ఏప్రిల్ 24, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కరోనా కట్టడి కోసం బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తిరగకుండా చర్యలేవీ..? హైకోర్టు.

కరోనా కట్టడి బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తిరుగుతున్నారని హైకోర్టు

ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్): బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఎక్కువగా తిరుగుతున్నారని..వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేవలం రాత్రిపూట కర్ప్యూ విధిస్తే సరిపోతుందా..కరోనా కట్టడి చేయాల్సిన అవసరం లేదా..? అని హైకోర్టు అసంత్రుప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుండగా…రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఈ నెల 19న, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కట్టడికి న్యూ ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇక్కడ మాత్రం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడం లేదు..ఇదేంటి..? అని ప్రశ్నించింది.  కుంభమేళాలో పాల్గొన్న వారు ఇక్కడికి వస్తున్నారు..మీరు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని నిలదీసింది. కరోనా కర్ఫ్యూ, లాక్ డౌన్ విధించడానికి  రాబోయే 48 గంటల్లో కోర్టుకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే..కోర్టు స్పందించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 23 కు కేసును వాయిదా వేసింది. 19వ తేదీ నాటి హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 20 వ,తేదీ రాత్రి 9 గంటల నుంచి మే 1వ తేదీ తెల్లవారు జాముల 5 గంటల వరకు రాత్రిపూట కరోనా కర్ప్యూ విధిస్తున్నట్లు రాష్గ్ర ప్రభుత్వం ప్రకటించింది.

  • షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న, కోర్టు తిరిగి విచారణ చేపట్టింది.
  • కేవలం నైట్ కర్ప్యూ చేపట్టినంత మాత్రానా సరిపోతుందా..అని మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
  • దేశంలోెని పలు ప్రాంతాల్లో కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వాలు స్పందిస్తున్నాయని పేర్కోంది.
  • కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక కమిటిని నియమించాలని ఆదేశించింది.
  • బహిరంగ ప్రదేశాల్లో జన సంచారం తగ్గించాలని సూచించింది.
  • ఎన్నికల సభలు,సమావేశాలను కట్టడి చేయాలంది. వీటిపై ఆంక్షలు విధించాలని ధర్మాసనం కోరింది.
  • బార్ అండ్ రెస్టారెంట్, పబ్ లు, వైన్ షాఫ్ లు, సినిమా థియేటర్ల వద్ద ప్రజలను కట్టడి చేయాలంది. వీటి వద్ద కరోనా వైరస్ వ్యాప్తి జరుగకుంటా పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు అవసరమని సూచించింది
  •  రాజకీయ సమావేశాలని నియంత్రించాలని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ర్యాలీలలో అధిక సంఖ్యలో ప్రజలు గుమికూడకుంగా ముందస్తు ఆంక్షలు ఎంతో అవసరమని ధర్మాసనం సూచించింది.
  • వివాహాది శుభకార్యాలను కట్టడి చేయల్సిన అవసరం ఉందని..వందల సంఖ్యలో ప్రజలు గుమిగుడకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.
  • రాష్ట్రంలో కరోనా కట్టడితో పాటు ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు తగిన విధంగా స్పందించాలని కోరింది.
  • కోవిడ్‌19 లక్షణాల ఆధారంగా ప్రతి రోగిని ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని..ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టులు లేకున్నా..
  • ప్రతి ఆసుపత్రిలో రోగులను చేర్చుకోవాలని కోరింది.
  • ప్రతి రోజు 30‌-40 వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వెంటనే…రోజుకు ఇన్ని టెస్టులు చేస్తే..
  • ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 8 లక్షల 40 వేలు చేయాలని..అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 లక్షల 47 వేలు మాత్రమే టెస్టులు చేశారని నిలదీసింది.
  • ఆశించిన మేరకు టెస్టులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల రిపోర్టులు 24 గంటల్లో వచ్చేటట్లు తగిన చర్యలు తీసుకోవానలని.. ఆసుపత్రుల్లో ఆక్సీజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుుడు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంది.
  • యాదాద్రి భువనగిరి,నిర్మల్,జగిత్యాల్, కామారెడ్డి,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని.. ఇక్కడ టెస్టులను పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది.
  • వలస కార్మికులు ఇబ్బందులకు గురికాకుండా వెంటనే వారి సౌకర్యార్ధం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది.
  • 108,104 అంబులెన్సులను అందుబాటులో ఉంచి టోల్ ఫ్రీ నెంబర్స్ ప్రజలకు తెలిసేలా చూడాలని కోరింది.
  • కంటోన్మెంట్, మైక్రో కంటోన్మెంట్ జోన్ల వివరాలతో పాటు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
  • తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27 కు కేసును వాయిదా వేసింది.