ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

పిస్తా హౌజ్ హలీం వచ్చేసింది… రెండో ఏడాదికి

పిస్తా హౌజ్ హలీం వచ్చేసింది

రంజాన్ వచ్చిందంటే..పిస్తా హౌస్ హలీంకు డిమాండ్…

ఆర్సీ న్యూస్ (హైదరాబాద్): ఏడాదిగ చూసిన పిస్తా హౌజ్ హలీం ఈసారి అందుబాటులోకి వచ్చింది. 2020 (గతేడాది) లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా హలీం తయారీ నిలిచి పోయింది. దీంతో హలీం ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రజల ఆరోగ్య రీత్యా హలీం మేకర్స్ హలీం తయారీకి ముందుకు రాలేదు. అంతేకాకుండా లాక్ డౌన్ కావడంతో పాటు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హలీం తయారీ జరగ లేదు. హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశాలు నిర్వహించి ప్రజల రక్షణతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి జరగడంతో 2020లో హలీం తయారీ జరగ లేదు. కోట్లాది రూపాయలు వ్యాపారం నష్టం జరుగుతున్నప్పటికీ..ప్రజా శ్రేయస్సు దృష్ట్యా హలీం మేకర్స్ చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు పలువురు వారిని అభినందించారు. గతేడాది ఎక్కడా హలీం దొరక లేదు. హలీం కోసం తహతహలాడిన వారికి కొంత నిరాశే కలిగినా..ఆరోగ్యం కోసం అందరూ ఈ నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఇక అప్పటి నుంచి ఎప్పుడెప్పుడా..అని ఎదురు చూసిన హలీం ఈసారి తిరిగి అందుబాటులోకి వచ్చింది. 

ఈ నెల 14వ తేదీ నుంచి…

ఈ నెల 14వ తేదీ నుంచి హలీం అందుబాటులోకి రావడంతో హలీం ప్రియులు సంతోషం వ్యక్తం చేశారు. హలీం కేంద్రాలకు వెళ్లి హలీం ఖరీదు చేస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో హలీం అందుబాటులో ఉంది. పలు హోటళ్ల నిర్వాహకులు హలీం తయారీలో నిమగ్నమయ్యారు. దీంతో హలీం తినడం కోసం హలీం ప్రియులు క్యూ కడుతున్నారు. గిరాకీ కూడా పెరిగింది. ‘టేక్ అవే’ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మాస్కులు ధరించి..భౌతిక దూరం పాటించాలని కోరుతూ హలీం కేంద్రాల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. మైకుల ద్వారా తగిన ముందు జాగ్రత్తలపై అవగాహన కలిగిస్తున్నారు. హలీం కావాల్సిన వారు దానిని ఇంటికి తీసుకెళ్లడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో హలీం విక్రయ కేంద్రాల వద్ద వినియోగదారుల రద్దీ కనిపిస్తుంది.

రంజాన్ వచ్చిందంటే..పిస్తా హౌస్ హలీంకు డిమాండ్…

రంజాన్ మాసం వచ్చిందంటే చాలు…పిస్తా హౌజ్ హలీంకు డిమాండ్ పెరుగుతుంది. ప్రతి రంజాన్ మాసంలోనే పిస్తా హౌజ్ హలీంను తయారు చేసి విక్రయిస్తోంది. గతేడాది లాక్ డౌన్ కారణంగా రంజాన్ మాసంలో హలీం తయారు చేయ లేదు. హలీం మేకర్స్ నిర్ణయం మేరకు పిస్తా హౌజ్ యాజమాన్యం కూడా హలీం తయారీని విరమించుకుంది. దీంతో గతేడాది నుంచి ఎదురు చూసిన హలీం ప్రియులకు తిరిగి ఈ రంజాన్ లో అందుబాటులోకి వచ్చింది. గతంలో లాగా ఎక్కువ కేంద్రాలలో ఫిస్తా హౌజ్ హలీం విక్రయాలను చేపట్టలేదు. కేవలం 20 ఫ్రాంచైజీలలోనే హలీంను విక్రయిస్తోంది. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు, ప్రసంశ పత్రాలు అందుకున్న పిస్తా హౌజ్ నాణ్యత విషయంలో ఎప్పుడు రాజీ పడ లేదని ఫిస్తా హౌజ్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ మాజిద్ ‘ఆర్సీ న్యూస్’ ప్రతినిధికి తెలిపారు. గతంలో కన్నా..ఈసారి పిస్తా హౌజ్ హలీం రేట్ పెంచింది. ఫుల్ ప్లేట్ హలీం ధరను రూ.220 గాను..ఫ్యామిలీ ఫ్యాక్ ధరను రూ. 890 గాను నిర్దారించి విక్రయుస్తున్నారు.

రంజాన్ ఇఫ్తార్ విందులో..

రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు రోజంతా కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ…ఐదు సార్లు నమాజు చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించిన అనంతరం ఇప్తార్ విందులో పాల్గొంటారు. ఈ ఇఫ్తార్ విందులో తప్పని సరిగా హలీం తింటారు. దీంతో రంజాన్ మాసంలో హలీంకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కొంత మంది ఉమ్మడి కుటుంబ సభ్యులు తమ తమ ఇళ్లలోనే తయారు చేయించుకుంటున్నారు. కొంత మంది హోటల్స్ నుంచి తెప్పించుకుంటున్నారు. ముఖ్యంగా పిస్తా హౌజ్ హలీం కోసం చాలా మంది ఆరాటపడుతుంటారు. దీంతో నెల రోజుల పాటు పిస్తా హౌజ్ హలీంకు గిరాకీతో పాటు డిమాండ్ కూడా ఉంటుంది.