ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

TRS PARTY : కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం.. ప్రమాద బీమా తో కుటుంబాలకు అండగా

TRS PARTY : కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం..
 • పార్టీ సభ్యత్వం పొంది చనిపోతే వారి కుటుంబానికి రెండు లక్షల సహాయం..
 • ఇప్పటికీ సిద్దిపేటలో 25 మంది కార్యకర్తల కుటుంబాలకు చెక్కుల పంపిణీ..
 • ఈరోజు మరో ఐదుగురికి పంపిణీ..
 • తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలకు అండగా..
 • కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే పార్టీ ఆదుకుంటుంది..
 • ఇన్సూరెన్స్ బీమా కల్పించి చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం..
 • ఇందులో భాగంగా సిద్దిపేటలో ఇప్పటికే 25 మంది కార్యకర్తలు చనిపోగా వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా..

ఆర్సీ న్యూస్, జనవరి 09 (సిద్దిపేట): కార్యకర్తలను కంటికి రెప్పలా కాపడుకుంటాం..పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా టి.ఆర్.ఎస్ పార్టీ..టీఆర్ఎస్‌ పార్టీ సభ్యత్వమున్న ప్రతి కార్యకర్తలకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించి ఆదుకునేందుకు క్రుషి చేస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.

తన నియోజక వర్గంలో ఐదుగురు చనిపోయిన  కార్యకర్తలకు రూ. 10 లక్షలు పార్టీ ఇన్సూరెన్స్ మంజూరైంద న్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం కల్గివున్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందని  పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇలా ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నామన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు..   సిద్దిపేట నియోజకవర్గంలోని ఐదుగురు కార్యకర్తల ప్రమాదవశాత్తు చనిపోయారు.. ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 10 లక్షలు మంజూరు అయ్యాయని చెప్పారు..పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ భీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి రూ.2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గంలో 25 మంది కార్యకర్తల కుటుంబాలకు ఈ ఇన్సూరెన్స్ చెక్కులు అందించామని,

TRS PARTY : కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం.. కొత్తగా మరో ఐదుగురు  కార్యకర్తకు భీమా మంజూరు అయింది అని చెప్పారు.

 • నర్సాపూర్ 2వ వార్డు కు చెందిన మోత్కూరీ నర్సింహులు   24 డిసెంబర్ 2020 లో రోడ్డు ప్రమాదంలో చనిపోయడు అతని భార్య మల్లవ్వ కు  రూ.2లక్షల చెక్కును మంత్రి  అందించారు..
 • మందపల్లి గ్రామానికి చెందిన   వీరన్నపెట ఎల్లారెడ్డి ఇతను రాజీవ్ రహదారి పై 4 డిసెంబర్ 2020 రోజున  రోడ్డు ప్రమాదంలో చనిపోయారు భార్య మంజుల కు రూ. 2లక్షల చెక్కును అందజేశారు.
 • ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన  బోయిని దేవయ్య 16 డిసెంబర్ 2020 లో చేపలు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు భార్య లలిత కు రూ.2 లక్షల చెక్కును అందజేశారు..
 • సిద్దిపేట పట్టణం 18 వ వార్డు కు చెందిన  వరుకోలు రాజు 20 డిసెంబర్ 2020 రోజున రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు భార్య నిర్మల కు రూ.2 లక్షల చెక్కును అందజేశారు.
 • రంగాయ్ పల్లి గ్రామానికి చెందిన దొంతి రాజు 6 మే 2021 రోజున  రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు భార్య కరుణ కు రూ.2 లక్షల చెక్కును అందజేశారు..