- డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ తో పాటు విదేశీయుల కట్టడికి చర్యలు..
- మత్తు పదార్థాలు అన్నీ విదేశాల నుంచే సరఫరా..
- డ్రగ్స్ సరఫరా చేసే పబ్ యజమానులపై కఠిన చర్యలు..
- నగరంలో జరిగిన పబ్ యజమానుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆర్సీ న్యూస్, జనవరి 31 (హైదరాబాద్): డ్రగ్స్ సరఫరాను అరి కట్టాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అప్రమత్తమైంది. సీఎం ఆదేశాల మేరకు డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అరికట్టడానికి నడుం బిగించింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ తో పాటు విదేశీయులను పట్టుకొని వారి వారి దేశాలకు పంపించాలని.. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం నగరంలో పబ్బుల యజమానులతో సమావేశం నిర్వహించారు. పబ్బుల్లో సరఫరా చేయకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎవరైనా తమకు తెలిసిన సమాచారాన్ని 1800 425 2523 టోల్ ఫ్రీ నెంబర్ కు కు ఫిర్యాదు చేయవచ్చు అని అన్నారు. ఫిర్యాదుదారుని సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లో…
హైదరాబాద్ అంటేనే భరోసా..
- ఒడిశా ఏపీ లలో గంజాయి ఎక్కువ సాగు చేస్తున్నారు..
- అక్కడి నుండి గంజాయి కొని కొంతమంది హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
- అలాంటి వారిని గుర్తించి అరెస్టు చేసి పిడి యాక్టులు పెడుతున్నాం..
- వివిధ రకాల మార్గాల్లో వివిధ రకాల పేర్లతో నగరంలో డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతున్నయని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది .
- ఎక్కడ గాంజా డ్రగ్స్ దందా నడిచిన ఉక్కుపాదం మోపమని సీఎం చెప్పారు..
- ఎక్కువగా పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఉందని మా దృష్టికి వచ్చింది.
- పబ్బులో డ్రగ్స్ తో పట్టుబడితే మీ వెనకాల ఎవరు ఉన్న ఉపేక్షించేది లేదు…
- డ్రగ్స్ వినియోగదారుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్న వారిని కూడా వడలవద్దని ముఖ్యమంత్రి చెప్పారు
- పబ్బుల్లో యజమానులు డ్రగ్స్ వాడకం దృష్టి పెట్టాలి.. జాగ్రత్తగా గమనించాలి.
- ఎక్సయిజ్ అండ్ పోలీస్ టీం జాయింట్ టీం ఎప్పటికప్పుడు పబ్బులను పర్యవేక్షిస్తూ ఉంటుంది..
- పబ్బుల్లో డ్రగ్స్ వాడకం వెలుగులోకి వస్తే ఆ పబ్బులను నిరభ్యంతరంగా సీజ్ చేస్తాం..
- డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి.. అంతేగాని పబ్బులో డ్రగ్స్ అమ్మి సంపాదిస్తామ్ అంటే కుదరదు .
- మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ అమ్మిన మా డిపార్ట్మెంట్ నుండి తప్పించుకోలేరు.
- పబ్బులో కఠినంగా వ్యవహరించండి.
- డ్రగ్స్ పై పిర్యాదులు చేయడానికి హెచ్చరించడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ కనిపించేలా పెట్టండి..
- కొందరు పబ్బుల్లో అక్రమ దందాలు చేస్తున్నారని మాకు సమాచారమ్ వచ్చింది.
- పబ్స్ వచ్చిన వారు ఎన్ని సిగరేట్ లు తగుతున్నారు.. ఒక సిగరెట్ ను మరో నలుగురు పంచుకుంతున్నారా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి
- పబ్బుల్లో విచ్చలవిడిగా సొండ్స్ పెడుతున్నారు.. సరి చేసుకోవాలి..
- పక్కన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిమితికి లోబడి సౌండ్స్ సిస్టమ్స్ పెట్టాలి…
- పబ్బులపై పర్యవేక్షణ లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిని అప్పటికప్పుడు సస్పెండ్ చేస్తాం.
- పబ్బుల్లో డ్రగ్స్ వాడుతున్నట్టు మీకు అనుమానమ్ వస్తే వెంటనే వారి వివరాలు మాకు ఇవ్వండి..
- వెంటనే మా పోలీసులు స్పందించి వారిని అదుపులోకి తీసుకుంటారు .
- మీ కొడుకులే ఈ డ్రగ్స్ అలవాటు పడితే మీరు ఎంకరేజ్ చేస్తారా..
- పబ్బుల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు మీ దృష్టి వస్తే 18004252523 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించండి..
More Stories
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం..
Chervugattu : శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి Full Story.
Tata unveils new mobile showrooms : ఇంటి వద్దకే టాటా కార్ల షోరూం..