areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Akbaruddin owaisi : అక్బర్ బాయ్ బోలే తో…జరూర్ కరేంగే..

Akbaruddin owaisi : అక్బర్ బాయ్ బోలే తో...జరూర్ కరేంగే..
  • చార్మినార్ యునానీ హాస్పిటల్ సమస్యలను పరిష్కరిస్తాం..
  • ఈ విషయంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఇప్పటికే తనకు చెప్పారు..
  • అక్బర్ బాయ్.. చెబితే వెంటనే చేసేస్తా.. లేకపోతే ఊరుకోరు
  • చార్మినార్ ప్రభుత్వ యునాని ఆసుపత్రి లో బూస్టర్ డోస్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు..

ఆర్సీ న్యూస్, జనవరి 10(హైదరాబాద్): చార్మినార్ లోని ప్రభుత్వ యునానీ ఆసుపత్రి లో ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం ప్రారంభించారు. జిహెచ్ఎంసి, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి బూస్టర్ డోస్ అందించనున్నారు. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ లందరికీ బూస్టర్ డోస్ అందించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం చార్మినార్ లోని యునానీ ఆస్పత్రిలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ యునానీ ఆసుపత్రి విషయంపై అక్బర్ భాయి తనకు ఇంతకు ముందే వివరించారన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ కోరిన విధంగా మరిన్ని వైద్య సేవలను పెంచడానికి క్రుషి చేస్తానన్నారు.

Akbaruddin owaisi : ఒకటి రెండు రోజుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..

యునాని ఆసుపత్రి లో నెలకొన్న సమస్యలపై అక్బరుద్దీన్ ఓవైసీ తనకు వివరించారని హరీష్ రావు తెలిపారు. అక్బర్ భాయ్ బోలేతే జరూర్ కరేంగే ( అక్బర్ భాయ్ చెబితే వెంటనే చేస్తా..) నన్నారు. యునాని ఆసుపత్రి లో రోగుల సౌకర్యార్థం ఇంకా ఏవైనా అవసరముంటే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉంటే వెంటనే భర్తీ చేస్తామన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అక్బర్ భాయ్ ఏదైనా చెబితే..ఆ పని చేయించుకునేంత వరకు ఆయన వెంట పడతారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైద్య ఆరోగ్య శాఖలో ఎట్టిపరిస్థితుల్లో వైద్యుల కొరత ఉండ ఉండరాదని సూచించిన నేపథ్యంలో ఎక్కడ వైద్యుల కొరత లేకుండా వెంటనే భర్తీ చేస్తున్నామన్నారు. చార్మినార్ యునాని ఆసుపత్రి లో సైతం వైద్య సిబ్బందితో పాటు డాక్టర్ల నియామకా లను వెంటనే చేపడతామన్నారు.

టీచింగ్ డాక్టర్లందరూ రోగులకు సైతం వైద్య సేవలు అందించాలి..

అయితే టీచింగ్ స్టాఫ్ గా కొనసాగుతున్న డాక్టర్ లందరూ పేషెంట్లకు వైద్య సేవలు అందజేయాలని మంత్రి కోరారు. కేవలం విద్యాబోధనే కాకుండా రోగులకు వైద్య వైద్య సేవలు నిర్వహిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయన్నారు. ఆసుపత్రిలో రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉంటాయని ఇక్కడికి వచ్చే రోగులకు ఇక్కడే వైద్య సేవలు అందజేస్తే బాగుంటుందన్నారు. అలా కాకుండా ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి పంపించడం సరైంది కాదన్నారు. ఇక్కడికి వచ్చే రోగులకు ఇక్కడే వైద్యసేవలు అందజేస్తే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పై ఒత్తిడి తగ్గుతుంది అన్నారు. యునాని ఆసుపత్రి లో ఇంకా ఏవైనా సౌకర్యాలు అవసరం ఉంటే వెంటనే కల్పిస్తామన్నారు. 200 పడకల ఆస్పత్రి ఐన ఇక్కడ కేవలం 80 మందికి మాత్రమే వైద్య సేవలు లభించడం సరైంది కాదన్నారు. రోగుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు ఇక్కడి ఆస్పత్రిలో వైద్య సేవలు పొందడానికి రోగులు క్యూ కట్టే వారన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం బూస్టర్ డోస్…

కరోనా వైరస్ వ్యాధి బారిన పడకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ బూస్టర్ డోస్ అందజేస్తామన్నారు. వీరితో పాటు 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ అందరు బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు. 6.60 లక్షల బూస్టర్ డోస్ లను ఫ్రంట్లైన్ వారియర్స్ కు ఆంద చేయనున్నామన్నారు. కోవిడ్ వాక్సిన్ తీసుకోవడంలో ప్రతి ఒక్కరూ తమ వైద్య ఆరోగ్య సిబ్బంది తో సహకరించాలన్నారు. ఇందుకు ప్రజా ప్రతినిధుల సహకారం ఎంతో అవసరం అన్నారు. అమెరికా యూరప్ దేశాల్లో సైతం బూస్టర్ డోసులను అందజేస్తున్నారన్నారు. అక్కడి ప్రజలు ముందుకు వచ్చి బూస్టర్ డోస్ లను  తీసుకుంటున్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రజా వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు తో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.