మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం..

  • దీంతో దిగ్భ్రాంతికి గురైన ఏపీ ప్రజలు…
  • ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి..
  • అమెరికా నుంచి కుమారుడు వచ్చిన అనంతరం ఎల్లుండి అంత్యక్రియలు..
  • ఈనెల 20న దుబాయ్ పర్యటన ముగించుకుని నగరానికి వచ్చిన మేకపాటి..
  • 21న, ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం..
  • 22న, నెల్లూరులో అభిమానుల సందర్శనార్థం పార్థివదేహం..
  • 23న, అంత్యక్రియలు..
  • ఇప్పటికే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సందర్శన..

 ఆర్సీ న్యూస్, ఫిబ్రవరి 21 (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్లోని తన ఇంట్లో గుండెపోటుతో మృతి చెందారు. గత వారం రోజుల పాటు దుబాయ్ పర్యటన ముగించుకొని ఈనెల 20వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. దుబాయ్ పర్యటన విశేషాలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించడం కోసం ఇప్పటికే ఈనెల 22వ తేదీన అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇంతలోనే సోమవారం ఉదయం ఆకస్మికంగా తన ఇంట్లో గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు,కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని ఆయన నివాసానికి చేరుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డిని కలిసి పరామర్శించారు. గౌతంరెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, ఇంద్రకరణ్రెడ్డి, ఏపీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ తదితరులతోపాటు నటుడు పవన్ కళ్యాణ్ పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు గౌతమ్ రెడ్డి పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై స్పందించిన మంత్రి మేకపాటి కుటుంబం
  • మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవం
  • రాత్రి జరిగిన ఓ ఫంక్షన్ లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా ఇంటికి చేరిన మంత్రి మేకపాటి
  • ఉదయం 06.00 గం.లకి రోజూలాగే ఉదయాన్నే మేల్కొన్న మంత్రి
  • 06:30 గం.ల వరకూ మంత్రి ఫోన్ లలో సంభాషణలు.
  • 07.00 గం.లకు మంత్రి నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చుని ఉన్న మంత్రి మేకపాటి
  • 07:12కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పిన మంత్రి  గౌతమ్ రెడ్డి
  • 07:15గం.లకు  హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లిగా కిందకి ఒరిగిన మంత్రి
  • 7:16 గం.లకు కంగారు పడి గట్టిగా అరిచిన మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి
  • 07:18 పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతిమీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించిన మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావు
  • 07:20 గం.లకు  మంత్రి మేకపాటి పక్కనే ఉన్న  భార్య శ్రీకీర్తి అప్రమత్తం
  • 07:20 మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో.. మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచిన భార్య శ్రీకీర్తి
  • 07:22 “నొప్పి పెడుతుంది కీర్తి” అంటున్న మంత్రి మాటలకు స్పందించి వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరిన మంత్రి సిబ్బంది
  • 07:27 మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి గల 3 కి.మీ దూరాన్ని, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి చేర్చిన మంత్రి మేకపాటి డ్రైవర్,సిబ్బంది
  • 08:15 గం.లకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని తెలిపిన అపోలో వైద్యులు
  • 09:13 గం.లకు మంత్రి మేకపాటి ఇక లేరని నిర్ధారించిన అపోలో ఆస్పత్రి వైద్యులు
  • 09:15 గం.లకు మంత్రి మేకపాటి చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించిన అపోలో