areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రేపు కేబినెట్ మీటింగ్…లాక్ డౌన్ పై కీలక నిర్ణయం

రేపు కేబినెట్ మీటింగ్…లాక్ డౌన్ పై కీలక నిర్ణయం

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండదని ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కేబినెట్ మీటింగ్ సమావేశం కీలకంగా మారనుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారా..లేదా..? అనే విషయాలు చర్చకు వస్తాయని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం జరగనున్న క్యాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతుండగా..తెలంగాణ రాష్ట్రంలోనే లాక్ డౌన్ లేకపోవడంతో..లాక్ డౌన్ విధింపు సాధ్యాసాధ్యాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. లాక్ డౌన్ విధిస్తే..ఎదురయ్యే ఆర్ధిక సమస్యలతో పాటు పేద ప్రజలకు తలెత్తే సమస్యలను చర్చించనున్నారు. గతవారం ప్రగతి భవన్ లో సంబంధిత ఉన్నతాధికారులతో కరోనా వైరస్ వ్యాప్తి, ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ సరఫరా, రెమిడెసివిర్ ఇంజక్షన్, వ్యాక్సిన్ పంపిణీ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తిరిగి మళ్లీ సీఎం మంగళవారం ఉన్నత స్థాయి క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తే..పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశాలు చర్చకు రానున్నాయని తెలుస్తోంది. లాక్ డౌన్ విధిస్తే…అన్ని రకాల ఆర్ధిక ఇబ్బందులు తప్పవని…గతేడాది లాక్ డౌన్ విధించడంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలిందని…అందుకే ఈసారి లాక్ డౌన్ వైపు మొగ్గు చూపడం లేదనే విషయాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. లాక్ డౌన్ తో ప్రజా జీవనం స్థంబించి పోతుందని… కరోనా సెకండ్ వేవ్ సందర్బంగా ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే లాక్ డౌన్ విధించినప్పటికీ..ఏ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గ లేదనే విషయాలపై చర్చ జరుగనుందని తెలుస్తోంది. లాక్ డౌన్ కాకుండా రాష్ట్రంలో రాత్రిపూట కరోనా కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర హైకోర్టు జోక్యం తేసుకుని మండిపడడంతో గత నెల 20 నుంచి రాత్రిపూట కర్ప్యూ అమలు లోకి వచ్చింది. మొదటగా..మే 1వ తేదీ వరకు..తర్వాత 8వ తేదీ వరకు..ఇప్పుడు 15వ తేదీ వరకు..ఇలా వారం వారం పొడిగిస్తూ వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ నెల 15 వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఇక నాలుగు రోజుల్లో రాత్రి కర్ఫ్యూ కడుపు ముగుస్తున్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయని..కేవలం తెలంగాణలో లాక్ డౌన్ లేదని విషయాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో సీఎం ఆధ్వర్యంలో మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో లాక్ డౌన్ విధింపు అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నట్లు చెబుతున్నారు. రంజాన్ మాసం చివరి రోజులు కొనసాగుతున్నందున లాక్ డౌన్ కు అవకాశం లేదని భావించగా…ఈ నెల 14వ తేదీ ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) పండుగ వూర్తి అవుతుండడంతో రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ ఇబ్బందులు తలెత్తవని..ఒకవేళ లాక్ డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే..రెండు మూడు రోజుల  వ్యవధి ఇచ్చి ఈ నెల 17వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. లాక్ డౌన్ విధించడానికి ముందుకు రాక పోతే…ప్రస్తుతం కొనసాగుతున్న రాత్రిపూట కర్ఫ్యూ కు తోడు మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.ఇప్పటికే రాష్ట్రానికి అన్ని వైపుల బార్డర్ లోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఈ నెల 24 వరకు సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంది. న్యూ ఢిల్లీలో ఈ నెల 16 వరకు, మహారాష్ట్రలో 15 వరకు, ఉత్రర్ ప్రదేశ్ లో 17 వరకు, గోవాలో 24 వరకు, ఒరిస్సా 19 వరకు, బీహార్ లో 15 వరకు, కేరళలో 16 వరకు, రాజస్థాన్ లో 24 వరకు లాక్ డౌన్ అమలులో ఉండగా..జార్ఖండ్,ఆంధ్రప్రదేశ్ లలో ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇలా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ తో పాటు ఆంక్షలు కొనసాగుతున్నందున ఈ నెల 11న, నిర్వహించే క్యాబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.