అక్టోబర్ 10, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Telangana holidays extends జనవరి నెలాఖరు వరకు విద్యా సంస్థలు బంద్..

Telangana holidays extends జనవరి నెలాఖరు వరకు విద్యా సంస్థలు బంద్..
  • ఈనెల16వ తేదీ వరకు ఉన్న సెలవుల పొడిగింపు..
  • కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెలవుల పొడిగింపు..
  • మెడికల్ కాలేజీలు తప్పా.. అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
  • జనవరి 30 వరకు సెలవులు..

ఆర్సీ న్యూస్, జనవరి 16 (హైదరాబాద్): రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు జనవరి 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రకటించిన సంక్రాంతి సెలవులను పొడిగించింది. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వైద్య ఆరోగ్య శాఖ నుంచి నివేదిక మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విద్యా సంస్థల సెలవులు పొడిగించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Telangana holidays extends జనవరి నెలాఖరు వరకు విద్యా సంస్థలు బంద్..

ఈనెల 16వ తేదీ నుంచి ముగియనున్న సంక్రాంతి సెలవులను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు తప్ప అన్ని ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థలన్నీ తమ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సోమేష్ కుమార్ కోరారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తోంది. అంతేకాకుండా ప్రజలందరూ వ్యాక్సిన్ చేసుకోవాలంటూ కోరుతోంది. గత 24 గంటల్లో దేశంలో 2,71,202 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. ఇందులో  314 మంది మృతి చెందారు. అలాగే రాష్ట్రంలో గత 24 గంటల్లో 1963 కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకూ 22,017 యాక్టివ్ కేసులున్నాయి.