ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నగరంలో రేవ్ పార్టీ కలకలం..గుట్టు చప్పుడు కాకుండా ఫాం హౌజ్ లో అమ్మాయిలతో విచ్చల విడిగా అశ్లీల నృత్యాలు…కేసులు నమోదు చేసిన పోలీసులు

 

ఆర్సీ న్యూస్(హైదరాబాద్: నగరంలో రేవ్ పార్టీ వీడియో కలకలం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది రెండు నెలల క్రితం పాతబస్తీలో జరిగిన రేవ్ పార్టీకి సంబందించిన వీడియో. రెండు నెలల క్రితం గుట్టు చప్పడు కాకుండా ఫాం హౌజ్లో జరిగింది. ఫాం హౌజ్లలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితులు ఉన్నాయనే విషయం ఈ రేవ్ పార్టీ ద్వారా గుట్టు రట్టయ్యింది. ఆయా పోలీసుల కళ్లు కప్పి ఇలాంటి రేవ్ పార్టీలు జరుగుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. విచ్చల విడిగా అమ్మాయిలతో బరితెగించి అశ్లీల నృత్యాలు చేస్తున్న వారికి స్థానిక పోలీసుల భయం ఏమాత్రం లేదనే విషయం  స్పష్టం అవుతోంది. రేవ్ పార్టీల వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఇది మన వద్దనే జరిగిందా..అంటూ గుడ్లప్పగించి వీడియోను పదే పదే చూడడం మొదలెట్టారు. ఈనెల 5వ తేదీ నుంచి అన్ని గ్రూప్లలో చక్కర్లు కొడుతుండగా..ఒక గుర్తు తెలియని వ్యక్తి విషయాన్ని దక్షిణ మండలం పోలీసుల ద్రుష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన పోలీసులు అవునా..అంటూ ఆక్షన్లోకి దిగారు. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా చాంద్రాయణగుట్ట పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టారు. ఏమాత్రం అలస్యం చేయకుండా రేవ్ పార్టీ నిర్వహించినట్లు చెబుతున్న ఫాం హౌజ్ ను సందర్శించారు. ఫాం హౌజ్ లోపల, బయటి పరిసరాలను పరిశీలించారు. కొంత మంది సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. రేవ్ పార్టి జరిగినట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చిన చాంద్రాయణగుట్ట పోలీసులు ప్రధాన నిందితుడిపై  ఐపీసీ 294,105 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు కొనసాగిస్తున్నారు. ఫలక్ నుమా ఏసీపీ మహ్మద్ మాజిద్ పర్యవేక్షణలో చాంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్ వెంటనే స్పందించి ప్రధాన నిందితుడు ఫర్వేజ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఫర్వేజ్ తో పాటు ఎంత మంది రేవ్ పార్టీలో పాల్గొన్నారనే విషయాన్నికూడా ఆరా తీస్తున్నారు. అందరిపై కేసులు నమోదు చేయడానికి సిద్దమయ్యారు. చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని బండ్లగూడ గౌస్ నగర్ లోని ఉందా హిల్స్ లో పాతబస్తీ బార్కాస్ కు చెందిన మజ్లిస్ పార్టీ నాయకులు ఫర్వేజ్ కు ఇంఫీరియల్ ఫాం హౌజ్ ఉంది. ఫిబ్రవరి 13న, తన మిత్రులకు తన ఫాం హౌజ్ లో రేవ్ పార్టీకి ఫ్లాన్ చేశాడు. వెంటనే మధ్యవర్తిని సంప్రదించాడు. ఇతర రాష్ట్రానికి చెందిన కొంత మంది అమ్మాయిలను తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు చేయించాడు. తాగినంత మద్యం అందుబాటులో ఉంచాడు. రేవ్ పార్టిలో పాల్గొన్న అతని మిత్రులు అమ్మాయిలతో విచ్చల విడిగా అశ్లీల న్రుత్యాలు చేశారు. క్షణికానందం కోసం అడ్డగోలుగా ఏదంటే అదే చేస్తామంటే నడవదు..కేసుల్లో ఇరుక్కుని ఊచలు లెక్కించక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.