areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Statue of Equality : వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రారంభమైన సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు

Statue of Equality : సమతా మూర్తి స్పూర్తి కేంద్రంలో సహస్రాబ్ది ఉత్సవాలు..
  • ఈనెల 2 నుంచి ప్రారంభమైన వేడుకలు..
  • వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలు
  • ఈనెల 5న, 216 అడుగుల రామానుజ మహా మూర్తి విగ్రహం ప్రారంభం..
  • విగ్రహాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
  • త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం..
  • ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం..రాబోయే రోజుల్లో అతి పెద్ద పర్యాటక కేంద్రంగా మారనుంది: సీఎం కేసీఆర్

ఆర్సీ న్యూస్, ఫిబ్రవరి 02 (హైదరాబాద్): Statue of Equality : శంషాబాద్ లోని ముచ్చింతల్ ప్రాంతంలో ఎంతో అత్యద్భుతంగా నిర్మించిన సమతా మూర్తి సహస్రాబ్డి ఉత్సవాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో పలువురు అధికార,అనధికార ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతిష్టించిన 216 అడుగుల ఎత్తున రామానుజుల మహా మూర్తి విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 40 ఎకరాలు ఇప్పటికే ఏర్పాటు చేసిన 1035
హోమ గుండాల ద్వారా ఐదువేల మంది స్వాములతో శ్రీ లక్ష్మి నారాయణ యాగాన్ని నిర్వహించారు. ఈ యాగం కోసం రాజస్థాన్ నుంచి పది వేలు కుండలు తెప్పించారు. యాగం కోసం లక్షన్నర కిలోల దేశవాళి ఆవు పాలతో రూపొందించిన నెయ్యిని ద్రవ్యంగా వినియోగిస్తున్నట్లు త్రిదండి చిన్న జీయర్ స్వామి వెల్లడించారు. కేంద్రంలో నాలుగు ద్వారాలు ఉన్నాయి. లోనికి ప్రవేశించడానికి నిర్మించిన ఈ నాలుగు ద్వారాలు కాకతీయ నిర్మాణ శైలిలో ఆకర్షణీయంగా ఉన్నాయి. 90 అడుగుల ఎత్తుతో 9 నుంచి 6 అడుగుల వెడల్పు కలిగి ఉంటాయి. ఈ వేడుకలలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. అంతే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అధికార, అనధికార ప్రముఖులు హాజరుకానున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది రోడ్లు, మంచి నీరు, విద్యుత్, పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది.

Statue of Equality : రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక కేంద్రం : సీఎం కేసీఆర్

త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్మించిన సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక కేంద్రంగా మారి పర్యాటకు లను ఆకట్టుకుంటుందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. త్రిదండి చిన్న జీయర్ స్వామి భక్తులు ఎంతో కష్టపడి స్ఫూర్తి కేంద్రం నిర్మించుకున్నారని ఆయన కొనియాడారు. ఈ కేంద్రాన్ని ఆకర్షణీయంగా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. వారు కష్టపడి కట్టుకున్న ఈ స్ఫూర్తి కేంద్రాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ కట్టించాడని ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం సందర్భంగా బిజెపి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడి బిజెపి నాయకులు తమ మోడీ హైదరాబాద్ నగరంలో అత్యంత అద్భుతంగా రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని.. అక్కడి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడేం మాట్లాడుతారో చెప్పాలంటూ అనవసరంగా కామెంట్లు చేస్తున్నారని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తగిన ఏర్పాట్లు చేసిందన్నారు.