సెప్టెంబర్ 16, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

తెలంగాణ లో రాత్రిపూట కరోనా కర్ఫ్యూ పొడిగింపు..

తెలంగాణలో రాత్రిపూట కరోనా కర్ఫ్యూ పొడిగింపు..

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ లో రాత్రిపూట కరోనా కర్ఫ్యూ మరో వారం పాటు పొడిగించారు. ఈనెల 15వ తేదీ వరకు రాత్రిపూట కర్ప్యూ అమలులో ఉంటుంది. రాష్ట్రంలో గత నెల 20 వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు అమలులోకి వచ్చింది. మొదటగా మే 1 వ తేదీ తెల్లవారు జామున 5 గంటల వరకు అమలులోకి రాగా..మరో వారం రోజుల పాటు అంటే..ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించారు. శనివారం తెల్లవారు జాముతో రెండో వారం వరకు పొడిగించిన రాత్రిపూట కర్ఫ్యూ గడువు ముగుస్తుంది. దీంతో శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాత్రిపూట కర్ప్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాత్రిపూట కర్ప్యూ ఈ నెల 15వ తేదీ తెల్లవారు జామున 5 గంటల వరకు అమలులో ఉంటుంది. వివాహాది శుభకార్యాలలో 100 మందికి మించకుండా నిర్వాహకులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సోమేష్ కుమార్ తెలిపారు. అలాగే అంత్యక్రియలకు దాదాపు 20 మందికి మించకుండా హాజరుకావాలని కోరారు. రాజకీయ సభలు,సమావేశాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. అత్యవసర సేవలను ఈ కరోనా కర్ప్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రజలు సంబందిత విధినిర్వాహణలోని అధికారులు, సిబ్బందితో సహకరించాలని కోరింది. ప్రజా ఆరోగ్యం ద్రుష్ట్యా రాత్రిపూట కరోనా కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల పట్ల కొంత మంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మాస్క్ ధరిస్తూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన మార్గ దర్శకాలు జారీ చేస్తున్నప్పటికీ..ఆచరణలో సాధ్యం కావడం లేదు. అందుకే పోలీసులు రంగంలోకి దిగి నిర్లక్ష్యంగా ఉన్న వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. మాస్క్ లు ధరించకపోతే..రూ. 1000 జరిమాన విధించారు.  లా అండ్ ఆర్డర్ పోలీసులు స్థానికులతో పాటు వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ..ఎక్కడా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గ లేదు. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో హైకోర్టు రెండు,మూడు సార్లు జోక్యం చేసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుండగా…రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తెలియజేయాలని..హైకోర్టు కోరింది.హైకోర్టు ఆదేశాలను, సూచనలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూను విధిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట పబ్ లు, వైన్ షాప్ లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు, ప్రజలు బయట తిరగడం..అన్నీ బంద్ అయ్యాయి.సాధారణ ప్రజలకు ఎవరికీ మినహాయింపు లేదు. మీడియా, పెట్రోల్ బంకులు, సీఎన్జీ, ఎల్పీజీ, పవర్ జనరేషన్ డిస్ట్రీబ్యూషన్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్, ప్రొడక్షన్ యూనిట్ సర్వీసెన్, ఇంటర్నెట్ సర్వీసెస్, కేబుల్ టీవీ సర్వీసెస్, డిష్ టీవీ సర్వీసెస్, ఐటీ కంపెనీస్, ఐటీ సర్వీసెస్లకు అనుమతి కొనసాగుతోంది. వీరందరూ తగిన ఐడెంటి కార్డులను తమ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది.అలాగే అత్యవసర సేవలకు హాజరయ్యేందుకు వెళ్లే వారి సౌకర్యార్థం ఆటో రిక్షాలు, క్యాబ్ లను అనుమతిస్తున్నారు.ప్రయాణికుల రాకపోకల విషయంలో సంబంధిత ట్రావెలింగ్ టికెట్లు చూపిస్తే..కార్లు, ఆటోలలో ప్రయాణానికి అనుమతి కొనసాగుతోంది.మెడికల్ షాపులు, ఆసుపత్రులు, గ్యాస్ సరఫరా, పాల సరఫరా, న్యూస్ పేపర్ సరఫరా, అత్యవసర ఫుడ్ డెలివరీ తదితర అత్యవసర సేవలకు అనుమతి కొనసాగుతోంది. .