ఆర్సీ న్యూస్(హైదరాబాద్): మంత్రి ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి, దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి ఈటెల వివరణ ఇచ్చేంత వరకు రాజకీయ దుమారం కొనసాగింది, రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుండగా.. మరోవైపు రాజకీయ దుమారం మొదలైంది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను శుక్రవారం కొన్నిఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ పక్కన పెట్టినట్లు కనిపించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా పేదల భూములు కబ్జా అంటూ తెలుగు మీడియా ఛానల్స్ గొంతెత్తాయి. కరోనా విషయాలను కాస్సేపు పక్కన పెట్టినట్లు వినిపించింది. తెర వెనుక ఏం జరిగిందో రాజకీయ పరిశీలకులకు ముందే తెలిసినప్పటికీ..సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు వెలువడ్డాయి. మంత్రి ఈటెల రాజేందర్ భూ భాగోతం..ఈటెల భూ కబ్జా..అంటూ హెడ్డింగులు పెట్టి లైవ్ నడిపించాయి. కొన్ని ఛానల్స్ ఈటెలకు వ్యతిరేకంగా కథనాలు నడపగా..మరికొన్ని ఛానల్స్ ఈటెల రాజేందర్ కు అనుకూలంగా కథనాలు వినిపించాయి. మొత్తం మీద శుక్రవారం రాత్రి మంత్రి ఈటెల రాజేందర్ హడావుడిగా లైవ్ లోకి వచ్చి విలేకరుల సమావేశం నిర్వహించేంత వరకు తెలంగాణలో రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాల విషయాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్ర ఛీప్ సెక్రటరి సోమేష్ కుమార్ చేత ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో ఈ అంశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఈటెల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చేంత వరకు వివిధ రకాలుగా మీడియా ఛానల్స్ తమ కథనాలను వినిపించాయి. ఈటెలను పక్కన పెట్టడానికే కావాలని ఇదంతా జరుగుతోందని కొందరు వ్యాఖ్యానిస్తే…పేదల భూములను కబ్జా చేయడం సరైంది కాదంటూ మరొకొందరూ వ్యాఖ్యానించారు. ఈటెలపై వేటు పడుతుందని..లేదు ఆయనే రాజీనామా చేస్తారని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న కీలక సమయంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే అనుమానాలను రేకెత్తించాయి. తపపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఈటెల రాజేందర్ కొట్టి పడేస్తూనే…ఎవరి చరిత్ర ఏంటో తన వద్ద ఉందని అన్నాడు. వంద రూపాయలు అడుక్కుని స్కూటర్లపై వెళ్లిన వారు ఇప్పడు వందలు, వేల కోట్లు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు. తాను ఎక్కడా..ఎప్పుడు తప్పుడు పనులు చేయలేదని..కష్టించి పైకొచ్చిన తనను వేలెత్తి చూపించ లేరన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించిన సమాచారం తెలిసిందని..సిట్టింగ్ న్యాయమూర్తితో విచారించిన తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తాను ఎవరికి భయపడనన్నారు. ఈటెల ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే…
- తనపై పథకం ప్రకారం స్కెచ్ వేసిన పెయిడ్ న్యూస్ ఛానల్స్ దుమారం లేపాయి.
నేను వీటిని పట్టించుకోను. నేను ప్రజల మనిషిని. కష్టించి పైకొచ్చాను. శ్రమజీవిని.
- కావాలని నా క్యారెక్టర్ని దెబ్బతీస్తున్నారు.
- ముందు అనుకున్నట్లుగా ప్రణాళికా బద్దంగా నాపై విషం చిమ్ముతున్నారు.
- అసైన్డ్ భూముల కబ్జా అంటూ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారు.
- నేను ఎక్కడా అసైన్డ్ భూములను కబ్జా చేయలేదు. ఏ విచారణకైన సిద్దమే
- నా కుమారుడు పూనాలో చదువుకుని వచ్చిన అనంతరం 2016లో లేటెస్ట్ హాచరీస్ పెట్టాలని కోరారు.
- తాను అచ్చంపల్లి-హాకీంపేట్ మధ్యన 6 లక్సల రూపాయలతో 40 ఎకరాల భూమి కొని ఫౌల్ట్రీ ఫామ్ పరిశ్రమను ప్రారంభించాను.
- మళ్లీ కెనెరా బ్యాంక్ ద్వారా రూ. 100 కోట్ల రుణం తీసుకుని మరో 7 ఎకరాలు కొన్నాను.
- నేను ఖరీదు చేసిన భూమి చుట్టూ అసైన్డ్ భూములున్నాయి. ఫౌల్ట్రీ పరిశ్రమకు భూమి ఎక్కువ అవసరం ఉంటుంది. అయితే అసైన్డ్ భూములు కొనలేం..అమ్మలేం..కాబట్టి ఆయా భూములను తిరిగి ప్రభుత్వానికి ఇవ్వమని రైతులను కోరారు.వారు అలాగే చేశారు. నేను ఎవరిని మోసం చేయ లేదు. ఇప్పటికి ఆ భూములు ఆయా రైతుల వద్దే ఉన్నాయి. వ్యవసాయానికి పనికి రాని భూములవీ. నేను ఇప్పటి వరకు వాటిని వాడుకోలేదు.సీఎంఓ కార్యదర్శి సలహా మేరకే తాను అలా చేశాను. ఎక్కడా తప్పు చేయలేదు. అందుకే భయపడడం లేదు.
- 1986లో ఫౌల్ట్రీ ఫామ్ వ్యాపారంలోెకి వచ్చిన తాను 1992 లోనే వ్యాపారాభివ్రుద్ది సాధించాను.
- సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో బతికినన్ని. ఆత్మ గౌరవం కంటే పదవులు గొప్ప కాదు.
- ముదిరాజ్ కులం నాది. భయపడే జాతి కాదు నాది
- 2004 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియ యూనివర్సిటీకి చెందిన ఎంతో మంది విధ్యార్థులు జైళ్లకు వెళితే..వెంటుండి విడిపించుకున్నా.
- నాపై జరుగుతున్న దాడి పట్ల ఎంతో మంది నాకు ఫోన్లు చేసి రోధిస్తున్నారు.
- నేను ఎవరికి పడను. ఎలాంటి విచారణనైనా ఎదుర్కోవడానికి సిద్దం
- నిజాలను నిగ్గు తేల్చకుండా ఏది పడితే అది చూపించే పేయిడ్ ఛానల్స్ వైఖరి మార్చుకోకపోతే ప్రజలు మిమ్మల్ని పాతరేస్తరు జాగ్రత్తా..అంటూ మంత్రి ఈటేల రాజేందర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
1 thought on “మంత్రి ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు…”