- 2022-2023 ఆర్దిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
- మంగళవారం పార్లమెంట్‌లో 2022-2023 ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
- డిజిటల్ రూపీ విడుదలతో ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం.
- డిజిటల్ కరెన్సీల ద్వారా ఆదాయం, ఆస్తుల బదిలీపై 30 శాతం పన్ను.
ఆర్సీ న్యూస్, ఫిబ్రవరి 01(హైదరాబాద్): నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది నాలుగోసారి. కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంతకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌తో భేటీ అయి.. బడ్జెట్ విషయాలను వివరించారు.
Union Budget 2022 Full details కేంద్ర ప్రభుత్వ ఆర్దిక బడ్జెట్ 2022 పూర్తీ వివరణ తెలుగులో
- 2022-23 మొత్తం బడ్జెట్ అంచనాలు రూ. 39.45 లక్షల కోట్లు.
- 2022-23 బడ్జెట్‌లో ద్రవ్య లోటు 6.9 శాతం.
- 2025-26 నాటికి ద్రవ్య లోటును 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యం.
- 2022-23 ఆదాయ వనరులు రూ. 22.84 లక్షల కోట్లు.
- క్రిప్టో కరెన్సీకి గ్రీన్ సిగ్నల్
- క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను.
- డిజిటల్ కరెన్సీల ద్వారా ఆదాయం, ఆస్తుల బదిలీపై 30 శాతం పన్ను.
- డిజిటల్ కరెన్సీల ఆదాయంపై పన్ను మినహాయింపులకు అవకాశం లేదు.
- ఐటీ రిటర్న్‌ల దాఖలులో మరో వెసులుబాటు.
- రెండేండ్ల వరకు వ్యక్తిగత ఐటీ రిటర్న్‌లు దాఖలుకు అవకాశం.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ డిడక్షన్.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్‌పీఎస్ డిడక్షన్ 10 నుంచి 14 శాతానికి పెంపు.
- ఆర్‌బీఐ ద్వారా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ.
- రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీ.
- కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీ రూపకల్పన.
- డిజిటల్ రూపీ విడుదలతో ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం.
- రాష్ట్రాలకు ఆర్థికసాయంగా రూ. లక్ష కోట్ల నిధి ఏర్పాటు.
- ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు.
- త్వరలో భవనాల ఆధునిక బై లాస్ విడుదల.
- పట్టణ ప్రణాళిక కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు.
- పట్టణ ప్రణాళిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలకు రూ. 250 కోట్లు.
- సులభతర వాణిజ్య ప్రోత్సాహం రెండో దశ ప్రారంభం.
- 5 విద్యాసంస్థలకు పట్టణ ప్రణాళిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ హోదా.
- మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్రసాయం.
- దేశ వ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ. 10.68 లక్షల కోట్లు కేటాయింపు.
- బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి కోసం 4 పైలట్ ప్రాజెక్టులు.
- దేశీయంగా సౌర విద్యుత్ ప్లేట్ల తయారీ ప్రోత్సాహకానికి రూ. 19,500 కోట్లు కేటాయింపు.
- ప్రయివేటు రంగంలో అడవుల ఉత్పత్తి కోసం నూతన పథకం.
- పీఎం ఆవాస్ యోజనలో భాగంగా 80 లక్షల గృహాలు.
- రూ. 44 వేల కోట్లతో అందుబాటు ధరల్లో గృహాల నిర్మాణం.
- ఉత్తర సరిహద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం.
- 112 ఏస్పిరేషన్ జిల్లాల్లో 95 శాతం వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి.
- రక్షణ రంగంలో ప్రయివేటు సంస్థలకు అవకాశం.
- డీఆర్‌డీవో, ఇతర రక్షణ పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో ప్రయివేటు సంస్థలకు అవకాశం.
- రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించి స్వయం సమృద్ధి సాధించేలా కృషి.
- విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థల మధ్య బలమైన అనుసంధానం.
- విద్యారంగంలో తొలిసారిగా డిజిటల్ విశ్వవిద్యాలయాలు.
- డ్రోన్ శక్తి కార్యక్రమంలో భాగంగా అంకుర సంస్థలకు ప్రోత్సాహం.
- దేశ వ్యాప్తంగా ఈ ఏడాది అందుబాటులోకి 5 జీ సాంకేతికత.
- 2022-23లో ప్రయివేటు సంస్థల ద్వారా 5 జీ సాంకేతికతను ప్రవేశపెడుతున్నాం.
- 2022-23లో ఈ-పాస్‌పోర్టుల జారీకి కొత్త సాంకేతికత.
- ఇక నుంచి చిప్ ఆధారిత పాస్‌పోర్టులు జారీ.
- 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు.
- కాంట్రాక్టర్లకు ఈ-బిల్లులు పెట్టుకునే అవకాశం.
- బిల్లుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకునే సౌకర్యం.
