు పొంది నయమైన వారందరికి బ్లాక్ ఫంగస్ సోకదని..కేవలం మధుమేహా రోగులను మాత్రమే టార్గెట్ చేస్తుందంటున్నారు. అది కూడా దీర్ఘకాలికంగా ( 6-7 ఏళ్లుగా) డయాబెటిస్ తో బాధపడే వారిలో ఈ బ్లాక్ ఫంగస్ కనిపిస్తుందంటున్నారు. కరోనా నుంచి నయమైన ప్రతి ఒక్కరికి ఈ ఫంగస్ సోకదని చెబుతున్నారు. ఇతరులు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. హై రిస్క్ లో ఉన్న రోగులకు ప్రొఫైలాక్టిక్ (ఆత్మరక్షణ) యునానీ మెడిసిన్ ఎంతో మేలు చేస్తుంది. దీని నివారణకు మూడు యునానీ మందులు వాడాల్సి ఉంటుందని యునానీ వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఒకటి..అర్కె అజీజ్..ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీనిని మూడు రకాలుగా వినియోగించ వచ్చంటున్నారు. ఓరల్ గాను, ఇన్ హేలర్ గాను, లోనికి గాను వినియోగించ వచ్చునని చెబుతున్నారు. దీంతో పాటు రెండోది..ఇమ్మునో క్యాప్సిల్..మూడోది కోర్సే ముస్పఫికోన్ అనే మందులను వాడాల్సి ఉంటుంది. వీటిని రోజుకు రెండు పూటల చొప్పున పది రోజులు క్రమం తప్పకుండా వాడితే నివారించ డానికి వీలు కలుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రితో పాటు కోఠి లోని ఈఎన్టీ ఆసుపత్రిలో రోగులకు అల్లోపతి వైద్య సేవలు అందుతున్నాయని..అనుమతి లభించిన వెంటనే ఆయా ఆసుపత్రుల్లో తమ యునానీ వైద్యుల పర్యవేక్షణలో రోగులకు ఈ యునానీ మందులు అందజేస్తామని ఆయుష్ డైరెక్టర్ తెలిపారు. ఇదిలావుండగా..గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా వైట్ ఫంగస్ వెలుగు చూసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఒకవైపు ఈ ఫంగస్ తో బాధపడుతున్న వారికి కొత్తగా వెలుగులోకి వచ్చిన వైట్ ఫంగస్ ఏమిటంటూ కరోనా బాధితులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎలాంటి ఫంగస్ ఐనా..భయాందోళన చెందాల్సిన అవసరం లేదని..సకాలంలో సరైన వైద్య చికిత్సలు పొందితే నివారించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. సో..నో టెన్షన్, స్టే హోం..స్టే సేఫ్.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..