అక్టోబర్ 10, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Chervugattu : శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి Full Story.

Chervugattu : శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
  • తెలంగాణలో అతి ప్రాచీనమైన చారిత్రాత్మకమైన దేవాలయం..
  • ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తుల సందర్శన..
  • ఉత్సవాల సందర్భంగా శివపార్వతుల కళ్యాణంతో పాటు ఊరేగింపు..
  • హైదరాబాద్-నల్గొండ జాతీయ రహదారి 9 నుంచి ఒక కిలోమీటర్ దూరంలో దేవాలయం..
  • నార్కట్ పల్లి నుంచి 4 కి.మీ.. నల్గొండ నుంచి 15 కిలోమీటర్ల దూరం..
  • భక్తులకు అందుబాటులో రవాణా సౌకర్యం..
  • ఎత్తయిన కొండలు గుట్టపైన 48 ఎకరాలలో కొలువుదీరిన దేవస్థానం.. 
  • త్రేతాయుగంలో పరమశివుడు ప్రతిష్టించిన శివలింగం..

ఆర్సీ న్యూస్, ఫిబ్రవరి 07 (నల్లగొండ):  తెలంగాణలో అతి ప్రాచీనమైన చారిత్రాత్మకమైన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 8 వ,తేదీ నుంచి 13 వ, తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉత్సవాల నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.  మాఘ శుద్ధ రథసప్తమి నుంచి ద్వాదశి లలో చెరువుగట్టు జాతర జరుగుతుంది.

Cheruvugattu : Full Story ఎక్కడ..ఎలా..

  • నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువు గట్టు గ్రామంలో ఈ ప్రాచీన దేవాలయం ఉంది. 
  • పూర్తిగా కొండలు గుట్టల నడుమ పచ్చటి వృక్షసంపద తో ఈ దేవాలయం కొలువు దీరింది. 
  • శివ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 
కొండల్లో కొలువుతీరిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం..
కొండల్లో కొలువుతీరిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం..

Chervugattu History : త్రేతాయుగంలో…

  • త్రేతాయుగంలో పరుశరాముడు ఒక చిన్న శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించాడు.
  • పడమర ముఖంతో ఆవరించి ఉన్న శివలింగం రోజురోజుకూ పెరుగుతోంది.
  • పరుశరాముడు శివలింగం మీద కొరివితో కొట్టాడు.
  • దీంతో శివ లింగం పెరుగుదల ఆగిపోయింది.
  • విరిగిన గుర్తు లింగం పైభాగంలో ఉంది. 
  • ముఖ్యంగా పరుశరాముడు ప్రతిష్టించబడిన శివలింగం పశ్చిమ ముఖం మాత్రమే.
  • ఇలాంటి పశ్చిమ ముఖం గల శివలింగం భారతదేశంలోనే ప్రధానం.

 శివాలయం తో పాటు కొండపైన ఉన్న మరిన్ని ప్రదేశాలు:

 ముదుగుండ్లు, ఎల్లమ్మ అమ్మవారి ఆలయం, గోపాదం, శ్రీ ఆంజనేయ స్వామిఆలయం, హిల్ హాక్‌లోని శ్రీ భైరవ స్వామి ఆలయం, దిగువన శ్రీ వద్ద ఉన్న ఉప ఆలయం,పార్వతి అమ్మవారి ఆలయం.త్రేతాయువులో పరుశరాముడు శివుని విగ్రహాన్ని ప్రతిష్టించాడు.

Cheruvugattu Route : ఎక్కడ నుంచి ఎంతెంత దూరం..

  • హైదరాబాద్-నల్గొండ ప్రధాన రోడ్డులో నేషనల్ హైవే 9 నుంచి దేవాలయం కేవలం ఒక కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది.
  • అలాగే నార్కెట్ పల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ..
  • నల్గొండ పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఈ దేవాలయం కొలువుదీరి ఉంది.
  • హైదరాబాద్ మహాత్మ గాంధీ బస్ స్టేషన్(ఎంజీబీఎస్)తో పాటు ఇతర ప్రాంతాల నుంచి దేవాలయం వరకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.
  • ఎల్లారెడ్డిగూడెం నుంచి చెరువుగట్టు కొండపైకి ఆటో రిక్షాలు అందుబాటులో ఉన్నాయి.
  • గుట్ట పైన ఉన్న శివాలయాన్ని సందర్శించడానికి ఇప్పటికే చక్కటి ఘాట్ రోడ్డు నిర్మితమై ఉంది. 
  • కోనేరు, మండపం లతోపాటు దైవ దర్శనం కోసం భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది.

 Chervugattu : దేవాలయం తెరిచి ఉండే సమయం..

  • ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు త తెరచి ఉంటుంది.
  • అలాగే తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు దేవాలయం తెరిచి ఉంటుంది.
  • ఆ సమయంలో భక్తులు శివ లింగం  దర్శించుకోవడానికి వీలు కలుగుతుంది.
  • అంతేకాకుండా ఇక్కడ ప్రతి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది.
  • ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే స్వామి వ్రతానికి రూ.300 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

చెరువు గట్టు జాతర (బ్రహ్మోత్సవాలు)…

  • ఏడాదికోసారి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని చేరుకొని స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోవడం కోసం భక్తులు ఇష్టపడతారు. 
  • ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తారు.
  • బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 8వ తేదీన రథసప్తమి సందర్భంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించనున్నారు.
  • 10వ తేదీన దక్షయజ్ఞం సందర్భంగా అగ్ని గుండాలు  కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
  • అనంతరం చివరి రోజైన ఈ నెల 13వ తేదీన చెరువుగట్టు గ్రామం తో పాటు ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో శివపార్వతుల ఊరేగింపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.
  • శివపార్వతుల ఊరేగింపుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనంగా స్వాగతం పలకనున్నారు.
  • ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు దేవాలయం వంశపారంపర్య ప్రధాన అర్చకులు రామలింగ శర్మ తెలిపారు.
చెరువు గట్టు జాతర (బ్రహ్మోత్సవాలు)...
చెరువు గట్టు జాతర (బ్రహ్మోత్సవాలు)…