మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఏపీ లో అమలు లోకి పగటిపూట కర్ప్యూ… 

 ఏపీ లో అమలు లోకి పగటిపూట కర్ప్యూ...

ఆర్సీ న్యూస్(విజయవాడ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నుంచి పగటిపూట కర్ఫ్యూ అమలు  లోకి వచ్చింది. రాజుకు 18 గంటల కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం నుంచి కర్ఫ్యూ ఉంటుందన్న విషయాలను రెండు,మూడు రోజుల ముందు నుంచే ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేసింది. ముందుగానే పగటి పూట కర్ప్యూ విధింపు సమాచారం తెలియడంతో చాలా మంది ప్రజలు అవసరమైన మేరకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ..కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గ లేదు. కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా కట్టడి కోసం సంబందిత అధికారులు ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ..కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. కేసుల పెరుగుదలతో పాటు మరణాలు కూడా అధికంగానే జరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇప్పటికే రాత్రిపూట కర్ప్యూ కొనసాగుతోంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు రాత్రిపూట కర్ప్యూ అమలులో ఉంది. కేసుల తీవ్రత తగ్గకపోవడంతో బుధవారం నుంచి పగటిపూట కర్ప్యూ విధింపుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి పగటి పూట కర్ప్యూను విధించింది. తెల్లవారు జామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమలు లోకి వచ్చింది. అంటే ప్రతి రోజు 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు ఇతర వ్యాపార సంస్థలన్నీ యథావిధిగా పని చేస్తాయి. అయితే గుంపులు, గుంపులుగా ప్రజలు రోడ్లపై తిరగ రాదు. వ్యాపార సంస్థల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే..144 సెక్షన్ అమలులోె ఉంటుంది. నిత్యావసర వస్తువుల ఖరీదుతో పాటు అత్యవసర కార్యకలాపాలన్నీ కొనసాగించ వచ్చు. పగటి పూట కర్ప్యూ అమలులో ఉన్నప్పటికీ..అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం ఉంటేనే ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి రావాలన్నారు. కర్ప్యూ అమలులో ఉన్న సమయంలో స్థానిక ప్రాంతాలకు చెందిన ప్రజలు విధినిర్వాహణలోని అధికారులతో పూర్తిగా సహకరించాలని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని..వారికి అవసరమైన వైద్య సేవలను అందించడానికి వైద్య సిబ్బంది సిద్దంగా ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ సోకిన రోగులందరికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని సంబందిత వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించారు.కచ్చితమైన వైద్య సేవల కోసం ఇప్పటికే 77,78 జీఓలను విడుదల చేయడం జరిగిందన్నారు. కరోనా వైరస్ రోగులకు ఆరోగ్య శ్రీ లో వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కరోనా కట్టడికి తమ వైద్య బ్రందం నిరంతరం కృషి చేస్తున్నా రన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉందన్నారు.

అనవసరంగా ఇళ్ల నుంచి బయటికి వచ్చి కరోనా వైరస్ భారిన పడకుండా ఉండాలని సంబంధిత వైధ్యాధికారులు కోరుతున్నారు. ఇదిలావుండగా..ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో కరోనా వైరస్ కొత్త(స్టైన్) పుంతలు తొక్కుతోంది. ఇది ఇప్పటి కన్నా..15 విధాలుగా పరిణామం చెందుతోందని సంబందిత వైద్యాధికారులు చెబుతున్నారు.