ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాత్రిపూట కరోనా కర్ఫ్యూ మే 8 పొడిగింపు..

రాత్రిపూట కరోనా కర్ఫ్యూ మే 8 వరకు

ఆర్సీ న్యూస్(హైదరాబాద్):తెలంగాణలో మే 8వ తేదీ వరకు రాత్రిపూట కరోనా కర్ఫ్యూ పొడిగించారు. ఇప్పటికే తెలంగాణలో రాత్రిపూట కరోనా కర్ప్యూ మే 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు అమలులో ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారంతో కరోనా కర్ఫ్యూ ముగుస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ప్రస్తుతం కొనసాగుతున్న రాత్రిపూట కర్ప్యూను మే 8వ తేదీ వరకు పొడిగించారు. దీంతో మరో వారం రోజుల పాటు తెలంగాణలో. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కరోనా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకుని లాక్ డౌన్ పెడతారా..? రాత్రిపూట కర్ఫ్యూ పొడిగిస్తారా..? ఏం చర్యలు తీసుకోబోతున్నారు..? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వెంటనే ఏదో ఒకటి తేల్చి చెప్పాలని కోరింది. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర సేవలను ఈ కరోనా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు సంబంధిత విధినిర్వహణ లోని అధికారులు, సిబ్బందితో సహకరించాలని కోరింది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా రాత్రిపూట కరోనా కర్ప్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు మరో మంత్రి మహ్మద్ మహమూద్ అలీ రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టే పరిస్థితులు లేవని గతంలోనే స్పష్టం చేశారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారనే పుకార్లకు చెక్ పడింది. రాత్రిపూట కర్ప్యూ ముగిసిన వెంటనే లాక్ డౌన్ విధిస్తారని ఎంతో మంది వలస కూలీలు ఇప్పటికే ఊరి బాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు వలన కూలీలతో నిండిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల పట్ల కొంత మంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మాస్క్ ధరిస్తూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాల్సి ఉండగా..కొంత మంది అసలు పట్టించుకోవడం లేదు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తున్నప్పటికీ..ఆచరణలో సాధ్యం కావడం లేదు. అందుకే పోలీసులు రంగంలోకి దిగి నిర్లక్ష్యంగా ఉన్న వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. మాస్క్ లు ధరించకపోతే.. జరిమాన విధించారు.  లా అండ్ ఆర్డర్ పోలీసులు స్థానికులతో పాటు వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ..ఎక్కడా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గ లేదు. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో హైకోర్టు జోక్యం చేసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుండగా…రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తెలియ జేయాలని..హైకోర్టు కోరింది.కరోనా కట్టడికి అవసరమైన మేరకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది.ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది.  ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే..కోర్టు స్పందించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం స్పందించింది.ప్రస్తుతం కొనసాగుతున్న రాత్రి 9 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో లాగే ఈ వారం రోజులు కూడా..రాత్రిపూట పబ్ లు, వైన్ షాప్ లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు బంద్ ఉంటాయి. ప్రజలు ఎవరూ బయట తిరగడం లాంటివి..అన్నీ బంద్. మీడియా, పెట్రోల్ బంకులు, సీఎన్జీ, ఎల్పీజీ, పవర్ జనరేషన్ డిస్ట్రీబ్యూషన్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్, ప్రొడక్షన్ యూనిట్ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్, కేబుల్ టీవీ సర్వీసెస్, డిష్ టీవీ సర్వీసెస్, ఐటీ కంపెనీస్, ఐటీ సర్వీసెస్లకు అనుమతి ఉంటుంది. వీరందరూ తగిన ఐడెంటి కార్డులను తమ వెంట ఉంచుకుని సంబంధిత పోలీసులు కోరిన వెంటనే చూపించాల్సి ఉంటుంది.అలాగే అత్యవసర సేవలకు హాజరయ్యేందుకు వెళ్లే వారి సౌకర్యార్థం ఆటో రిక్షాలు, క్యాబ్ లను అనుమతిస్తారు. ప్రయాణికుల రాకపోకల విషయంలో సంబంధిత ట్రావెలింగ్ టికెట్లు చూపిస్తే..కార్లు, ఆటోలలో ప్రయాణానికి అనుమతిస్తారు. మెడికల్ షాపులు, ఆసుపత్రులు, గ్యాస్ సరఫరా, పాల సరఫరా, న్యూస్ పేపర్ సరఫరా, అత్యవసర ఫుడ్ డెలివరీ తదితర అత్యవసర సేవలకు అనుమతి ఉంటుంది.