నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

చర్చనీయాంశంగా మారిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగం..

ఆర్సీ న్యూస్ (హైదరాబాద్): నగరంలో ఆదివారం రాత్రి జరగిన వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. సినిమా దర్శకుడు శ్రీరాం వేణు, సంగీత దర్శకులు తమన్,నిర్మాత దిల్ రాజులతో పాటు పలువురి సినీ ప్రముఖులు పాల్గొన్నారు.సమాజంలో మహిళలకు సముచిత న్యాయం జరగాలనే కథాంశంతో రూపొందించినట్లు వివరించారు. అమితాబ్ నటించిన పింక్ హిందీ సినిమాతో పాటు తమిల్లో అజిత్ నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని..అందుకే తెలుగులో ఈ సినిమాను పవన్ కళ్యాన్తో తీయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయని నిర్మాత దిల్ రాజు తెలిపారు.  ఇక  సినీ నటులు పవన్ కళ్యాన్ చేసిన రాజకీయ ప్రసంగం చర్చనీయాంశం అవుతోంది. సినిమా రంగానికి సంబందించిన అంశాలతో పవన్ కళ్యాన్ ప్రసంగం ఉంటుందని అనుకున్న వారందరికి షాక్ ఇచ్చారు. ఆయన ప్రసంగం అన్ని పార్టీల నాయకులను టార్గెట్ చేసినట్లు కనిపించింది. 

  •  భారత్ మాతాకీ జై..అంటే సరిపోదు. కేవలం వేదికలపై మాత్రమే మహిళల పట్ల గౌరవం ఉన్నట్లు నటించడం కాదు..నిజంగా మహిళలను గౌరవించాలి..అంటూ సినీ నటులు పవన్ కళ్యాన్ అన్నారు.
  • సిమెంట్ ఫ్యాక్టరీలు,పాల ఫ్యాక్టరీలు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్న రాజకీయ నాయకులు..నేను సినిమాలో నటిస్తున్నానంటే విమర్షించడం సరైంది కాదు.
  • పేకాట ఆడేవారు సైతం ఎం.ఎల్.ఏలు అవుతుండగా..సాదాసీదాగా ఉన్నవారు కాకూడదా..
  • పైరవీలు చేసుకునే వారు రాజకీయాలను చక్కగా వినియోగించుకుంటున్నారు.
  • తాను అవినీతి పైరవీలు చేయకుండా ఉండేందుకే అవసరాన్ని బట్టి సినిమాల్లో నటిస్తున్నాను.
  • తాను సినిమాల్లో నటించడం పట్ల వెయ్యి మంది వరకు ఉపాధి పొందుతున్నారు.
  • తానెప్పుడు సినిమా రంగం నుంచి పారిపోను.
  • సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తిరిగి సమాజం బాగు కోసమే వినియోగిస్తున్నాను.
  • పైరవీలు చేసే వారు రాజకీయాల్లో ఉండోచ్చు. నాలాంటి వాడు ఉండకూడదా.
  • తాను అనుకున్నదెప్పుడు నా జీవితంలో జరగడం లేదు.
  • సాధారణ జీవితం గడుపుతూ..ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండాలనుకున్నాను.
  • అలా జరగడం లేదు. నటుడు కావాలని అనుకోలేదు. నటున్ని అయ్యాను. 
  • గుర్తింపు వద్దనుకున్నాను. గుర్తింపు వచ్చింది. ఇక  సీఎం కావాలని అనుకోలేదు..రేపు చెప్ప లేం.
  • నాకు పొగరుందంటారు. అసలు పొగరు అంటే ఏమిటి..? నా పనుల్లో నేను బిజీగా ఉంటే కావాలని కల్పించుకుని నన్నుగెలకడం అవసరమా,,?
  • ఈనెల 9న థియేటర్లలో రిలీజ్ అవుతున్న వకీల్ సాబ్ మీ అందరికి బాగా నచ్చుతుంది.