- ఎగుమతుల వృద్ధికి పారిశ్రామిక సంస్థలకు నూతన ప్రోత్సాహకాలు.
- మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, వినియోగంపై దృష్టి.
- గంగా పరివాహం వెంబడి నేచురల్ ఫార్మింగ్ కారిడార్.
- మహిళలు, చిన్నారుల అభివృద్ధికి 3 ప్రత్యేక పథకాలు.
- దేశ వ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకం(ఎన్‌జీడీఆర్ఎస్)
- దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌కు నూతన వ్యవస్థ.
- దేశ వ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు ఆధునిక వ్యవస్థ.
- ఎంఎస్ఎంఈల రేటింగ్‌కు రూ. 6 వేల కోట్లతో ప్రత్యేక పథకం.
- పంటల పరిశీలన, భూమి రికార్డులు, పురుగుల మందు పిచికారికి కిసాన్ డ్రోన్లు.
- సాగురంగంలో యాంత్రీకరణకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం.
- వరి, గోధుమ కొనుగోళ్లు, మద్దతు ధరల కోసం రూ. 2.37 లక్షల కోట్లు.
- 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఏం సేవలు.
- దేశ వ్యాప్తంగా జిల్లాల వారీ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం.
- మహిళా, శిశు సంక్షేమం కోసం మిషన్ శక్తి, వాత్స్యల, సక్షం అంగన్‌వాడీల రూపకల్పన.
- గత రెండేళ్లలో నల్ సే జల్ కింద 5.7 కోట్ల కుటుంబాలకు అందుబాటులోకి తాగునీరు.
- మినిమం, మ్యాగ్జిమం గవర్నమెంట్ లక్ష్యంలో భాగంగా కాలం తీరిన చట్టాలు రద్దు.
- డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌కు ఈ ఏడాది కూడా మరింత ప్రోత్సాహం.
- వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్‌లో మార్పులు.
- జీరో బడ్జెట్ ఫార్మింగ్, సేంద్రీయ సాగుకు ప్రోత్సహకాలు.
- పీఎం గతిశక్తిలో భాగంగా 2022-23లో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం.
- రూ. 20 వేల కోట్లతో 20 వేల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం.
- మానసిక సమస్యల చికిత్స కోసం ఆన్‌లైన్ టెలీమెడిసిన్ విధానానికి రూపకల్పన.
- బెంగళూరు ట్రిపుల్ ఐటీ సాంకేతిక సాయం అందిస్తుంది.
- ప్రధానమంత్రి ఈ-విద్యలో భాగంగా ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్.
- ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక ఛానళ్లు ప్రారంభం.
- ప్రధాని ఈ – విద్య కార్యక్రమం కింద టెలివిజన్ ఛానళ్లు 12 నుంచి 200కు పెంపు.
- ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ.
- విద్యార్థులందరికీ అందుబాటులోకి ఈ – కంటెంట్.
- డిజిటల్ విద్య అందించే ఉపాధ్యాయులకు అందుబాటులోకి ప్రపంచస్థాయి ఉపకరణాలు.
- చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకం.
- క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ. 2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు.
- నదుల అనుసంధానానికి 5 డీపీఆర్‌లు సిద్ధం చేశాం.
- ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.
- పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు, ప్రత్యేక వ్యవస్థలు.
- ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అవకాశాలు.
- వంట నూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి.
- పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం.
- రసాయన రహిత వ్యవసాయ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం.
- సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేక ప్రోత్సాహం.
- చిరు ధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం ఇస్తాం.
- 2023ను తృణ ధ్యానాల సంవత్సరంగా ప్రకటిస్తున్నాం.
- ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్.
- ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం.
- వ్యవసాయ ఉత్పత్తుల విలువల పెంపు కోసం స్టార్టప్‌లకు ఆర్థిక సాయం.
- రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయం పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక కథనం.
- పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్‌వేల అభివృద్ధి.
- 60 కిలోమీటర్ల దూరంతో ఒక్కో రోప్‌వే నిర్మాణం.
- పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణ హితమైన అభివృద్ధి.
- కొండ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగినంత అవకాశాలు.
- యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు ఈ బడ్జెట్ ఊతమిస్తుంది.
- దేశంలో నాలుగు చోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తాం.
- పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్‌తో ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం.
- 400 వందే భారత్ రైళ్లు ప్రారంభిస్తాం.
- వచ్చే ఐదేండ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు.
- డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థిక సాయం లభిస్తుంది.
- త్వరలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ రాబోతుంది.
- గృహ, వసతులు, తాగునీటి కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోంది.
- ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలు 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనబడింది.
- నీలాంచల్ నిస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను ప్రయివేటుపరం చేశాం.
- పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ నాంది.
- అందరి ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన.
- వచ్చే 25 ఏండ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది.
- కొవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా కలిసొచ్చింది.
- ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలకపాత్ర పోషించింది.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..