నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

మంత్రి వర్గం నుంచి ఈటెల తొలగింపు..

మంత్రి వర్గం నుంచి ఈటెల తొలగింపు..

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): ఈటెల రాజేందర్ ను ఆదివారం మంత్రివర్గం నుంచి తొలగించారు. శాఖ లేని మంత్రిగా ఉన్నఈటెల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు మీడియాకు విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే వైద్య,ఆరోగ్య శాఖ నుంచి ఈటెల రాజేందర్ ను తొలగిస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రి ఈటెల రాజేందర్ భూ భాగోతం..ఈటెల భూ కబ్జా..అంటూ ఏప్రిల్ 30న, తెలుగు ఛానల్స్ లలో ఈటెలకు వ్యతిరేకంగా కథనాలు రావడంతో సీఎం వెంటనే స్పందించారు. ఈటెల భూ కబ్జాల విషయాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్ర ఛీప్ సెక్రటరి సోమేష్ కుమార్ చేత ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆధేశాల మేరకు విజిలెన్స్ డీజీ పూర్ణచంద్రరావు, మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, రెవెన్యూ,పోలీసు అధికారుల బ్రుందాలు రంగంలోకి దిగి శనివారం ఉదయం నుంచే వివాదస్పదంగా మారిన అచ్చంపేట్ భూములపై విచారణ ఫ్రారంభించారు. విచారణలో అసైన్డ్ భూములు కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని…మెదక్ జిల్లా కలెక్టర్ శనివారమే మీడియాకు తెలిపారు. భూ కబ్జా జరిగినట్లు సంబందిత అధికారులు ఫ్రాథమికంగా నిర్ధేశించి తమ నివేదికలను సీఎం కేసీఆర్ కు అందజేయడంతో..వెంటనే స్పందించిన సీఎం మే 1( శనివారం )న, ఈటెల రాజేందర్ వైద్య,ఆరోగ్య శాఖ నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారు.  ఆ వెంటనే విచారణకు సంబందించిన పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందడం..అందులో భూములు కబ్జాకు గురైనట్లు నిర్ధారణ కావడంతో మే 2( ఆదివారం)న, ఈటెల రాజేందర్ ను మంత్రివర్గంల నుంచి భర్తరప్ చేస్తున్నట్లు సీఎం, గవర్నర్ కు సిఫారస్ చేయడం.. గవర్నర్ వెంటనే ఆమోదించడం కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈటెల రాజేందర్ కేవలం శాసన సభ్యుడిగా కొనసాగుతారు. ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దేవర యంజాల్ లోని ఆయన నివాసానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఒక కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు అడ్డుకుని అతనిని అడ్డుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరికొంత మంది కార్యకర్తలు,నాయకులు ఆందోళనకు దిగారు. ఈటెల రాజేందర్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ..కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు.తనపై లేనిపోని అభాండాలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తున్న వారు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదని ఈటెల రాజేందర్ ఇప్పటికే ప్రకటించారు. నిన్న శాఖను తొలగించడం..నేడు మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయడంతో ఆయన అభిమానులు జీర్ఱించుకోలేక పోతున్నారు. దీంతో వైద్య,ఆరోగ్య శాఖ కాకుండా ఇతర శాఖలో ఈటెలకు తిరిగి స్థానం కల్పించడానికి ఇప్పటికే చర్యలు మొదలయ్యాయని.. ఈ మేరకు రాజకీయ సమీకరణాలు మారుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక, తనపై వచ్చిన ఆరోపణలపై ఒక్కసారి ముఖ్యమంత్రి తనను పిలిచి వివరణ అడిగితే భావుండేదని ఆయన అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి తప్పలు చేయలేదని..ఇప్పుడు తన క్యారెక్టర్ని దెబ్బతీస్తు న్నారని… ప్రణాలళికాబద్దంగా తనపై విషం చిమ్ముతున్నారన్నారు. అసైన్డ్ భూముల కబ్జా అంటూ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. తాను ఎక్కడా అసైన్డ్ భూము లను కబ్జా చేయలేదని…తాను ఎవరిని మోసం చేయ లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఏదిఏమైనా మూడు రోజుల్లో ఈటెల రాజేందర్ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పైన మరచిపోలేని మచ్చ ఏర్పడింది. కలెక్టర్ నివేదికల ఆధారంగా అసైన్డ్ భూముల కబ్జా తేటతెల్లం కావడం..వైద్య,ఆరోగ్య శాఖ నుంచి ఆయనను తొలగించడం..ఆ వెంటనే మళ్లీ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయడం కేవలం మూడు రోజుల్లో జెట్ స్పీడ్ వేగంతో జరిగిపోయాయి.