ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఇంత దారుణమా..? నడిరోడ్డుపై జరిగిన హత్య

ఇంత దారుణమా..? నడిరోడ్డుపై జరిగిన హత్య
  • హత్యకు పాల్పడిన నలుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్.
  • మోసం చేశాడంటూ హత్యకు పాల్పడిన నిందితులు..
  • దుబాయ్ నుంచి అక్రమంగా కేజీ బంగారాన్ని తరలించగా అరెస్టయిన నిందితుడు.
  • ప్రతీకారంగా హత్య చేసిన నిందితుడు.
  • రెండు రోజుల్లోనే హత్య కేసును ఛేదించిన చాంద్రాయణగుట్ట పోలీసులు.

ఆర్సీ న్యూస్, అక్టోబర్ 17( హైదరాబాద్): ఈ నెల 13వ తేదీన చాంద్రాయణగుట్ట లోని మెయిన్ రోడ్ పై హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హత్య జరిగిన రెండు రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులను దక్షిణ మండలం డి సి పి డాక్టర్ గజరావు భూపాల్ అభినందించారు. అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 2 కత్తులతో పాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గత కాలంగా మనోవేదనకు గురైన నిందితులు హత్య చేయడానికి సిద్ధమై పక్కా ప్రణాళికతో హత్య చేశారు. ఈ నెల 13వ తేదీన హత్యకు పాల్పడిన నిందితులను 15వ తేదీన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దక్షిణ మండలం డిసిపి డాక్టర్ గజరావు భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ చాంద్రాయణగుట్ట కు చెందిన రాయిస్ జాబ్రీ (23), ఆదిల్ జాబ్రీ (32),సయీద్ సాలేహ జాబ్రీ (29),సాద్ బిన్ సాలేహ జాబ్రీ (34) అనే నిందితులు ఈ నెల 13వ తేదీన పాతబస్తీ బార్కాస్ సలాలకు చెందిన హమేద్ బిన్ అలీ జుబేది (47) నీ కత్తులతో పొడిచి హతమార్చారు. హతుడు కార్ లో  హాజామాబాద్ మెయిన్ రోడ్డు పై నుంచి వెళ్తుండగా..ఈ నలుగురు కారును అడ్డగించి కత్తులతో పొడిచి చంపారు. హతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హతుడు ఆమెద్ బిన్ అలీ జుబేది పాతబస్తీ బార్కాస్ లోని సలాలలో నివాసముంటున్నాడు. వాస్తవానికి ఇతను దుబాయ్ వాస్తవ్యుడు.  వ్యాపార రిత్యా గత కొంత కాలంగా బార్కాస్ కు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. దుబాయ్ లో ఉన్నప్పుడు హంతకుడు రాయిస్ జాబ్రీ, హమీద్ బిన్ అలీ జుబేదీకి స్నేహితుడు. దుబాయ్ లో ఉండి 2019 లో నిందితుడు రాయిస్ జాబ్రీ  హైదరాబాద్ వస్తున్న సందర్భంగా..హత్యకు గురైన హామీద్ బిన్ అలీ జుబేది అతని బ్యాగ్ లో 1 కేజీ బంగారాన్ని దాచాడు.  అతనికి తెలియకుండా అతని సంచిలో అక్రమంగా ఒక కేజీ బంగారాన్ని దాచిన విషయం తెలియనక అలాగే నగరానికి బయలు దేరాడు. విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోగా.. శంషాబాద్ విమానాశ్రయంలో సెంట్రల్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అనుమతి లేకుండా అక్రమంగా బంగారం తరలిస్తున్నాడంటూ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా అరెస్టు చేసి అతని పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల వరకు జైలుకు వెళ్లి వచ్చిన నిందితుడు, హమెద్ బిన్ అలీ జూబేది వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాడు. అక్రమ బంగారం తరలింపు కేసులో సహకరిస్తానని మొదట్లో హామీ ఇచ్చాడు. అయితే రాను రాను రోజులు గడిచి పోతుండడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఎలాంటి సహాయం అందజేయడానికి ముందుకు రాలేదు. తనను ఉద్దేశపూర్వకంగా అక్రమ బంగారం కేసులో ఇరికించారని భావించిన నిందితుడు రాయిస్ హత్య చేయడానికి పూనుకున్నాడు. ఈనెల 13వ తేదీన ఉదయం హమీద్ ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తిరిగి ప్రశ్నించారు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితిలో తాను సహాయం చేయలేనని హమీద్ తేల్చిచెప్పడంతో నిందితుడు హత్య చేయడానికి స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా తనతో పాటు చాంద్రాయణగుట్ట కు చెందిన క్యాబ్ డ్రైవర్  ఆదిల్ జాబ్రీ, మరో క్యాబ్ డ్రైవర్ సయ్యద్ సాలేహ జాబ్రీ, వ్యాపారం నిర్వహిస్తున్న సాద బిన్ సాలేహ జాబ్రీ లను వెంట తీసుకొని హత్యకు పథక రచన చేశాడు. ఉదయం అతనితో మాట్లాడిన నిందితుడు సాయంత్రం హషామాబాద్ మెయిన్ రోడ్డు పై కార్ లో వెళ్తున్న హమీద్ ను అడ్డుకుని హత్య చేశాడు. ఈ హత్య కేసులో నిందితులైన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.