areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కరోనా కట్టడిలో కేంద్రం విఫలం: అసదుద్దీన్ ఓవైసీ.

కరోనా కట్టడిలో కేంద్రం విఫలం అసదుద్దీన్ ఓవైసీ

ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్): దేశంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సెకండ్ వేవ్ వస్తుందని తెలిసినా..దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ నగరంలోని ఆగాపురా ఫంక్షన్ హాల్లో జరిగిన ’రిలీఫ్ ప్యాకేజ్ ఫర్ హైదరాబాద్ కోవిడ్-19 పేషంట్స్‘ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మజ్లిస్ ఛారిటీ ఎడ్యుకేషనల్ అండ్ రిలీఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ రోగులకు అవసరమైన మెడికల్ కిట్, ఆక్సీజన్ రీ-ఫిల్లింగ్, ఆరోగ్య సలహాలు,సూచనలు  ఉచితంగా అందజేయడానికి ఒక హెల్ఫ్ లైన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ హెల్ఫ్ లైన్ కు ఫోన్ చేసి అవసరమైన సేవలన్నింటిని ఉచితంగా పొందాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

 • ఆరు నెలల క్రితమే ప్పపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ..పేఎం నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.
 •  దేశంలో కరోనా కట్టడిని తాము అత్యంత చాకచక్యంగా వ్యవహరిచి ఖతం చేసినట్లు దేశ పార్లమెంట్ లో ప్రకటించుకున్న నరేంద్ర మోడీ ఇప్పుడేమి సమాధానం చెబుతారన్నారు.
 •  దేశంలో వందలు,వేలల్లో ప్రజలు చనిపోతుండగా..నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
 •  కేవలం ఆక్సీజన్ కొరతతో ప్రజలు చనిపోవడం సిగ్గు చేటన్నారు.
 • దేశ వ్యప్తంగా ఆసుపత్రులలో ఆక్సీజన్ అందుబాటులో లేక పదుల సంఖ్యలో కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారన్నారు.
 •  శ్మశాన వాటికల్లో శవాలను పూడ్చడానికి జాగాలు దొరకడం లేదన్నారు.
 •  దేశంలో ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోందన్నారు. 
 • ఆత్మ నిర్బర్ భారత్..అంటావ్..ఎక్కడ. సౌదీ నుంచి ఆక్సీజన్ అంటున్నావు..రష్యా ఇస్తానంటోంది..ఇక ఇంకెక్కడి ఆత్మ నిర్బర్ భారత్ అని ఆయన నిలదీశారు. 
 • సెకండ్ వేవ్ కరోనా కట్టడిలో కేంధ్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దన్నారు. 
 • ఆక్సీజన్ లేదు..వెంటిలేటర్లు లేవు..వాక్సినేషన్ సక్రమంగా జరగడం లేదు…చనిపోయే వారు చనిపోతున్నారు…ఆసుపత్రుల్లలో బెడ్స్ దొరకడం లేదు..వీటిని పట్టించుకునే వారు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 • రెండు రోజుల ముందు తేలుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పడు ఆర్డర్స్ ఇస్తోందని..ఎనిమిది నెలల వరకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
 •  వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభలో పీఎం నరేంద్ర మోడీ మాట్లాడుతూ..దేశంలో కరోనాను ఖతం చేశామని చెప్పుకొచ్చారు. 
 • అంతేకాకండా పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు అందరూ పేఎం నరేంద్ర మోడీకి వంత పాడారు..అవును కరోనాను తామే కట్టడి చేశామని చెప్పుకొచ్చారు. 
 • ఎక్కడ కట్టడి జరిగింది..చనిపోయే వారు చనిపోతున్నారు..నేను ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున మరణాలను..చూడ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 •  దేశంలో 10 కోట్ల వరకు వాక్సినేషన్ చేయాలి..మన వద్ద కేవలం రెండు కోట్ల వాక్సినేషన్ మాత్రమే జరుగుతోందని..ఇలా అయితే మూడో వేవ్ కరోనా వైరస్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
 •  ఫీఎం కేర్ ఫండ్ నుంచి డబ్బులు తీసి దేశంలోని 80 శాతం మందికి పైగా ఉచితంగా వాక్సినేషన్ కొనసాగించాలని ఆయన నరేంద్ర మోడీని కోరారు.
 •  దేశ ప్రజలందరికి ఉచితంగా వాక్సినేషన్ చేయించాల్సిన భాద్యత కేంద్ర ప్పభుత్వంపై ఉందన్నారు.
 •  ప్రస్తుతం కోవాక్సీన్,కోవీషీల్డ్..ఏ వాక్సిన్ అందుబాటులో లేదన్నారు. 
 • అందరికి వాక్సిన్ అందించినప్పుడే ప్రజల ప్రాణాలను కరోనా వైరస్ నుంచి కాపాడ కలుగుతామన్నారు.
 •  గతంలో తబ్లీఖీ జమాత్..అన్నారు..ఇప్పడేమైంది..అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. 
 • కరోనా విలయ తాండవం చేస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది..ఇప్పడు ఎన్నికలు అవసరమా..అని ఆయన ఎస్ఈఎస్ ను నిలదీశారు.
 •  దేశంలో మీడియా ఇప్పటికైనా కళ్లు తెరవాల్సి ఉంది..మీ కంటికి కనిపించడం లేదా..? దేశ ప్రధానిని మీరు ప్రశ్నించ లేరా..దేశంలో జరుగుతున్న మరణాల విషయాలను దేశ ప్రధాని నరేంద్ర మోడీకి చూపించ లేరా…ఇప్పటికైన బయటికి రండి..జరుగుతున్న మారణహోమం కట్టడికి సహకరించండి అని ఆయన నేషనల్ మీడియానుద్దెశించి అన్నారు.
 •  దేశ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించి..భౌతిక దూరం పాటించాలని..ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని ఆయన కోరారు.
 •  యువకులే ఈసారి ఎక్కువగా కరోనా బారిన పడి మరణిస్తున్నారని..టీకాలు వేసుకోవడంలో నిర్లక్యం వీడాలన్నారు.