areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సైబరాబాద్ పోలీసు కుటుంబాలకు స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్…

సైబరాబాద్ పోలీసు కుటుంబాలకు స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్…

 

  • మూడు రోజుల్లో 12000 మంది పోలీసు కుటుంబాకు వాక్సినేషన్..
  • ఇప్పటికే సైబరాబాద్ సీపీ పరిధిలో పోలీసులకు 98 శాతం టీకాలు
  • ప్రస్తుతం పోలీసు కుటుంబాలకు వాక్సినేషన్..
  • అందరూ సద్వినియోగం చేసుకోవాలంటున్న సీపీ సజ్జనార్
  • లాక్ డౌన్ సడలింపు తర్వాత రోడ్ల మీదకు రావద్దు..
  • నిబంధనలు భేఖాతరు చేస్తే..కేసులతో పాటు వాహనాల స్వాధీనం..

ఆర్సీ న్యూస్ (హైదరాబాద్): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు కుటుంబ సభ్యులందరికి ఉచితంగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి.సజ్జనార్ తెలిపారు. రాబోయే 3 రోజుల పాటు సైబరాబాద్ పోలీసు కుటుంబాలకు స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని 98 శాతం పోలీసు సిబ్బందికి వాక్సినేషన్ పూర్తి అయ్యిందన్నారు. ఇక పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులందరికి ఉచితంగా టీకా వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాబోయే మూడు రోజుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసుల కుటుంబ సభ్యులకు టీకాలు వేయిస్తున్నామన్నారు. కమిషనరేట్ పరిధిలో దాదాపు 12000 మంది పోలీసు కుటుంబ సభ్యులకు టీకాలను అందించనున్నామన్నారు. ఉచితంగా వేసే ఈ టీకాలను ప్రతి పోలీసు కుటుంబం తీసుకోవాలన్నారు. మన కోసం ఏర్పాటు చేసిన ఈ టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సైబరాబాద్ సీపీ కార్యాలయం,బాలానగర్ జోన్, శంషాబాద్ జోన్ లలో గురువారం పోలీసు కుటుంబాలకు స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ప్రారంభించిన మొదటి రోజే దాదాపు 5000 మందికి టీకాలు వేశారు.  సైబరాబాద్ లో 2000 మంది సీపీఓ,హెచ్ టీ ఆర్ సిబ్బందికి, మాధాపూర్ జోన్,ట్రాఫిక్ పోలీసు కుటుంబాలకు టీకాలు వేశారు.ఇక శంషాబాద్ జోన్ నుంచి 1500 మంది పోలీసు కుటుంబ సభ్యులు, బాలానగర్ జోన్ నుంచి 1500 పోలీసు కుటుంబ సభ్యులు గురువారం టీకాలు తీసుకున్నారు. రాబోయే 3 రోజుల్లో సైబరాబాద్ సీపీ పరిధిలోని మొత్తం 12000 మంది పోలీసు కుటుంబ సభ్యులకు టీకాలు వేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.వాక్సినేషన్ సందర్బంగా  పోలీసు కుటుంబ సభ్యులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా సంబందిత అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. పోలీసు కుటుంబ సభ్యులు అందరూ టీకాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సందర్బంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి.సజ్జనార్ మాట్లాడుతు..ఈ నెల 10వ తేదీ నుంచి పగటిపూట లాక్ డౌన్ తొలగించడం జరిగిందన్నారు. అయితే రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంటుండడంతో ఆంక్షలను కఠినంగా అమలు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.  ప్రజలు ఎవరూ రాబోయే పది రోజుల్లో రాత్రిపూట అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని ఆయన ప్రజలను కోరారు. ఒకవైపు కొనసాగుతున్న లాక్ డౌన్ అమలు తీరును పరిశీలిస్తునే మరోవైపు పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబ సభ్యులకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించిన అనంతరం పోలీసు కుటుంబాలకు ఇస్తున్న టీకాలను పరిశీలించారు. ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ వరకు అమలు చేస్తున్న రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలను పాటించాలని కమిషనర్ సూచించారు. ప్రస్తుతం లాక్ డౌన్ పటిష్టంగా అమలు జరుగుతుందన్నారు. మరో పది రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగుతున్నందున ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి బాధ్యులు కావద్దన్నారు. ఈనెల 19వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట లాక్ డౌన్ అమలో ఉంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ లో సడలింపు ఉందని.. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలే తప్పా..సడలింపు సమయం ముగిసిన అనంతరం కూడా బయటకు వస్తే కేసులు తప్పవన్నారు. ఈ పది రోజుల పాటు రాత్రిపూట లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయనున్నామన్నారు. అనవసరంగా రోడ్లమీదకు వచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మెడికల్ తదితర అత్యవసర పనులు లేకుండా పట్టుబడితే..తప్పనిసరిగా కేసులు నమోదు చేయడమే కాకుండా వాహనాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఇప్పటి వరకు అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ చక్కగా అమలు జరిగిందన్నారు. విధినిర్వాహణ లోని పోలీసులకు స్థానిక ప్రజలు  సహాయ సహకారాలను అందజేయడంతో లాక్ డౌన్ చక్కగా అమలు జరుగుతోందన్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ సడలింపు సమయం ముగిసిన వెంటనే తనిఖీలను ముమ్మరం చేస్తున్నామన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు రోడ్లపై వాహనాల రాకపోక లను పూర్తిగా కట్టడి చేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాలలో గుంపులు గుంపులుగా ఉండకుండా మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన ప్రజలకు  సూచించారు.