areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

భూములు ,ఫ్లాట్లు,ఖాళీ జాగాలు కొంటున్నారా..? జరా జాగ్రత్త….

భూములు ,ఫ్లాట్లు,ఖాళీ జాగాలు కొంటున్నారా..? జరా జాగ్రత్త....
 • రియల్ మోసాలను పసిగట్టండీ..ఆచితూచి అడుగేయండి
 • నకిలీ డాక్యుమెంట్ల తో మోసపోకండి:సైబరాబాద్ పోలీసులు
 • రియల్ మాయగాళ్ల మాయమాటలు నమ్మొద్దంటున్న పోలీసులు
 • జిరాక్స్ డాక్యుమెంట్స్ కాకుండా ఈసీతో పాటు యజమానులతో కలవాలి
 • భూములకు సంబందించి ఒరిజినల్ పత్రాలను పరిశీలించాలి.
 • ఫేక్ డాక్యుమెంట్స్ తో రూ. 8.50 కోట్ల మోసానికి పాల్పడిన ప్రొఫేషనల్ గ్యాంగ్ అరెస్ట్..
 • సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సంఘటన

ఆర్సీ న్యూస్,జూన్ 18 (సైబరాబాద్ ): భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు కొనాలను కుంటున్నారా..? మోసగాళ్లు ఉన్నారు జాగ్రత్త. లక్షలు,కోట్లు పెట్టి విలువైన భూములు, ప్లాట్లను ఖరీదు చేయడానికి ముందుకు వస్తున్న పలువురు ఈ మోసగాళ్ల మాయమాటలను నమ్మి మోసపోతున్నారు. కొంత మంది రియల్ ఎస్టేట్  బ్రోకర్ల తీపి కబుర్లకు, వారు చూపించే నకిలీ పత్రాలను అసలైనే పత్రాలుగా నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎంతో నమ్మకంగా మనల్ని బుట్టలో వేసుకునే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. మోసగాళ్లు ఏ రూపంలోనైనా మనల్ని మోసం చేయడానికి రెక్కలు కట్టుకుని వాలిపోతారు. నమ్మకస్తులుగా మనల్నినమ్మిస్తారు. ఎంతో తెలిసిన వారిగా దొంగ డాక్యుమెంట్లు చూపించి నిలువునా ముంచుతారు.

రియల్ మోసగాళ్ల వలలో పడకండి…

 • మోసగాళ్ల వలలో పడి సర్వస్వం కోల్పోతున్న వారిని అలెర్ట్ చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు.
 •  ఫేక్ సర్టిఫికెట్లు చూపించి బురిడీ కొట్టిస్తున్నారు.
 •  కొంత మంది కలర్ జిరాక్స్ కాఫీలను వినియోగించి మోసం చేస్తుండగా..మరొకొంత మంది నకిలీ పత్రాలను స్రుష్టించి మోసాలకు పాల్పడుతున్నారు.
 •  మరికొంత మంది మధ్యవర్తుల మాయలో పడి మోసపోతున్నారు.
 •  ఖరీదైన భూముల కొనుగోలులో దళారులను నమ్మవద్దని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
 • భూమి యొక్క అసలు టైటిల్ హోల్డర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
 •  ఏదైనా ప్లాటు, ఖాళీ భూములు, ఫ్లాట్ లను ఖరీదు చేసే ముందు తొందర పడి అడ్వాన్స్ డబ్బులు చెల్లించకుండా..ఆయా స్థలాలు,ఫ్లాట్ లకు సంబందించిన ఈసీ ( ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్) పరిశీలించాలి.
 • సంబందిత సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో ఈసీ కావాలని ధరఖాస్తు చేసుకుంటే..అప్పటికప్పడు సంబందిత రిజిష్ట్రార్ అధికారులు ఈసీ అందజేస్తారు.
 •  దీని ఆధారంగా సంబందిత తహసిల్లార్ (రెవెన్యూ) ను సంప్రదించి భూ ఆదాయ రికార్డులను పరిశీలించాలి.
 • అవసరమైన లింక్ డాక్యుమెంట్లన్నిటిని తెప్పించుకుని సరి చూసుకోెవాలి.
 •  కొనాల్సిన భూములు నచ్చితే..రియల్ బ్రోకర్లను కాకుండా టైటిల్ హోల్డర్ లను సంప్రదించి అడ్వాన్స్ లు చెల్లించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచిస్తున్నారు.
 •  రాప్ట్రంలోని హైదారాబాద్ పోలీసు కమిషనరేట్, రాచకొండ పోలీసు కమిషనరేట్,సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో రియల్ మోసాలు చాలా జరుగుతున్నాయని..అలాంటి మోసాల పట్ల ప్రజలు హుషార్ గా ఉండాలని పోలీసు కమిషనర్లు కోరుతున్నారు.
 • గుడ్డిగా ఎవరిని నమ్మవద్దని..విచారణ చేసిన అనంతరమే ఖరీదు చేయాలని ప్రజలకు సూచిస్తున్నారు.
 • ఇలాంటి మోసాలకు పాల్పడిన ఒక ముఠాను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
 •  సైబరాబాద్ పరిధిలో ఎక్కడైనా రియల్ మోసాలు జరిగితే..స్థానిక పోలీసులకు గానీ..9493625553 అనే వాట్సాఫ్ నెంబర్ కు గానీ..డయల్ 100 కు గానీ..లేదా ఎకనామిక్ నేరాల విబాగానికి గానీ ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.

ఫేక్ డాక్యుమెంట్స్ రూ. 8.50 కోట్ల మోసానికి పాల్పడిన ప్రొఫేషనల్ గ్యాంగ్ అరెస్ట్..

 • నకిలీ పత్రాలు చూపించి రిజిష్ట్రేషన్ అంటూ బాదితుడితో ఒప్పందం కుదుర్చుకుని రూ.8.5 కోట్లను కొల్టగిట్టిన 5 గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
 • వారి వద్ద నుంచి సెల్ ఫోన్లతో పాటు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
 • తూర్పు గోదావరి జిల్లా..గొల్లప్రోలు మండలానికి చెందిన ఆదినారాయణ మూర్తి తన అనుచరులతో కలిసి ఈ రియల్ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
 • రంగారెడ్డి జిల్లా..మహేశ్వరం మండలం..గొల్లూరు గ్రామంలోని 40 ఎకరాల భూమిని విక్రయానికి పెట్టిన నిందితుడు ఆదినారాయణ మూర్తి..ఎకరానికి రూ.1.40 కోట్ల చొప్పున 40 ఎకరాలకు రూ.56 కోట్ల ధర నిర్దేశించాడు.
 • నిందితుడు చెప్పిన ప్రకారం బాధితుడు రూ.8,5 కోట్లు చెల్లించారు.
 • రిజిష్ట్రేషన్ చేయాలంటూ వెంట పడడంతో నకిలీ పత్రాలను చూపించి రిజిష్ట్రేషన్ చేయించినట్లు పట్టాదార్ పాస్ బుక్ ను బాధితుడి సెల్ ఫోన్ కు  వాట్సాఫ్ ద్వారా పంపించడంతో..బాదితుడు సంబందిత కార్యాలయాలలో విచారణ చేయగా నకిలీ పత్రాలని తేలడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
 • విచారణ నిర్వహించిన ఫోలీసులు ఏ-1 నిందితుడితో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ల్ చేసి రిమాండ్ కు తరలించారు.