areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సినిమా పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం..వాయిదా పడనున్నపెద్ద సినిమా ల విడుదల…

చిరంజీవి నటిస్తున్న సినిమా ఆచార్య

ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్): సినీ పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా పడనున్నపెద్ద సినిమాల విడుదల.  గతేడాది సినిమా లు నడవక తీవ్రంగా నష్టపోయిన సినీ నిర్మాతలు ఈసారైనా తమ తమ కొత్త సినిమాలను విడుదల చేసుకుని అంతో ఇంతో నష్టాలను భర్తీ చేసుకుందామని భావించారు. అనుకున్నట్లే కొన్ని సినిమా లు విడుదలయ్యాయి. కలెక్షన్లు కూడా రాబట్టగలిగారు. ఈ ఏడాది మార్చి మొదటి వారం వరకు ఫర్వాలేదని అనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో భారీ ప్రాజెక్ట్స్ నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో నిర్మిస్తున్న భారీ సినిమాల విడుదల పరిస్థితులపై సమాలోచనలో పడ్డారు. ఎప్పుడు ఎలా విడుదల చేయాలని అంచనాలు వేసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగితే తమ సినిమాలను వాయిదా వేసుకోక తప్పదని పలువురు తెలుగు సినిమాల నిర్మాతలు భావిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాయిదా తప్పదంటున్నారు.

ఇప్పటికే రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకున్నవారికి చుక్కలు చూపిస్తున్న కరోనా..

ఇప్పటికే రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకున్న నిర్మాతలకు సెకండ్ వేవ్ కరోనా చుక్కలు చూపిస్తోంది. వారికి ఏం చేయాలో బోధపడడం లేదు. సినిమాల రిలీజింగ్ డేట్లను వాయిదా వేయడం తప్పా..మరే గత్యంతరం కనిపించడం లేదు. ఇప్పటికే రిలీజైన పెద్ద సినిమాల కలెక్షన్లు సైతం అంతగా లేవని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ సినిమాలను రిలీజ్ చేస్తే..ఆశించిన ఫలితాలుంటాయా..? అని సినీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. వాయిదా వేసుకోవడం తప్పా..మరో మార్గం కనిపించడం నిర్మాతలకు. ఇప్పటికే ముంబాయిలో బాలీవుడ్ సినీ పరిశ్రమ కుదేలయింది. ఇప్పటికే అక్కడి సినిమా థియేటర్లు మూత పడ్డాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సినిమాలతో పాటు సీరియల్ షూటింగ్ లపై ఆంక్షలు విధించింది. దీంతో దేశ వ్యాప్తంగా హిందీ సినిమాల విడుదల దాదాపు వాయిదా పడే దుర్బర పరిస్థితులు నెలకొన్నాయి. 

సినీ పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం..వాయిదా పడనున్నపెద్ద సినిమాల విడుదల

రాబోయే రోజుల్లో థియేటర్లలో ఆక్యుపెన్సీ విషయాలు తెరపైకి వస్తే..

ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే…ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతోంది.ప్రస్తుతం సినిమా థియేటర్లు మూత పడన ప్పటికీ..రాబోయే రోజుల్లో థియేటర్లలో ఆక్యుపెన్సీ విషయాలు తెరపైకి వస్తే…సగం సీట్లకే సినిమాలు రన్ చేయాలంటే..తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి ఏమిటని తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే..భారీ బడ్జేట్ సినిమాల విడుదలను దసరా వరకు వాయిదా వేయక తప్పదని నిర్మాతలు అంటున్నారు.ప్రస్తుతం కరోనా బంద్, కరోనా కర్ప్యూ, లాక్ డౌన్ లుండవని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే..రాబోయే రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తి మరింత వేగంగా జరిగితే…పరిస్థితులు మారవచ్చునని..అప్సుడు సినిమా పరిశ్రమపై ప్రభావం పడుతుందని నిర్మాతలు అనుకుంటున్నారు. దీంతో తమ సినిమాల రిలీజ్ లను వాయిదా వేసుకోవడమే మంచిదని భావిస్తున్నారు. తక్కువ బడ్జేట్ తో తీసే చిన్న సినిమాలను మాత్రం ఓటీటీలో విడుదల చేయడానికి మరికొంత మంది నిర్మాణాలు సిద్దంగా ఉన్నారు. 

పెద్ద చిత్రాల విడుదల వాయిదా తప్పదా…

ఏదిఏమైనా సెకండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై పెద్ద దెబ్బగా మారబోతోంది. సినీ పరిశ్రమ భారీ నష్టాలను ఎదుర్కోవడానికి సిద్దమవ్వాల్సి ఉంది. సినీ నటులు నానీ నటించిన టక్ జగదీష్ ఈనెల 23న, విడుదలకు సిద్దమయ్యింది. అయితే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గుబాటి రాణా నటించిన విరాట్ పర్వం, నాగచైతన్య‌,సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ, కేజీఎఫ్‌-2, ఏక్ మినీ కథ, చిరంజీవి నటిస్తున్న ఆచార్య, తగ్గేదే..లే..అంటూ సినీ నటులు అల్లు అర్జున్ నటించిన ఫుఫ్స ఆగస్టులో ప్రేక్షకుల మందుకు రావాలనుకున్నప్పటికీ..అందుకు కరోనా వరిస్థితులు అనుకూలించక పోవచ్చునని సినీ వర్గాలు అంటున్నాయి. అక్షయ్ కుమార్ సూర్యవంశీ, విశ్వాక్ సేన్ పాగల్, కంగనా తలైవీ ప్రాజెక్ట్..ఇలా భారీ ప్రాజెక్ట్స్ నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. కరోనా మరింత డేంజర్ గా మారితే..వాయిదా తప్పా మరో మార్గం లేదని నిర్మాతలు భావిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈఏడాది సినీ పరిశ్రమ కోలుకుం టుందని భావిస్తున్న తరుణంలో సెకండ్ వేవ్ కొంపలు ముంచుతోందని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.