- మిలియన్ల లో సబ్స్క్రైబర్లు.. కోట్లలో ఆదాయం..
- నెంబర్ వన్ స్థానం పై ఆరాటం..
- అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ దేశంలో మాత్రం ఆదాయంలో వెనుకబడ్డ డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
- దేశంలో నెట్ ఫ్లిక్స్ అత్యధికంగా ఆదాయాన్ని సంపాదిస్తోంది.
ఆర్సీ న్యూస్, జనవరి 28 (హైదరాబాద్): ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న ఓటీటీ ప్లాట్ ఫాం లో నువ్వా.. నేనా..అనే పోటీ కొనసాగుతోంది.
- ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అత్యధిక వీవర్ షిప్ కలిగి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సమాచారాన్ని ఒక యూజర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
- ఆయన చేసిన ట్వీట్ ప్రకారం.. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు.
- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రైబర్లు లలో మొదటి స్థానం పొందినప్పటికీ ఆదాయంలో మాత్రం వెనుకబడింది.
- ప్రపంచంలో నెట్ ఫ్లిక్స్ మొదటి స్థానాన్ని సంపాదించినప్పటికీ.. భారతదేశంలో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించడం లేదు.
- భారతదేశంలో నెట్ ఫ్లిక్స్ 6 మిలియన్ల సబ్స్క్రయిబ్ కలిగి 1,700 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది.
ఓటీటీ ప్లాట్ ఫాం లో ఎంటర్టైన్మెంట్ కీలకం..
- కాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 45 మిలియన్ల సబ్స్క్రయిబ్ ఉన్నన్నప్పటికీ..రూ. 1500 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే పొందుతోంది.
- నెట్ ఫ్లిక్స్ లో ప్రతిరోజు అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ప్రసారం చేస్తుండగా.. హాట్ స్టార్ లో ఫుట్ బాల్, క్రికెట్, స్పోర్ట్స్ కు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది.
- అంతేకాకుండా హెచ్ బి ఓ కాంటెంట్తో పాటు డిస్నీ కాంటెంట్ లతో కార్యక్రమాలను రూపొందించి ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తోంది.
- ఇదిలా ఉండగా ఆమేజాన్ ఫ్రైమ్ వీడియో 20 మిలియన్ల సబ్స్క్రయిబ్ కలిగి ఉన్నప్పటికీ రూ.1,300 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది.
- ఈ ఆదాయ వివరాలను ఒక యూజర్ తన ట్విట్టర్ ద్వారా పొందుపరిచాడు.
- అయితే సబ్స్క్రయిబ్ సంఖ్య కచ్చితంగా ఉన్నప్పటికీ.. ఆదాయంపై ఖచ్చితమైన సమాచారం మాత్రం అందుబాటులో లేదు.
- ఆయన తన ట్విట్టర్ ద్వారా ఈ ఓటీటీ సమాచారాన్ని ట్వీట్ చేశాడు.
- ప్రస్తుతం ఈ సమాచారం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.
- దీని ప్రకారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్,అమెజాన్ ప్రైమ్ వీడియో.. ప్లాట్ ఫామ్ ల వివరాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
- ప్రస్తుతం ఈ సమాచారంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
- ట్వీట్లు, రీ-ట్వీట్ చేస్తూ సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు.
More Stories
Baleno 2022 car full details : 22 కిలోమీటర్ల మైలేజీ తో లేటెస్ట్ బాలెనో కార్..