- కేవలం రూ. 13,999 నెలసరి వాయిదాలతో మీ సొంతం..
- లేటెస్ట్ ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదలైన బాలోనో కార్..
- ఎక్స్ షోరూమ్ ధర రూ. 6,35 లక్షల నుంచి రూ.9,45 లక్షల వరకు..
- మలక్ పేట్ జెమ్ నెక్సా షో రూమ్ లో మార్కెట్లోకి విడుదల చేసిన హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ..
ఆర్సీ న్యూస్, ఫిబ్రవరి 27(హైదరాబాద్): పెట్రోల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతున్న ఈ రోజుల్లో ఒక లీటర్ పెట్రోల్ తో అత్యధికంగా మైలేజీ కోరుకునే వాహనదారులకు మారుతి బాలెనో ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఒక లీటర్ కు 22 కిలోమీటర్ల మైలేజీతో పాటు లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బాలెనో కారు ఆదివారం మార్కెట్లోకి విడుదలైంది. లేటెస్ట్ ఫీచర్స్ తో అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో మార్కెట్లోకి వచ్చింది. రవాణా అవసరాలు తీర్చడమే కాకుండా ఎకనామిక్ ఫరం గా వాహన యజమానులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తిగా ఒకేసారి డబ్బులు చెల్లించ లేని వారి సౌకర్యార్థం వాయిదా పద్ధతిలో కూడా మారుతి బాలెనో లభిస్తుంది. నెలకు కేవలం రూ.13,999 తెలిస్తే చాలు మారుతి బాలెనో మీ సొంతమవుతుంది.
Baleno 2022 car full details : లేటెస్ట్ ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదలైన బాలోనో కార్..
- మలక్‌పేటలోని జెమ్ నెక్సా షోరూమ్‌లో కొత్త మారుతి బలేనో కారును హోంమంత్రి మహమూద్‌అలీ చేతులమీదుగా..జెమ్ నెక్సా మానేజింగ్ డైరెక్టర్ రాజుయాదవ్ మరియు సీ.ఈ.ఓ కల్పన రావు సమక్షంలో మార్కెట్లోకి విడుదల చేసారు.
- ఈ కొత్త మారుతి సుజుకి బలేనో సిగ్మా,డెల్టా,జెటా ఆల్ఫా మరియు రెండు ఆప్షనల్ మోడల్స్‌లలో విడుదలైంది.
- ఈ లేటెస్ట్ మోడల్ని కనెక్టెడ్ టెక్నాలజీతో రూపొందించారు.
- మెటాలిక్ కలర్ ఆప్షన్స్‌తో..కొత్త ఫ్రంట్ గ్రిల్,ఎల్.ఈ.డీ హెడ్ ల్యాంప్స్,డీ.ఆర్.ఎల్స్ తో ఎక్స్టీరియర్ ఉంటుంది.
- డీప్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఇంటీరియర్,360 డిగ్రీస్ వ్యూ,హెడ్-అప్ డిస్ప్లే,ఆర్క్మేస్ క్లియర్ స్పీకర్స్,సుజుకి కనెక్ట్ యాప్‌తో 40 కనెక్టెడ్ ఫీచర్స్ ఇందులో ఇచ్చారు.
- సేఫ్టీకి ఎక్కువ ప్రయారిటీనిచ్చి ఈ కొత్త బలేనోలో ఏ.బీ.ఎస్ సిస్టంతోపాటు..6 ఎయిర్ బ్యాగ్స్ ఇందులో ఉన్నాయి.
- 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో విడుదలైన ఈ కార్ ఒక లీటర్‌కి 22 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
- ఈ కొత్త మారుతి సుజుకి బాలేనో కారుని నెలసరి వాయిదాలలో కూడా అందుబాటులో ఉంచారు.
- నెలకు 13 వేల 999 రూపాయల వాయిదా పధ్ధతిలో ఈ కారుని కొనుగోలు చేయవచ్చు.
- ఈ కొత్త మారుతి సుజుకి బాలేనో 6 లక్షల 35 వేల నుండి 9 లక్షల 49 వేల ఎక్స్ షో రూమ్ ప్రైజ్‌తో జెమ్ నెక్సా షోరూమ్‌లలో అందుబాటులో ఉంది.
- ఇంకా ఈ కార్యక్రమంలో షోరూమ్ జనరల్ మానేజర్ వి.శ్రీనివాస్ మరియు షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు.
More Stories
కోట్లు కొల్లగొడుతున్న ఓటీటీ ప్లాట్ ఫాం ఓవర్ ద టెలివిజన్..