ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఆడపిల్లల కు సీఎం కేసీఆర్ మేన మామ లాంటి వారు….

ఆడపిల్లల కు సీఎం కేసీఆర్ మేన మామ లాంటి వారు....

ఆర్సీన్యూస్(హైదరాబాద్):  షాదీముబారక్ చెక్కులు అందుకున్న ఆడపిల్లల కు సీఎం కేసీఆర్ మేనమామ లాంటి వారని రాష్ట్ర విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో అండగా ఉంటున్నాయని.. మనమంతా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుదామన్నారు. తెలంగాణ రాష్ట్రం తరఫున శనివారం జల్ పల్లిలో రాష్ట్ర విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆమె తన నియోజకవర్గమైన మహేశ్వరం పరిధిలోని జల్ పల్లిలో షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న షాదీముబారక్ పథకంలో భాగంగా చెక్కుల కోసం ఎదురు చూస్తున్నముస్లిం కుటుంబ సభ్యులకు మంత్రి సిబితా ఇంద్రారెడ్డి అందజేసిన చెక్కులతో సంతోషం వ్యక్తం చేశారు. పవిత్రమైన రంజాన్ మాసంలో తమకు చెక్కులు అందడంతో తామంతా ఆనందంగా ఉన్నామని షాదీముబారక్ చెక్కులు అందుకున్న ముస్లీంలు అన్నారు. తమ కూతుళ్లకు పెళ్లిళ్తు అయిపోయాయని..అయితే చెక్కులు దొరకడంతో ఇప్పుడే పెళ్లిళ్లు జరగుతున్న ఆనందం తమ ఇళ్లల్లో కనిపిస్తుందని కొంత మంది ముస్లిం మహిళలు తెలిపారు. కరోనా కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నమహిళలు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దీంతో శనివారం జల్ పల్లిలో జరిగిన షాదీముబారక్ చెక్కుల పంపిణీ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…ఆడ పిల్లలకు షాదీముబారక్ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆడపిల్లల వివాహాధి శుభకార్యాల నిర్వాహణపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారన్నారు. అందుకే ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశ పెట్టి పేద యువతులకు అండగా నిలిచారన్నారు.  ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే ఎన్నోఆర్ధిక ఇబ్బందులు తలెత్తున్నాయని.. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అందుబాటులోకి వచ్చిన అనంతరం ఎక్కడ ఎలంటి ఆర్ధిక సమస్యలు తలెత్తడం లేదన్నారు. ఒకప్పడు ఆడ పిల్ల పెళ్లి చేయాలంటే..అప్పు సైతం దొరికేది కాదని..కొంత మంది ఇళ్లల్లో అన్నదమ్ములు కూడా పెళ్లి చేయడానికి ముందుకు రాకపోయే వారని..అయితే ఇప్పడు ప్రభుత్వమే డబ్బులు మంజూరు చేస్తుండడంతో అందరూ సంతోషంగా ఉంటున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు భరోసా కల్పిస్తున్నాయన్నారు. ప్రస్తుతం 15 వందల షాదీముబారక్ చెక్కుల కింద 15 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద  8,04,000 చెక్కుల పంపిణీ జరిగిందని..ఇందులో 1,70,000 చెక్కులు షాదిముబారక్ పథకం కింద ముస్లింలకు అందజేయడం జరిగిందన్నారు. 

 

పహాడీషరీఫ్ లో 50 ఆక్సీజన్ బెడ్ల సెంటర్ ప్రారంభం… 

పహాడీషరీఫ్ లో 50 ఆక్సీజన్ బెడ్ల సెంటర్ ప్రారంభం...

ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పహాడీషరీఫ్ లోని జామియాా దారుల్ హుదా వాదీ-ఏ-హుదాలో కొత్తగా ఏర్పాటు చేసిన 50 ఆక్సీజన్ బెడ్లతో కూడిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను రాష్ట్ర విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ప్రస్తుతం కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోందని..ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి తగిన ముందు జాగ్రత్త చర్యలు ఎంతో అవసరమని ఆమె సూచించారు. అత్యవసర మైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించి.. భౌతిక దూరం పాటించా లన్నారు. మనం మాస్క్ లు ధరించి మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు సమాజంలోని ఇతరులను కూడా కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవడానికి వీలు పడుతుందన్నారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. కరోనా సోకిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.