ఏప్రిల్ 20, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోలన వద్దు..వైద్యం అందజేయడానికి సిద్దం: మంత్రి ఈటెల రాజేందర్..

కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది.

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల పట్ల కొంత మంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మాస్క్ ధరిస్తూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తున్నప్పటికీ..ఆచరణలో సాధ్యం కావడం లేదు. 

కట్టడి చేయాలన్న మోడీ సూచనల మేరకు కదిలిన యంత్రాంగం…

ఇష్టానుసారంగా వ్యవహరించే ప్రజలను కట్టడి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను అలెర్ట్ చేసారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలి కోరారు. దీనిపై అందరూ స్పందించాలన్నారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రధాని కోరిన వెంటనే తెలంగాణలోని పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించింది. కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. సమావేశాలు నిర్వహించి స్థానికులకు అవగాహన కల్పించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు నడుం బిగించారు. రద్దీ గల ప్రాంతాల్లో కొంత మంది స్వచ్చంద సంస్థల సహాకారంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మాస్క్ లు లేని వారికి పోలీసులు ఉచితంగా మాస్క్ లు అందజేస్తున్నారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. 

కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు

కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు…

లా అండ్ ఆర్డర్ పోలీసులు స్థానికులతో పాటు వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. జనరల్ స్టోర్స్ నిర్వహకులకు తప్పని సరిగా శానిటైజర్స్ విరివిగా వినియోగించాలని సూచిస్తున్నారు. వస్తువులు వినియోగదారులకు ఇచ్చిన వెంటనే చేతులకు శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలంటున్నారు. సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు,సూచనలు అందజేస్తున్నారు. స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేస్తుండడంతో ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. ఇక ఫైన్ల విషయానికి వస్తే..మాస్క్ లు ధరించని వారికి ఒకవైపు జీహెచ్ఎంసీ వారు ఐదు వందలు ఫైన్ లు విధిస్తుండగా..మరోవైపు పోలీసులు సైతం వెయ్యి రూపాయలు ఛలాన విధించడానికి సిద్దమయ్యారు.

గత 24 గంటల్లో..6 గురు మృతి…

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2909 కేసులు నమోదు కాగా..కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాంటే పరిసస్థితులు ఏవింధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మెడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 289 కేసులు నమోదు కాగా..రంగారెడ్డిలో 225, నిజామాబాద్లో 202 కేసులు నయోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో 6 గురు మరణించారు. అతి తక్కువ కేసులు (8) ములుగు జిల్లాలో నమోదయ్యాయి.

కేసుల పెరుగుదలపై ఆందోళన వద్దు: మంత్రి ఈటెల రాజేందర్

కేసుల పెరుగుదలపై మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ..కేసులు పెరుగుతున్నందు ప్రతి ఒక్కరూ కరోనా కట్టడి కోసం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని..అక్కడి నుంచి మన రాష్ట్రానికి రాకపోకలు ఎక్కువ కావడంతో మన వద్ద కూడా కేసులు పెరుగుుతున్నాయన్నారు. ఎన్ని కేసులు పెరిగినా…అందరికి వైద్య సేవలు అందించడానికి తమ వైద్య సిబ్బంది సిద్దంగా ఉన్నారన్నారు. గత అక్టోబర్,నవంబర్ మాసంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయన్నారు. ప్రస్తుతం పెరుగుతుండడంతో శుభకార్యాలకు తగిన జాగ్రత్తలు తీసుకుని అతి తక్కుక మందితో ముగించాలని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా  ఉండడమే మంచిదన్నారు.