areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

గాలి ద్వారా కరోనాపై స్పష్టత లేదు…మంత్రి ఈటెల రాజేందర్..

గాలి ద్వారా కరోనాపై స్పష్టత లేదు…మంత్రి ఈటెల రాజేందర్..

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందని అనడానికి ఇప్పటి వరకు సైంటిఫిక్ ఆధారాలు లేవని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎవరూ తేల్చి చెప్పలేదన్నారు. కరోనా వైరస్ సోకిన రోగి మాట్లాడినప్పుడు వెలువడే తుంపర్లకు దూరంగా ఉండాలని, మాస్క్ లు ధరించాలని మాత్రమే ఇప్పటి వరకు పలువురు వైద్యులు చెప్పారని ఆయన స్పష్టం చేసారు. తుంపర్లు కూడా కొద్ది సేపు గాలిలోనే ఉంటాయే విషయం తప్పా..గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి స్పష్టత లేదన్నారు. కేసుల పెరుగుదలపై ఆదివారం నాడిక్కడ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ..కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ కరోనా కట్టడి కోసం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందన్నారు. 99.5 శాతం మంది కరోనా సోకి నప్పటికీ వైద్య సేవలు పొంది నయమయ్యారన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేదన్నారు. అవసరమైతే  పరిశ్రమలకు కాకుండా వైద్య రంగానికి ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయాలన్నామన్నారు. 95 శాతం మందిలో కరోనా వైరస్ లక్షణాలు లేవన్నారు. కేవలం 0.5 శాతం మందికే కరోనా వైరస్ లక్షణాలున్నాయని.. వీరు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60 వేల పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు. పీపీఈ కిట్లు,మందులు,అంబులెన్స్ లు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. కరోనా కర్ప్యూ లాక్ డౌన్లు బంద్ లు,  ఉండవని మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. గతంలో కరోనా కర్ప్యూ విధించడంతో రాష్ట్ర ప్రజలు పలు ఇబ్బందులకు గురైన విషయం అందరికి తెలిసిందే. అందుకే ఈసారి కరోనా కర్ప్యూ పెట్టడం లేదన్నారు.

 డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఆధ్వర్యంలో…రెమిడిసివిర్ ఇంజక్షన్స్

అత్యవసరంగా వినియోగించే రెమిడిసివిర్ ఇంజక్షన్స్ కొరత లేదని..రేపటి నుంచి అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. గత 4 నెలల క్రితం కరోనా వైరస్ భయం చాలా వరకు తగ్గిందని..దీంతో రెమిడిసివిర్ ఇంజక్షన్స్ తయారీ నిలిచిపోయిందని..ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో పలు ఫార్మా కంపెనీలు తిరిగి తయరీ చేస్తున్నాయన్నారు. దీంతో సోమవారం నుంచి ఇంజక్షన్స్ కొరత ఉండదన్నారు. అంతేకాకుండా బహిరంగ మార్కెట్ లో రెమిడిసివిర్ ఇంజక్షన్స్ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించిందన్నారు. డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ (డీసీ ఏ) ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కేవలం ఆసుపత్రులకు మాత్రమే కాకుండా డీసీఏ ద్వారా అందుబుటులో ఉంటాయన్నారు. 

ఇక్కడ 50 శాతం మంది రోగులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే…

కరోనా కట్టడిలో తమ రాష్ట్రం దేశంలోనే ముందున్నదని..దీని కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నా యని..అక్కడి నుంచి మన రాష్ట్రానికి రాకపోకలు ఎక్కువ కావడంతో మన వద్ద కూడా కేసులు పెరుగుుతున్నాయన్నారు. ఎన్ని కేసులు పెరిగినా…అందరికి వైద్య సేవలు అందించడానికి తమ వైద్య సిబ్బంది సిద్దంగా ఉన్నారన్నారు. వైద్య సిబ్బంది అనవసరంగా సెలవులు తీసుకోవద్దని మంత్రి కోరారు.  గత అక్టోబర్, నవంబర్ మాసంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయన్నారు. ప్రస్తుతం పెరుగు తుండడంతో శుభకార్యాలకు తగిన జాగ్రత్తలు తీసుకుని అతి తక్కుక మందితో ముగించాలని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా  ఉండడమే మంచిదన్నారు.హైదరాబాద్ నగరం హెల్త్ హబ్ గా పేరుగాంచిందని..అందుకే ఇక్కడ 50 శాతం మంది రోగులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారన్నారు. దీంతో కొన్ని కార్పోరేట్ ఆసుపత్రులలో బెడ్స్ ఖాళీగా లేవన్నారు.

వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి…

కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల పట్ల కొంత మంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారు. దీంతో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మాస్క్ ధరిస్తూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన మార్గ దర్శకాలు జారీ చేస్తున్నప్పటికీ..ఆచరణలో సాధ్యం కావడం లేదు. అందుకే పోలీసులు రంగంలోకి దిగారు. నిర్లక్ష్యంగా ఉండే వారిని కట్టడి చేస్తున్నారు. మాస్క్ లు ధరించకపోతే..రూ. 1000 జరిమాన విధిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు స్థానికులతో పాటు వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జనరల్ స్టోర్స్ నిర్వహకులకు తప్పని సరిగా శానిటైజర్స్ వినియోగించాలని సూచించారు. వస్తువులు వినియోగ దారులకు ఇచ్చిన వెంటనే చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని సూచించారు.

గత 24 గంటల్లో 5093 కేసులు..15 మంది మృతి…

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 5093 పాజిటివ్ కేసులు నమోదు కాగా..15 మంది మరణించారు. కాగా..కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 743 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాంటే పరిసస్థితులు ఏవింధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మెడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 488 కేసులు నమోదు కాగా..రంగారెడ్డిలో 407, నిజామాబాద్లో 367 కేసులు నయోదయ్యాయి. అతి తక్కువగా 22 కేసులు ములుగు జిల్లాలో నమోదయ్యాయి.