అక్టోబర్ 10, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Chiranjeevi meets Cm Ys Jagan full details : టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది..

Chiranjeevi meets Cm Ys Jagan full details : టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది..

Chiranjeevi meets Cm Ys Jagan full details : టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది..

  • ఏపీ సీఎం తో భేటీ అయిన చిరంజీవి..
  • సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం.. 
  • ఇండస్ట్రీ పెద్దగా కాదు.. ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాను..
  • సమస్య పరిష్కారానికి సానుకూలత..
  • జీవో 35 పై పునరాలోచన..
  • సినీ పరిశ్రమ సమస్యలను సీఎంకు వివరించిన చిరంజీవి..
  • ఏకపక్షంగా కాకుండా పరిశీలించాలని కోరాను..
  • గన్నవరం విమానాశ్రయం లో విలేకరులతో చిరంజీవి..

ఆర్సీ న్యూస్, జనవరి 13 (హైదరాబాద్): గత కొంత కాలంగా సినిమా టికెట్ల రేట్లపై కొనసాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని ప్రముఖ సినీ నటులు చిరంజీవి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను ఈరోజు ఆయన ఇంటికి వెళ్లి ఆయనతో కలిసి లంచ్ చేశానని చిరంజీవి చెప్పారు. తనను జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి వైయస్ భారతి సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టారన్నారు. తన పట్ల ఎంతో గౌరవంగా సీఎం వ్యవహరించారన్నారు.

Chiranjeevi meets Cm Ys Jagan full details : టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది.. శ్రద్దగా విని.. సానుకూలంగా స్పందించిన సీఎం..

 సినీ పరిశ్రమ పట్ల వైయస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారన్నారు. తాను సినీ పరిశ్రమలో ఎదురవుతున్న పలు సమస్యలతో పాటు కార్మికుల కష్టాలను, టిక్కెట్ల విధానాన్ని, జీవో 35 అమలు తదితర అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లానని అన్నారు. తాను తెలియ జేసిన అన్ని సమస్యలను సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రద్ధగా విని సానుకూలంగా స్పందించారని చిరంజీవి తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు సైతం సినిమాల ద్వారా వినోదం అందించాలనే ఆకాంక్ష మంచిదే అయినప్పటికీ.. కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని సీఎంకు వివరించానని చిరంజీవి తెలిపారు.   

Chiranjeevi meets Cm Ys Jagan full details : టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది..కరోనా కష్ట కాలంలో..

కరోనా కష్టకాలంలో సినీ కార్మికులు ఉపాధి లేక ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయనకు వివరించానన్నారు. సీఎం ఆదేశాల మేరకు సినీ పరిశ్రమలోని నిర్మాతలు ఇతరులతో కలిసి సీఎంతో జరిగిన భేటీ వివరాలను తెలియజేస్తానన్నారు. అందరిని కలిసి అందరి ఆమోదంతో తిరిగి సీఎం జగన్ ను కలుస్తాను అన్నారు. సాధ్యమైనంత వెంటనే వివాదానికి పుల్ స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయన్నారు. తాను వివరించిన విషయాలన్నింటినీ ఇప్పటికే ప్రభుత్వం వేసిన కమిటీకి వివరిస్తానని సీఎం తనకు హామీ ఇచ్చారని చిరంజీవి అన్నారు.

చిరంజీవి : అనవసరంగా స్టేట్మెంట్ ఇవ్వ వద్దు..

అయితే ఈ విషయంపై ఎవరికి వారు అనవసర కామెంట్లు చేయకుండా సంయమనం పాటిస్తే బాగుంటుంది అనే విషయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు. వెంటనే తిరిగి సీఎంతో సమావేశం అవుతామన్నారు. ఈ సమావేశానికి సీఎం పిలుపు మేరకు నేను ఒక్కడినే వెళ్తానా… అందరితో కలిసి వెళతామా అనే విషయం త్వరలో తెలుస్తోందన్నారు. మళ్లీ సీఎం తో సమావేశం అయ్యేంత వరకు సినీ పరిశ్రమలోని వారు తమకు తాము స్టేట్మెంట్లు ఇవ్వరాదని ఆయన కోరారు.

 Chiranjeevi meets Cm Ys Jagan full details : టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది.. సినీ పెద్దగా కాదు..సినీ బిడ్డగా వచ్చాను

 గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ల రేట్లపై కొనసాగుతున్న వివాదంపై చర్చించడానికి చిరంజీవి ఏపీ సీఎం తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సి ఎం ఇంటికి చేరుకున్న చిరంజీవిని కొంతమంది విలేకరులు సినీ పెద్దగా వచ్చారా అని ప్రశ్నించారు. దీనికి వెంటనే స్పందించిన చిరంజీవి తాను ఇండస్ట్రీ పెద్దగా కాదని..ఇండస్ట్రీ బిడ్డగా మాత్రమే వచ్చానని బదులిచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తో గురువారం మధ్యాహ్నం కలిసి దాదాపు 01:15 గంటల సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన సీఎంకు వివరించారు. ఇప్పటికే సినిమా టికెట్ల పై జరుగుతున్న వివాదంలో తమ్మారెడ్డి భరద్వాజ తో పాటు రాంగోపాల్ వర్మ తదితరులు స్పందించారు. వీరికి మంత్రి పేర్ని నాని దీటైన సమాధానం ఇచ్చారు. ఈ వివాదం ఇలాగ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి.. చిరంజీవిని లంచ్ కు ఆహ్వానించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందరి దృష్టి వీరిద్దరి భేటీపై పడింది. 

పరిష్కారం కొలిక్కి రావడమేనట..

ఏదిఏమైనా గత కొంత కాలంగా ఏపీలో కొనసాగుతున్న టిక్కెట్ల రేట్లు వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చిరంజీవి తెలిపారు.