సెప్టెంబర్ 15, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కర్ప్యూ,లాక్ డౌన్ లపై 48 గంటల్లో స్పందింకపోతే.. : హైకోర్టు

కర్ప్యూ, లాక్ డైన్ లపై 48 గంటల్లో స్పందింకపోతే

ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్): రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుండగా…రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తెలియ జేయాలని..హైకోర్టు కోరింది. కరోనా కట్టడికి అవసరమైన మేరకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది. కరోనా కట్టడికి న్యూ ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇక్కడ మాత్రం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడం లేదు..ఇదేంటి..? అని ప్రశ్నించింది.  కుంభమేళాలో పాల్గొన్న వారు ఇక్కడికి వస్తున్నారు..మీరు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని నిలదీసింది. కరోనా కర్ఫ్యూ, లాక్ డౌన్ విధించడానికి  రాబోయే 48 గంటల్లో కోర్టుకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే..కోర్టు స్పందించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. దేశంలోెని పలు ప్రాంతాల్లో కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వాలు స్పందిస్తున్నాయని పేర్కోంది. ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు తగిన సలహాలు,సూచనలు ఇవ్వడానికి నోడల్ అధికారిని ఎవరినైనా నియమించారా..? అని ప్రశ్నించింది.

ఒకవైపు కరోనా వైరస్ బారిన పడి రోెగులు చనిపోతుంటే…

ఒకవైపు కరోనా వైరస్ బారిన పడి రోెగులు చనిపోతుంటే..మరోవైపు పబ్ లు, వైన్ షాఫ్ లు, సినిమా థియేటర్లను నడపడం ఏమిటని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీలో నమోదైన పాజిటివ్ కేసుల వివరాలను వార్డుల వారిగా అందుబాటులో ఉంచాలన్నారు. డీజీపీ,ఆరోగ్య శాఖ సమర్పించిన వివరాలు తప్పుల తడకగా ఉందని..రాజకీయ సమావేశాలని నియంత్రింకపోతే ఎలా..? ప్రశ్నించింది. కేవలం మానటరింగ్ మాత్రమే అంటే సరిపోదని తప్పు పట్టింది. వివాహాది శుభకార్యాలను కట్టడి చేయల్సి ఉందని..వందల సంఖ్యలో ప్రజలు గుమిగుడకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. రాష్ట్రంలో కరోనా కట్టడితో పాటు ఆరోగ్య పరిస్థితులపై మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను  సమర్పించాలని ఆదేశించింది. కేంధ్ర ప్రభుత్వ ఆదేశాలు,సూచనల మేరకే తాము ఎప్పటికప్పడు తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టు ముందు హాజరైన రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కోర్టు కు తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 23 కు కేసును వాయిదా వేసింది.