ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. ఈ నెల 27వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు కొనసాగుతాయని తెలిపింది. విద్యా శాఖ అధికారులు స్కూల్ విద్యార్థులతో పాటు జూనియర్ కాలేజీ విద్యార్థులకు సెలవులు మంజూరు చేశారు. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖకు ఈ నెల 26 వ తేదీ చివరి పని రోజులుగా నిర్ధారించినట్లు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(ఎఫ్ఏసీ) సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవులతో పాటు విద్యా శాఖకు సంబంధించిన విషయాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు విధ్యా శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి నిర్ఱయం తీసుకున్నారు.
- ఈ మేరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(ఎఫ్ఏసీ) సయ్యద్ ఉమర్ జలీల్ ఆదివారం స్కూల్ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్స్, డిస్ట్రిక్ట్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కు ఆదేశాలు జారీ చేశారు.
- జూన్ 1వ తేదీన, అప్పటి కరోనా వైరస్ పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి తదుపరి నిర్ఱయం తీసుకోనున్నారు.
- కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నందున విధ్యాశాఖ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
- విద్యార్థులకు ఎలాంటి అసౌర్యాలు కలగకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని కొన్ని రోజుల పాటు ఆఫ్ లైన్ లో పాఠశాలలను కొనసాగించింది.
- అంతకు ముందు ఆన్ లైన్ తరగతులను నిర్వహించిన విద్యాశాఖ విధ్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తిరిగి ఆఫ్ లైన్ తరగతులను ప్రారంభించింది.
- అయితే, కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరగడంతో ఆఫ్ లైన్ తరగతులను కూడా నిలిపి వేసింది.
- తిరిగి ఆన్ లైన్ క్లాస్ లకు అనుమతించింది.
- ఇలా విద్యార్థుల విలువైన కాలాన్ని వృధా చేయోద్దనే ఉద్దేశ్యంతో తెలంగాన విద్యాశాఖ ఎప్పటికప్పడు తగిన నిర్ఱయాలు తీసుకుంటోంది.
- ఇందులో భాగంగా ఇప్పటికే ఎలాంటి పరీక్షలు లేకుండానే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేసింది.
- అంతేకాకుండా 10వ తరగతి విధ్యార్థులకు బోర్డు ఎక్షామ్ నిర్వహించకుండానే 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసింది.
- అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే సెకండ్ ఈయర్ కు ప్రమోట్ చేసింది.
వేసవి సెలవులను వృధా చేసుకోకుండా…..
- వేసవి సెలవులను వృధా చేసుకోకుండా అవసరమైన విద్యాభ్యాసాన్ని ఇంట్లో కొనసాగించాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు.
- కరోనా కట్టడి కోసం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే..వారి వారి ఇళ్లల్లో విద్యాభ్యాసాన్ని కంటిన్యూ చేయాలని సూచిస్తున్నారు.
- పై తరగతులకు ప్రమోట్ అయిన వారు..ఆయా తరగతుల పాఠ్యాంశాల పట్ల శ్రద్ధ వహిస్తే..ఆశించిన ఫలితాలు ఉంటాయంటున్నారు.
- విద్యార్థుల పై ఉపాధ్యాయుల ఒత్తిడి ఉండనందున ప్రశాంతంగా తమ ఇళ్లలోనే పాఠాలను నేర్చుకోవచ్చు నంటున్నారు.
More Stories
Telangana Elections 2023 : నామినేషన్ల స్వీకరణకు పూర్తయిన తగిన ఏర్పాట్లు..
Hyderabad : నగరంలో వరద నీటి సమస్యకు చెక్..
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం..