మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

తెలంగాణలో మొదలైన రాత్రిపూట కరోనా కర్ప్యూ..

తెలంగాణ రాత్రిపూట కరోనా కర్ప్యూ

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): తెలంగాణలో రాత్రిపూట కరోనా కర్ప్యూ మంగళవారం రాత్రి 9 గంటల నుంచి మొదలైంది. వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. నగర పోలీసు కమిషనర్ సీపీ అంజనీకుమార్ బషీర్ బాగ్ పరిసరాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి పూట మొదలైన కరోనా కర్ప్యూ ను పర్యవేక్షించారు. సైబరా బాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కూకట్ పల్లి పరిసరాల్లో..రాచకొండ పోలీసు కమిష నర్ మహేష్ భగవత్ ఉప్పల్ రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న బందో బస్తుతో పాటు కరోనా కర్ప్యూ అమలు తీరును పరిశీలించారు. 11 రోజుల పాటు అమలులో ఉండే రాత్రి పూట కర్ప్యూ ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి మే 1 వ తేదీ తెల్లవారు జామున 5 గంటల వరకు అమలులో ఉంటుంది. రాత్రి 8 గంటల వరకే వ్యాపార సముదాయాలకు అనుమతి ఉండడంతో అంతకు ముందు నుంచే సంబందిత పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసులు తమ వాహనాల్లోొ తిరుగుతూ మైక్ ల ద్వారా అనౌన్స్ చేసారు. కర్ప్యూ సమయంలో ఎవరూ బయట తిరగ వద్దని సూచించారు.

రంజాన్ మార్కెట్ వ్యాపారాలకు పెద్ద దెబ్బ…

 రంజాన్ మాసం సందర్బంగా రాత్రిపూట రంజాన్ మార్కేట్ కొనసాగుతుంది. రంజాన్ మార్కేట్ లకు ప్రజలు  అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. ఇది అర్దరాత్రి వరకు కొనసాగుతుంది.  చిరు వ్యాపారాలు జోరుగా కొనసాగుతాయి. గతేడాది లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన చిరువ్యాపారులు ఈసారైనా నష్టాల భారి నుంచి బయట పడతామని భావించారు. అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రాత్రి పూట కర్ప్యూ మొదలు కావడంతో చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితులలో రంజాన్ మార్కెట్ కొనసాగే పరిస్థితులు లేెకపోవడంతో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడానికి సిద్దమవుతున్నారు.అత్యవసర సేవలను ఈ కరోనా కర్ప్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే  ప్రకటించింది. కరోనా కట్టడికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన మార్గ దర్శకాలు జారీ చేసినప్పటికీ..ఆచరణలో సాధ్యం కావడం లేదు. అందుకే కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కరోనా కర్ప్యూ విధించింది.

హైకోర్టు జోక్యంతో…

రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుండగా…రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తెలియ జేయాలని..హైకోర్టు కోరింది.

 కరోనా కట్టడికి అవసరమైన మేరకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి న్యూ ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇక్కడ మాత్రం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడం లేదు..ఇదేంటి..? అని ప్రశ్నించింది. కరోనా కర్ఫ్యూ, లాక్ డౌన్ విధించడానికి  రాబోయే 48 గంటల్లో కోర్టుకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే..కోర్టు స్పందించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లోనే స్పందించి.. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.

అత్యవసర సేవలకు మినహాయింపు…

కరోనా కర్ప్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంది. పబ్ లు, వైన్ షాప్ లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు, ప్రజలు బయట తిరగడంతో పాటు  సాధారణ ప్రజలకు ఎవరికీ మినహాయింపు ఇవ్వ లేదు. అయితే, మీడియా, పెట్రోల్ బంకులు, సీఎన్జీ, ఎల్పీజీ, పవర్ జనరేషన్ డిస్ట్రీబ్యూషన్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్, ప్రొడక్షన్ యూనిట్ సర్వీసెన్, ఇంటర్నెట్ సర్వీసెస్, కేబుల్ టీవీ సర్వీసెస్, డిష్ టీవీ సర్వీసెస్, ఐటీ కంపెనీస్, ఐటీ సర్వీసెస్లకు కరోనా కర్ప్యూ నుంచి మినహాయింపు ఉంది. అలాగే మెడికల్ షాపులు, ఆసుపత్రులు, గ్యాస్ సరఫరా, పాల సరఫరా, న్యూస్ పేపర్ సరఫరా, అత్యవసర ఫుడ్ డెలివరీ తదితర అత్యవసర సేవలకు అనుమతి ఉంది.