- అసద్ కాన్వాయ్ పై జరిగిన దాడికి నిరసన.
- నిరసనలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు
- స్వచ్ఛందంగా మూతపడిన వ్యాపారాలు
- కార్యకర్తల శాంతియుత నిరసన
- శుక్రవారం మక్కా మసీదులో సామూహిక ప్రార్థనల అనంతరం నిరసన
- చార్మినార్ నుంచి శాలిబండ వరకు నిరసన తెలిపిన నాయకులు, కార్యకర్తలు
- బందోబస్తు నిర్వహించిన దక్షిణ మండలం పోలీసులు
- పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్
- ఎలాంటి సంఘటనలకు తావు ఇవ్వకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..
ఆర్సీ న్యూస్, ఫిబ్రవరి 04( హైదరాబాద్): పాతబస్తీలో శుక్రవారం మజ్లిస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శుక్రవారం కావడంతో మక్కా మసీదులో సామూహిక ప్రార్థనలు జరుగుతాయి. ఈ సామూహిక ప్రార్థన లో నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. సామూహిక ప్రార్థనలను పురస్కరించుకొని దక్షిణ మండలం పోలీసులు ప్రతి శుక్రవారం అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమాలు సందర్భంగా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఇతర అదనపు బలగాలను రంగంలోకి దింపిన దక్షిణ మండలం పోలీసులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మక్కా మసీదులో ప్రార్థనలు అనంతరం ముస్లిం యువకులు చార్మినార్ ప్రధాన రోడ్డుపై నిరసన తెలిపారు. మక్కా మసీదు నుంచి శాలిబండ లోని అసలు ఆస్పత్రి వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. శాలిబండ కార్పొరేటర్ ముజఫర్ ఈ నిరసన ర్యాలీ లో పాల్గొన్నారు. నిరసన ర్యాలీ సందర్భంగా కొద్దిసేపు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ లో అప్రమత్తంగా పోలీసులు..
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌పై కాల్పుల ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ప్రార్థనలు కావడంతో ముందు జాగ్రత్తగా పాతబస్తీలో పోలీసు బలగాలను మోహరించారు. పాతబస్తీలో సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచారు. చారిన్మార్, దానిపరిసర ప్రాంతాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకున్న అసద్.. హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
అసద్ కు “జడ్” క్యాటగిరి: కేంద్ర హోంశాఖ నిర్ణయం
కాగా, కాల్పుల ఘటన నేపథ్యంలో ఒవైసీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసద్ భద్రతపై సమీక్ష నిర్వహించిన కేంద్ర హోం శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. 22 మంది సెక్యూరిటీ సిబ్బంది ఆయనకు భద్రతను కల్పించనున్నారు. ఇందులో 4 నుంచి 6 మంది వరకు ఎన్ ఎస్ జీ కమాండోస్, పోలీస్ పర్సనల్ ఉండనున్నారు. ఢిల్లీ పోలీసులతో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇతర సిబ్బంది తో పాటు ఒక ఎస్కార్ట్ కారు అందుబాటులో ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అయితే జెడ్ కేటగిరీ బందోబస్తును అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకిస్తున్నారు. తనను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అంటున్నారు.
దేశంలో రాజకీయ దుమారం..
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పై జరిగిన దాడితో దేశంలో రాజకీయ దుమారం నెలకొంది. ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓవైసీ పై జరిగిన దాడి సంఘటనకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత కలిగింది. రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంది. తనపై జరిగిన దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందని దీని వెనుక కుట్రదారులు ఎవరో తెలియాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ ఓవైసీ ఒకవైపు డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఘోరంగా పరాజయం పొందనున్న నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ అనవసరంగా దాడి రాద్ధాంతం చేస్తున్నారని ఉత్తరప్రదేశ్ బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సంఘటన కలకలం సృష్టిస్తోంది.
More Stories
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం..
Chervugattu : శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి Full Story.
Tata unveils new mobile showrooms : ఇంటి వద్దకే టాటా కార్ల షోరూం..