areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

న్యూ ఢిల్లీ లో ఆరు రోజుల పాటు లాక్ డౌన్…

ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆరు రోజుల పాటు లాక్ డౌన్..

ఆర్సీ న్యూస్( న్యూ ఢిల్లీ): న్యూ ఢిల్లీలో కరాోనా డేంజర్ బెల్స్ మోగిస్తొంది. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కీలక నిర్ఱయం తీసుకున్నారు. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి ఆరు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు..అంటే వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని వెల్లడించారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో కరోనా వైరస్ వ్యాప్తి  సెకండ్ వేవ్ జోరుగా కొనసాగుతోంది. కేంధ్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసకుంటున్నప్పటికీ..కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో న్యూ ఢిల్లీలో  రోజుల పాటు స్మాల్ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. లాక్ డౌన్ ప్రకటన వెలువడగానే ఒకవైపు వలస కార్మికులు,కూలీలు తమ స్వస్థలాలకు బయలు దేరుతుండగా..మందు బాబులు మాత్రం వైన్ షాప్ ల వద్ద క్యూ కట్టారు.

కరోనా కట్టడికి ఇప్పటికే నైట్ కరోనా కర్న్యూ విధించినా…

కరోనా కట్టడికి ఇప్పటికే నైట్ కరోనా కర్న్యూ విధించినప్పటికీ కేసుల నమోదు తగ్గడం లేదు. మాస్క్ లు వాడుతూ..భౌతిక దూరం పాటించాలని సంబంధిత అధికారులు స్థానికులకు గత కొంత కాలంగా అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. రోడ్లపై వాహనదారులు తప్పని సరిగా మాస్క్ లు ధరించేటట్లు చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ..పరిస్థితిలో ఏమాత్రం మార్పులు కనిపించక పోగా..గత మూడు రోజుల్లో పాజిటివ్ కేసులు రెట్టింపు అయ్యాయి. గత 24 గంటల్లో టక్ష మందికి పైగా పరీఓలు నిర్వహించగా…23,500 కరోనా పాజిటివ్ కేసులు నమోద య్యాయి.రాత్రి పూట కరోనా కర్ప్యూ విధించినప్పటికీ..అదుపులోెకి రాకపోవడమే కాకుండా పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో ముఖ్యమంత్రి లాక్ డౌన్ వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులు అదుపు తప్పకుండా ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తగిన చర్యలు తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. దీంతో కరోనా కట్టడికి మరో మార్గం లేదని భావించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంబందిత మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు.

 ప్రజల ఆరోగ్యం కాపాడడానికి లాక్ డౌన్…

 ప్రజల ఆరోగ్యం కాపాడడానికి లాక్ డౌన్ విధించక తప్పదని ఆరు రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ…తమ వద్ద ఉన్న ఆస్పత్రులు కోవిడ్-19 రోగులతో నిండిపోయాయన్నారు. ఇప్పటికే ఆక్సిజన్ కొరతతో పాటు అత్యవసరంగా వినియోగించే రెమిడెసివిర్ ఇంజక్షన్లు కూడా అందుబాటులో లేవు. కేంధ్ర ప్రభుత్వం రెమిడెసివిర్ ఇంజక్షన్స కొరత లేకండా చూడాలని కోరడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఆక్సిజన్,రెమిడెసివిర్ ఇంజక్షన్లు మానిటరింగ్ కోసం కమిటినీ ఏర్పాటు చేసి కేంధ్ర ప్రభుత్వం వద్దకు పంపడం జరిగిందన్నారు. ఆంటి వైరల్ డ్రగ్ అవసరాన్ని ఇప్పటికే కేంధ్ర ప్రభుత్వానికి వివరించడం జరిగిందన్నారు. 

వలస కూలీలు..కార్మికులు ఎక్కడికి వెళ్లొద్దు..ఆదుకుంటాం

 లాక్ డౌన్ ప్రకటన వెలువడిన వెంటనే న్యూ ఢిల్లీలోని వలస కార్మికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు, కింది స్థాయి సిబ్బంది సొంత ఊర్లకు వెళ్లడానికి సిద్దమయ్యారు. తట్ట బుట్ట సర్దుకుని రైల్వే స్టేషన్లు,బస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్న వలస కూలీల సంఖ్య పెరిగిపోయింది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ..ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని..ఇది కేవలం 6 రోజుల స్మాల్ లాక్ డౌన్ మాత్రమేనని  స్పష్టం చేశారు. కూలీలందరిని ఆదుకుంటా మని ప్రకటించారు.

‌‌

‌‌‌‌‌‌

 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