- ఇక ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు..
- ఇంటి వద్దకే వస్తున్న కార్ల షో రూం..
- టాటా మోటార్స్ ఆధ్వర్యంలో అందుబాటులోకి మొబైల్ షోరూం..
- కారు కొనాలన్నా.. అమ్మాలన్నా ఈ మొబైల్ షో రూమ్ ద్వారా ఈజీ..
- గచ్చిబౌలిలో ప్రారంభం
- టాటామోటార్స్ నుంచి ‘అనుభవ్ మెబైల్ షోరూమ్స్’ ప్రారంభం
ఆర్సీ న్యూస్, మార్చి 04 (హైదరాబాద్): ఇక నుంచి కార్ల షోరూం మన ఇంటి వద్దకే రానున్నాయి. ఈ సౌకర్యాన్ని టాటా మోటార్స్ అందుబాటులోకి తెచ్చింది. టాటా మోటార్స్ ఆధ్వర్యంలో మొబైల్ షోరూం ప్రారంభించింది. ఈ మొబైల్ షోరూం మన గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల వద్ద కూడా తమకు ఇష్టమైన కార్లను ఎంపిక చేసుకొని ఖరీదు చేయడానికి వీలు కల్పిస్తోంది. కార్లు కొనడమే కాకుండా తమ పాత కార్లను అమ్మడానికి కూడా ఈ మొబైల్ షోరూం అనుకూలంగా ఉంటుందని టాటా మోటార్స్ యాజమాన్యం ప్రకటించింది. భారతదేశంలోని ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్ అయిన టాటా మోటార్స్ గ్రామీణ వినియోగదారుల కోసం డోర్ స్టెప్ కార్ కొనుగోలు అనుభూతిని అందించే ‘అనుభవ్’ షోరూమ్ ఆన్ వీల్స్‌ను పరిచయం చేసింది.ఈ మెబైల్ వ్యాన్‌ను గచ్చిబౌలిలోని టాటా వెంకటరమణ షోరూమ్‌లో , టాటా మోటార్స్ తెలంగాణ రూరల్ టెరిటరీ సేల్స్ మానేజర్ అతుల్, సి.ఈ.ఓ మహేందర్,కలిసి ప్రారంభించారు. రూరల్ మార్కెటింగ్ వ్యూహానికి అనుగుణంగా, గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువగా వివిధ మండలాలకు తాలూకాలకు టాటా నుంచి రిలీజైన చిన్నకార్ల నుంచి ఎస్.యూ.వీ కార్ల వరకు అన్ని తమ అన్ని కార్ల వివరాలను కస్టమర్లు ఈ అనుభవ్ వ్యాన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఇందులో..కార్ యాక్సెసరీలు, ఫైనాన్స్ స్కీమ్‌లను పొందడం, టెస్ట్ డ్రైవ్‌ను బుక్ చేయడం మరియు ఎక్స్‌ఛేంజ్‌లో తమ పాత కార్లకు ధరను నిర్ణయించడం వంటి వాటి గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
Tata unveils new mobile showrooms : గ్రామీణ ప్రాంతాల్లో టాటా మోటార్స్ బ్రాండ్ అవగాహనను పెంపొందించడానికి దేశవ్యాప్తంగా మొత్తం 103 మొబైల్ షోరూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ మొబైల్ షోరూమ్‌ల ద్వారా ఇప్పటికే ఉన్న డీలర్‌షిప్‌లు, కస్టమర్‌లకు డోర్‌స్టెప్ సేల్స్ అనుభవాన్ని అందించడంలో సహాయపడతాయి. ఫైనాన్స్ స్కీమ్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు మొదలైన వాటి గురించి సమాచారాన్ని కోరుకునే గ్రామీణ వినియోగదారులకు ఈ మొబైల్ షోరూమ్‌లు వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఉపయోగపడతాయి. ఈ మొబైల్ షోరూమ్‌లను టాటా మోటార్స్ పర్యవేక్షణలో డీలర్‌షిప్‌లు నిర్వహిస్తాయి. అన్ని డీలర్‌షిప్‌లు ఈ వ్యాన్‌ల కోసం నెలవారీ రూట్‌లను రూపొందిస్తాయి, వాటిపై వారు అనుకున్న గ్రామాన్ని లేదా ప్రాంతాన్ని తిరుగుతారు. ఈ మొబైల్ షోరూమ్‌ల మెరుగైన వినియోగం కోసం వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయటానికి GPS ట్రాకర్‌లతో వీటిని రూపొందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టాటా వెంకటరమణ షోరూమ్, డి. జీ. ఎం.శరత్ మరియు షోరూమ్ సిబ్బంది కస్టమర్లు పాల్గొన్నారు.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..