ఏప్రిల్ 16, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

పటిష్టంగా లాక్ డౌన్..పరిశీలించిన డీజీపీ

పటిష్టంగా లాక్ డౌన్..పరిశీలించిన డీజీపీ

నగరంలోని అన్ని జోన్ల పరిధిలో ఆయన సంబంధిత పోలీసు కమిషనర్,డీసీపీ,ఏసీపీ లతో కలిసి కలియ తిరిగారు.

  • యువత వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి..
  • గత రెండు రోజుల్లో పెరిగిన పాజిటివిటీ రేటు
  • ఈ నెల 23న..2242 ఉండగా..25న, 3821 గా నమోదు
  • 23న, 19 మంది చనిపోతే..25న, 23 మంది చనిపోయారు.

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): నగరంలో కొనసాగుతున్న లాక్ డౌన్ అమలు తీరును డీజీపీ మహేందర్ రెడ్డి మంగళవారం స్వయంగా పరిశీలించారు. నగరంలోని అన్ని జోన్ల పరిధిలో ఆయన సంబంధిత పోలీసు కమిషనర్,డీసీపీ,ఏసీపీ లతో కలిసి కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు జరుగుతుందన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి బాధ్యులు కావద్దన్నారు. లాక్ డౌన్ విధించిన 20 గంటల సమయంలో ఇంటి వద్దే సురక్షితంగా ఉండాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలతో పాటు పాతబస్తీలో కూడా లాక్ డౌన్ చక్కగా అమలు జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తు న్నారన్నారు. కొంతమంది యువకులు కావాలని రోడ్ల మీదకు వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి పాల్పడుతున్నారన్నారు. కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉన్నందున తామంతా ఇళ్లలోనే ఉండాలన్నారు. సకాలంలో వైద్య సేవలు పొందడమే కాకుండా కరోనా వైరస్ కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారందరూ ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా కోలుకుంటున్నారని ఆయన వివరించారు. కొంతమంది తమకు కరోనా వైరస్ సోకిందని అనవసరంగా భయాందోళ నలకు గురవుతుండటంతో అక్కడక్కడ దుర్వార్తలు వస్తున్నాయన్నారు. మరణిస్తు న్నారని ఆయన తెలిపారు. నిలకడగా తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు పరిశీలించు కుంటూ వైద్యులు సూచించిన సలహాలు, సూచనలతో పాటు అవసరమైన ఐసోలేషన్ మెడికల్ కిట్లు వాడుతున్న వారు కరోనా వైరస్ బారి నుంచి తమను తాము కాపాడు కుంటున్నారన్నారు. లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేస్తే..కరోనా వైరస్ చైన్ ను ఆపడానికి వీలు కలుగుతుందన్నారు. కరోనా కట్టడికి రోడ్లపై వాహనాల రాకపోక లను కట్టడి చేస్తున్నామన్నారు. దీనికి అందరి సహకారం ఎంతో అవసరమని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రజలను కోరారు.

ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు…

  • ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు విధినిర్వహణ లోని పోలీసులు అప్రమత్తమయ్యారు.
  •  ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద రాకపోకలను కట్టడి చేస్తున్నారు.
  • ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపైకి వస్తున్న వాహన దారులను తనిఖీ చేస్తున్నారు.
  • వారి వద్ద అవసరమైన మేరకు అనుమతులు, ఈ-పాస్ లు ఉన్నాయా..? లేవా..? అనే విషయాన్ని ఆరా పరిశీలిస్తున్నారు.
  • సరైన అనుమతి పత్రాలు ఉన్న వారిని వదిలేసి..ఎలాంటి పత్రాలు లేని వారికి లాక్ డౌన్ పై అవగాహన కల్పించి కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు.
  • నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
  • లాక్ డౌన్ ను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు కొనసాగుతున్నాయి.
  • లాక్ డౌన్ ఉన్నప్పటికీ..కొంతమంది ఎలాంటి అత్యవసర పరిస్థితులు లేనప్పటికి.. రాకపోకలు సాగిస్తుండడంతో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలున్నాయని.. లాక్ డౌన్ ను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి భావించి విధినిర్వహణలో పోలీసు బాస్ లకు ఆదేశాలు జారీ చేశారు.
  • దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు రాకపోకలను కట్టడి చేస్తున్నారు.
  •  ముఖ్యంగా నగరంలోని అన్ని జోన్ లకు చెందిన పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎలాంటి అనుమతి పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు.

గత రెండు రోజుల్లో…పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు…

  • ఈ నెల 23వ తేదీ ఆదివారం అధికారిక లెక్కల ప్రకారం సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్రంలో 2242 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..రెండు రోజుల అనంతరం అంటే 25వ తేదీ మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 1579 పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
  • ఈ నెల 25 మంగళవారం సాయంత్రం వరకు 3821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ..రెండు రోజుల్లో పాజిటివిటీ రేట్ పెరిగింది.
  • తగ్గాల్సిన పాజిటివ్ కేసులు..ఎందుకు పెరిగాయని సంబందిత అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో..పరిశీలిస్తున్నారు.
  •  ఆరోజు 23న,కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొందుతూ 19 మంది చనిపోగా..ఈరోజు అంటే రెండు రోజుల అనంతరం మరణాలు నాలుగు పెరిగి..23 గా నమోదైనట్లు ప్రజా ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ వెల్లడించారు.
  • ఇక, 23న ఆదివారం 5,53,277 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా…ఇందులో 5,09,663 మంది వైద్య సేవలు పొంది కోలుకున్నారు. వైద్య సేవలు పొందుతూ కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది.
  • అదే విధంగా 23న, రాష్ట్రంలో 92.11 శాతం, దేశంలో 88.3 శాతం రికవరీ రేటు ఉండని డైరెక్టర్ వెల్లడించారు. అంటే కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొంది రికవరి అవుతున్న వారు 91 శాతానికి పైగా ఉంటున్నారు.
  • ఇక 25న..రాష్ట్రంలో 92.52 శాతం, దేశంలో 89.2 శాతం రికవరి రేట్ ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
  • సో..కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్లో కూడా గత రెండు రోజుల్లో పాజిటివ్ కేసులు తగ్గకపోగా..1579 కేసులు పెరిగాయి.
  • ఇకనైనా రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండడం బెటర్.