areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Chiranjeevi: బాధ్యతగా ఉంటా.. సమస్యలు వస్తే సహాయం చేస్తా..

Chiranjeevi: బాధ్యతగా ఉంటా.. సమస్యలు వస్తే సహాయం చేస్తా..
  • సినిమా ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను..
  • పెద్దరికం పదవి నాకొద్దు..
  • ఆ స్థానమే నాకొద్దు..
  • హైదరాబాదులో యోధ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన..

ఆర్సీ న్యూస్, జనవరి 02(హైదరాబాద్): సినీ పరిశ్రమకు తాను పెద్దగా ఉండనని.. అలాగని సమస్యలు వస్తే అందరికీ తన సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. సినీ ఇండస్ట్రీకి పెద్ద అనే పదం అనిపించుకోవడం తనకు వద్దని ఆయన కరాఖండిగా చెప్పేశారు. బాధ్యతగా ఉంటా.. సమస్యలుంటే సహాయం చేస్తా అంటూ వివరించారు. ఆదివారం హైదరాబాదులో జరిగిన యోధ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టిన హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాను సినీ పరిశ్రమకు పెద్దగా కాకుండా బాధ్యతగా ఉంటానన్నారు. అనవసరంగా యూనియన్ గొడవలలో తలదూర్చడం తనకు ఇష్టం లేదన్నారు. ఇద్దరూ ఎవరో కొట్టుకుంటుంటే వారి మధ్య లోకి వెళ్లి ఆయా సమస్యలను పట్టించుకోవడం సరైంది కాదని తాను భావిస్తున్నాన న్నారు. కార్మికుల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అన్నారు. ఆపదలో ఉంటే మాత్రం ఎవరినైనా తప్పకుండా ఆదుకుంటా” అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కరోనాతో ఎంతోమంది సినీ కార్మిక కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని.. అలాంటి వారికి ఏదైనా చేయాలన్నదే తన తాపత్రయన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల సభ్యుల కుటుంబాలకు యోధా డయాగ్నిస్టిక్స్‌ ల్యాబ్స్‌లో టెస్టులు, చికిత్సకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన కోరిక మేరకు వెంటనే అంగీకరించిన యోధా డయాగ్నస్టిక్‌ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. 50% రాయితీతో సినీ కార్మికులకు హెల్త్ కార్డులను అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కేవలం మెంబర్స్‌కు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించారు. ఇక మేమిచ్చే హెల్త్‌ కార్డ్‌, దీని క్యూఆర్‌ కోడ్‌లో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. ఇప్పటివరకూ 7,699 కార్డులు సిద్దమయ్యాయి. మిగతావి కూడా ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ మహమ్మారి విజృంభిస్తోంది. షూటింగ్‌లో ఉన్నవాళ్లు అన్ని జాగ్రత్తలు తీసువాలి. ఇకపై ప్రతి దాంట్లో పెద్దరికంగా ఉండను. ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రాను’’ అని చిరంజీవి స్పష్టం చేశారు. ఆపదలో ఉంటే మాత్రం తప్పకుండా అండగా ఉంటానని.. అంతేకాదు వారిని ఆదుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.