areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Telangana : డ్రగ్స్ వినియోగం పై ఉక్కుపాదం…

Telangana : డ్రగ్స్ వినియోగం పై ఉక్కుపాదం...
  • డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ..
  • గంజాయి,డ్రగ్స్ వినియోగం అమ్మకాలపై గట్టి నిఘా..
  • అన్ని పబ్స్ లో సిసి కెమెరాల ఏర్పాటు..
  • సీసీ కెమెరాలు లేకపోతే సీజ్..
  •  ఎక్సైజ్ శాఖ తో సీసీ కెమెరాల అనుసంధానం..

ఆర్సీ న్యూస్, ఏప్రిల్ 09 (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పై గట్టి నిఘా ఏర్పాటు చేసి అమ్మకాలు జరగకుండా ఉక్కుపాదం మోపుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. అర్థరాత్రి వరకు కొనసాగే పబ్లలో గట్టిగానూ ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సీసీ కెమెరాలు లేని సీజ్ చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజా హోటల్‌లో రాష్ట్రంలో ఉన్న పబ్ యజమానులతో రాష్ట్ర ఎక్సైజ్‌ మంత్రివర్యులు శ్రీ. వి.శ్రీనివాస్‌ గౌడ్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో పని చేస్తామన్నారు. సీఎం కేసీఆర్  ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నామ‌న్నారు. హైదరాబాద్‌లో మొత్తం 61 పబ్స్ ఉన్నాయన్నారు. అన్ని పబ్‌లలో సీసీ కెమెరాలు తప్పకుండా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు లేని పబ్‌లను వెంటనే సీజ్ చేస్తామన్నారు. పబ్బుల్లోని సీసీ కెమెరాలతో ఎక్సైజ్ శాఖకు అనుసంధానిస్తామన్నారు. పబ్‌లలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, శని, ఆదివారాల్లో 1 గంట వరకు పబ్‌లను క్లోజ్ చేయాలని, 24 గంటల లైసెన్స్ తీసుకున్న బార్‌లు మాత్రమే సర్వీస్ చేయాలని   పేర్కొన్నారు. పబ్‌ల‌లో డ్రగ్స్ వినియోగం జరగకుండా పబ్ యజమానులే బాధ్యత వహించాలని, డ్రగ్స్ వినియోగంపై పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. 

నిబందనలు పాటించని పబ్ ఓనర్లు ఎంతటివారైన ఉపేక్షించేది లేదన్నారు  నిబంధనలు పాటించని అన్ని ప‌బ్‌లు, బార్‌ల‌పై నిరంతరం దాడులను కంటిన్యూ చేస్తామని తేల్చి చెప్పారు. పబ్బుల నిర్వహణలో సంబంధిత యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. కఠిన చర్యలు తప్పవన్నారు.