- ఇప్పటికే పలువురిపై ఫిర్యాదులు ఉన్నాయి..
- ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో రౌడీ షీటర్ లను కట్టుదిట్టం చేస్తాం..
- పురాని హవేలీ లోని పాత భవనాన్ని సందరీకరిస్తాం..
- పాతబస్తీలో పర్యటించిన నగర పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్..
- ముందుగా మక్కా మసీదులో సామూహిక ప్రార్థనలు పరిశీలించిన కమిషనర్..
- అనంతరం పురాని హవేలీ లోని ఓల్డ్ పోలీస్ కమిషనర్ కార్యాలయం సందర్శన..
- శిథిలావస్థకు చేరిన కార్యాలయ భవనాన్ని పరిశీలించి వెంటనే మరమ్మతులకు ఆదేశించిన సి వి ఆనంద్..
ఆర్సీ న్యూస్, జనవరి 07 (హైదరాబాద్): నగర పోలీస్ కమిషనర్ గా ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన సి వి ఆనంద్ శుక్రవారం దక్షిణ మండలం లోని పాతబస్తీలో పర్యటించారు. పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారి పాత బస్తీ లో పర్యటించారు. ముందుగా చార్మినార్ చేరుకున్న ఆయన చార్మినార్, మక్కా మసీద్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. శుక్రవారం సందర్భంగా మక్కా మసీదు లో నిర్వహించిన సామూహిక ప్రార్దనలను ఆయన పరిశీలించారు. కొంతమంది స్థానికులతో ముచ్చటించారు. శాంతి భద్రతల విషయంపై కొద్దిసేపు సంబంధిత పోలీసు అధికారులతో చర్చించారు. అనంతరం అక్కడి నుంచి పురాని హవేలీ లోని ఓల్డ్ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. గతంలో ఇక్కడ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పని చేసేది. ఇక్కడి నుంచే నగర పోలీస్ కమిషనర్ తమ కార్య కలాపాలను కొనసాగించే వారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం బషీర్ బాగ్ ప్రాంతానికి మారింది. అయినప్పటికీ..ఇప్పటికీ ఇక్కడ పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ భవన ప్రాంగణంలోనే దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ కార్యాలయం, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ తదితర కార్యాలయాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ ఈ ఓల్డ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనాన్ని సందర్శించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంటనే భవన మరమ్మత్తుల కోసం ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులతో చర్చలు జరిపిన ఆయన అవసరమైన మేరకు మరమ్మతులు చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. హెరిటేజ్ భవనం కావడంతో కూల్చే ప్రసక్తి లేదని.. సుందరీకరణ పనులను మాత్రమే చేపట్టి అందుబాటులోకి తెస్తామని ఆయన ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు. పాత భవనాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత,అవసరం అందరిపై ఉందన్నారు. అంతకు ముందు దక్షిణ మండలం డి సి పి డాక్టర్ గజరావు భూపాల్, అదనపు డిసిపి మహమ్మద్ రఫీక్ తదితరులతో పాటు ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాతబస్తీలో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచి స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రౌడీషీటర్ల పై నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తాను కొత్తగా నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పాతబస్తీ సందర్శించడం జరిగింద న్నారు. పాతబస్తీ ప్రజలకు స్థానిక పోలీసులు పూర్తిగా ఫ్రెండ్లీ పోలీసులు గా వ్యవహరిస్తున్నారన్నారు. స్థానికులకు ఎక్కడ ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నా రన్నారు. ఓల్డ్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని పున రుద్ధరిస్తామన్నారు. దక్షిణ మండలం పురానీ హవేలీ లోని పాత పోలీసు కమిషనర్ కార్యాలయం లోని ఆఫీసులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీవీ ఆనంద్ తగిన చర్యలకు శ్రీకారం చుట్టారు. గత నెల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీవీ ఆనంద్ పంజాగుట్ట మోడల్ పోలీస్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదే విధంగా పాతబస్తీలో పర్యటించారు. దాదాపు 2 గంటల పాటు పాత పోలీసు కమిషనర్ కార్యాలయములోని డిసిపి ధక్షిణ మండలము, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసులను తనిఖీ చేసి సందర్శకుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, కమాండ్ కంట్రోల్ సెంటర్, హెల్ప్ డెస్క్, పార్కింగ్ వంటి అంశాలను పరిశీలించారు. పోలీసు కార్యాలయానికి వచ్చే ఫిర్యాదు దారులతో సిబ్బంది ప్రవర్తన పోలీసు సేవలు ఏ విధముగా ఉన్నాయో పరిశీలించారు. పోలీసుల పనితీరును తెలుసుకోవడానికి ఈ రోజు కార్యాల యాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని ఆయన వివరించారు.
More Stories
Telangana Elections 2023 : నామినేషన్ల స్వీకరణకు పూర్తయిన తగిన ఏర్పాట్లు..
Hyderabad : నగరంలో వరద నీటి సమస్యకు చెక్..
దేశానికే ఆదర్శం.. డబుల్ బెడ్ రూమ్ పథకం..